శాడిస్ట్ భర్త రాజేష్ అరెస్ట్: 'కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి నివేదిక'
చిత్తూరు: శాడిస్ట్ భర్త రాజేష్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. రాజేష్‌తో పాటు అతని తండ్రి కుమారస్వామి రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
వారికి జడ్జి రిమాండ్ విధించారు. జడ్జి ఆదేశాల మేరకు గంగాధర నెల్లూరు పోలీసులు వారిని రిమాండుకు తరలించారు. అంతకుముందే, రాజేష్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Recommended Video


అంతకుముందు నన్నపనేని పరామర్శ
అంతకుముందు, భర్త చేతిలో తీవ్ర చిత్రహింసలకు గురై తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శైలజను ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి సోమవారం పరామర్శించిన విషయం తెలిసిందే.

కఠిన చర్యలు తీసుకునేలా నివేదిక
శైలజ ఆరోగ్య పరిస్థితి గురించి నన్నపనేని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలితో మాట్లాడి ఘటన వివరాలు ఆరా తీశారు. అనంతరం రాజకుమారి మాట్లాడారు. శైలజపై కిరాతకంగా దాడికి పాల్పడిన ఆమె భర్త రాజేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు.

శైలజ భర్త, మామపై పోలీసులు కేసు నమోదు చేశారని
బాధితురాలు శైలజకు అండగా ఉంటామని నన్నపనేని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి శైలజ భర్త, మామపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

రాజేష్ విషయం వెలుగులోకి
కాగా, మోతరంగనపల్లెకు చెందిన కుమారస్వామి రెడ్డి కొడుకు రాజేష్‌కు శైలజతో మూడు రోజుల క్రితం పెళ్లైన విషయం తెలిసిందే. అయితే పెళ్లైన తొలి రోజు శోభనం రాత్రినే ఆమెను చిత్రహింసలకు గురి చేసిన విషయం తెలిసందే. ఆమె రోదిస్తూ గది బయటకు వచ్చింది. దీంతో రాజేష్ విషయం వెలుగు చూసింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications