తెలుగు సెంటిమెంటంటే చులకనా, మోడీ ఎందుకు మాట్లాడలేదు, అసమర్ధుడినా?: బాబు
Recommended Video

అమరావతి: రాష్ట్రానికి న్యాయం చేయకుండా కేంద్రం తీవ్రమైన అన్యాయానికి పాల్పడిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై కేంద్రం డొంక తిరుగుడు సమాధానం చెబుతోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుండి బయటకు వచ్చినట్టు చంద్రబాబునాయుడు చెప్పారు. ఎన్డీఏతో తెగదెంపులు చేసుకొన్నాకే కేంద్రంపై అవిశ్వాసం ప్రవేశపెట్టినట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.
శాసనమండలిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై తన ప్రసంగంలో చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు.పొట్టిశ్రీరాములుకు ఏపీ శాసనమండలి ఘనంగా నివాళులర్పించింది.
ఈ సందర్భంగా తన ప్రసంగంలో బాబు పొట్టి శ్రీరాములు పోరాట స్పూర్తిని గుర్తు చేశారు. విభజన చట్టంతో పాటు, ప్రత్యేక హోదాను ఇవ్వాలన్నారు. అంతేకాదు రాజ్యసభలో ఇచ్చిన హమీలను కూడ రాష్ట్రానికి అమలు చేయాలని కోరారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుండి బయటకు
రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుండి బయటకు వచ్చినట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.ఫైనాన్స్ బిల్లు వరకు ఎదురుచూసినట్టు బాబు చెప్పారు. కానీ, కేంద్రం నుండి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి న్యాయం చేయలేదు. దీంతో ఎన్డీఏ నుండి బయటకు వచ్చినట్టు చెప్పారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు ఎన్డీఏతో తెగదెంపులు చేసుకొన్నాకే అవిశ్వాస నోటీసును ఇచ్చినట్టు చెప్పారు.

ప్రధానమంత్రి ఏం చేశారు
రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపీలు ఆందోళన చేస్తోంటే ప్రధానమంత్రి ఏం చేశారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. మిత్రపక్షంగా ఉన్న టిడిపి ఎంపీలు ఎందుకు ఆందోళన చేస్తున్నారనే విషయమై ఎందుకు మాట్లాడలేదని బాబు ప్రశ్నించారు. ఎన్డీఏకు నాయకత్వం వహిస్తున్న బిజెపి కూడ ఎందుకు ఈ విషయమై ఎందుకు చర్చించలేదని బాబు ప్రశ్నించారు ఎందుకు పోరాటం చేస్తున్నారు. మేం ఉన్నామని చెప్పిన ప్రధానమంత్రి మోడీ ఎందుకు తన హమీని నెరవేర్చుకోలేదని బాబు ప్రశ్నించారు.

తెలుగు సెంటిమెంట్ అంటే చులకనా
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పుట్టిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రత్యేక హోదా ఆలస్యం అవుతోందని ఉద్దేశ్యంతో ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకొన్నట్టు చెప్పారు. కానీ, నాలుగేళ్ళుగా కేంద్రం రాష్ట్ర విభజన బిల్లును అమలు చేయలేదన్నారు. రాష్ట్ర డిమాండ్లపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. తెలుగు సెంటిమెంట్ అంటే అంత చులకన అని బాబు ప్రశ్నించారు.

కఠిన నిర్ణయానికి బిజెపి నేతలు ఆలోచించుకోవాలి
ఎన్డీఏ నుండి తాము బయటకు రావడానికి గల కారణాలను బిజెపి నేతలు అన్వేషించుకోవాలని ఏఫీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. తాను ఎందుకు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో బిజెపి నేతలు ఆలోచించుకోవాలని బాబు గుర్తు చేశారు. పదవుల కోసం తాము కేంద్ర మంత్రివర్గంలో చేరలేదని చెప్పారు.

ఎదురుదాడి చేస్తున్నారు
ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన తర్వాత తనపై ఎదురుదాడి చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. తాను అసమర్ధుడినని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు అయితే గతంలో ఆగష్టు సంక్షోభాన్ని ప్రస్తావించారు. ఇంధిరాగాంధీ ఎన్టీఆర్‌ను గద్దె దించిందని చెప్పారు కానీ, ప్రజల నుండి వచ్చిన వ్యతిరేక కారణంగా తిరిగి ఎన్టీఆర్‌ను అధికారంలోకి తీసుకువచ్చిందన్నారు. తాను ఎవరికీ భయపడేది లేదన్నారు.
-
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..












Click it and Unblock the Notifications