గాలి ముద్దుకృష్ణమనాయుడు వారసుడెవరు?

Posted By:
Subscribe to Oneindia Telugu

చిత్తూరు: టిడిపి సీనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు హఠాత్తుగా మరణించడంతో నగరి నియోజకవర్గంలో టిడిపి ఇంచార్జీ బాధ్యతలు టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ఎవరికీ అప్పగిస్తారనే చర్చ ప్రారంభమైంది.

టార్గెట్ 2019: కర్నూల్ జిల్లాలో త్వరలో జనసేనాని టూర్, పవన్ ప్లాన్ ఇదే

  Former AP Minister and TDP MLC Gali Muddukrishnama Naidu Lost Life

  ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో నగరి నియోజకవర్గంలో టిడిపి బాధ్యతలను ఎవరికి దక్కనున్నాయనే విషయమై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

  బాబు ఉండగా జెఎసి ఎందుకు, కేంద్రం మాటలను నమ్మేది లేదు: కేశినేని సంచలనం

  మాజీ మంత్రి , టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు నాలుగు రోజుల క్రితం హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో నగరి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జీ భాద్యతల విషయమై చర్చ తెరమీదికి వచ్చింది.

  మా పోరాటం ఫలించింది:సీఎం రమేష్, రాజ్యసభ వాయిదా తర్వాత ఏం జరిగిందంటే?

  నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.ఈ తరుణంలో త్వరలోనే నగరి అసెంబ్లీ స్థానానికి టిడిపి ఇంచార్జీ బాధ్యతలపై చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

  అజాత శత్రువు ముద్దుకృష్ణమనాయుడు

  అజాత శత్రువు ముద్దుకృష్ణమనాయుడు

  మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడుకు అజాతశత్రువుగా పేరుంది. అన్ని పార్టీలకు చెందిన నేతలతో ముద్దుకృష్ణమనాయుడుకు సంబంధాలున్నాయి. దీని కారణంగానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు చిత్తూరు జిల్లా నుండి ఎమ్మెల్సీగా ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ఏడాది ముందే అనారోగ్య కారణాలతో గాలి ముద్దుకృష్ణమనాయుడు మృత్యువాత పడడంతో రాజకీయ వారసత్వం గురించి చర్చ తెరమీదకి వచ్చింది.

  తండ్రికి తోడుగా కొడుకులు రాజకీయాల్లో

  తండ్రికి తోడుగా కొడుకులు రాజకీయాల్లో


  నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో బరిలో దిగిన గాలి ముద్దుకృష్ణమనాయుడుకు ఇద్దరు కొడుకులు చేదోడు వాదోడుగా ఉన్నారు. అయితే రానున్న ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధిగా గాలి ముద్దుకృష్ణనాయుడు కొడుకుల్లో ఎవరు రంగంలోకి దిగుతారనే విషయమై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది

  ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు

  ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు


  2015లో గాలి ముద్దుకృష్ణమనాయుడు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. పదవి కాలం ఇంకా పూర్తి కాలేదు.దీంతో ఎమ్మెల్సీ స్థానానికి కూడ ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదు. అయితే ఎన్నికల షెడ్యూల్ విడదుల కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఎమ్మెల్సీ పదవికి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబంలో ఎవరు ఆసక్తి చూపుతారు, పార్టీ నాయకత్వం ఎవరికీ ఈ పదవిని కట్టబెట్టనుందనే విషయాలపై చర్చ సాగుతోంది.

  నగరి టిడిపి బాధ్యతలు ఎవరికి

  నగరి టిడిపి బాధ్యతలు ఎవరికి

  నగరి టిడిపి అసెంబ్లీ ఇంచార్జీగా గాలి ముద్దుకృష్ణనాయుడు కొనసాగుతున్నాడు అయితే ముద్దుకృష్ణమనాయుడు మరణంతో కొత్త వ్యక్తికి ఈ బాధ్యతలను కట్టబెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.. ముద్దుకృష్ణమనాయుడు కొడుకుల్లో ఎవరు ఈ పదవిపై ఆసక్తిని చూపుతారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. వీరిద్దరిలో ఒకరికి ఈ బాధ్యతలను అప్పగిస్తారా, సీనియర్ నేత ఎవరికైనా ఈ పదవిని కట్టబెడతారా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉందంటున్నారు పార్టీ నేతలు

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Who will get TDP Nagari assembly incharge post in Chittoor district.TDP senior leader Gali muddu krishnama naidu died four days back.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి