• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు...టిడిపిలోకేనా?...అందుకేనా అలా?

|

విశాఖపట్టణం: బీజేపీ శాసనసభా పక్షం నాయకుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు రాజకీయపు అడుగులు టిడిపి వైపే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అందుకు సాక్ష్యంగా ఇటీవలి పరిణామాలను ఏకరువు పెడుతున్నారు. అంతేకాదు తాజా ఘటనలను కూడా ప్రస్తావిస్తున్నారు.

ఇటీవలి కాలంలో విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు, పర్యటనలు, నిర్ణయాలు, ప్రకటనలు ఇవన్నీ చూస్తే ఆయన టిడిపిలో చేరడం ఖాయమని తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఈ నేపథ్యంలో విష్ణకుమార్ రాజు పోకడలు ఆయన సొంత పార్టీ బిజెపిలోనూ చర్చనీయాంశమై ఏకంగా ఆయన్ని నిలదీసేంతవరకు వ్యవహారం వెళ్లిందని, అందుకే అతి త్వరలోనే ఆయన టిడిపి తీర్థం పుచ్చుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే...

 ఆ వ్యాఖ్యలతో...దుమారం

ఆ వ్యాఖ్యలతో...దుమారం

విశాఖ తూర్పు ఎమెల్యే, బిజెపి నాయకుడు విష్ణుకుమార్ రాజు ఇటీవలి వర్షాకాలం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడుతూ... "నేను ఈ రోజు నేను ఈ పార్టీలో ఉన్నాను. రేపు ఏ పార్టీలో ఉంటానో తెలియదు...అసలు రాజకీయ పార్టీలలో ఉంటానో లేదో కూడా తెలియదు. అలాంటి నేను...ఏం మాట్లాడినా వాస్తవాలే చెప్తాను. దీంట్లో ఎటువంటి దాపరికమూ లేదు"...అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.

అప్పుడు...వైసిపి పై ప్రశంసలు

అప్పుడు...వైసిపి పై ప్రశంసలు

అయితే కొన్ని నెలల క్రితమే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చేస్తోన్న పోరాటం ధర్మ పోరాటం కాదని, అధర్మ పోరాటమని దుయ్యబట్టారు. జగన్ ఏం చెబితే చంద్రబాబు అదే చేస్తున్నారన్నారు. గతంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసినా వైసీపీ కంటే 5 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయని ఆయన గుర్తు చేశారు. అంతే కాదు చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది, వైసీపీ గ్రాఫ్ పెరిగింది...వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి విడిగా పోటీ చేస్తే ఓటమి ఖాయమని విష్ణు జోస్యం కూడా చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా బిజెపికి ఇక్కడ భవిష్యత్ ఉండదని డిసైడ్ అయిన ఆయన వైసిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారని, అందుకే అలా మాట్లాడారని వ్యాఖ్యలు వినిపించాయి.

ఆ తరువాత...గందరగోళం

ఆ తరువాత...గందరగోళం

అయితే ఆ తరువాత ఏమైందో ఏమో కానీ విష్ణుకుమార్ రాజు అడపాదడపా టిడిపిపై ఆరు విమర్శలు...మూడు ప్రసంసలు తరహాలో వ్యాఖ్యలు చేస్తూ ఆయన రాజకీయ భవిష్యత్ పై గందరగోళానికి తెరలేపారు. మరీముఖ్యంగా ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో బిజెపి శాసన సభా పక్షనేతగా ఉండి ఆయన చేసిన వ్యాఖ్యలు, భాజపాపై టిడిపి విమర్శలకు ప్రతిస్పందించిన తీరు రాజకీయ శ్రేణుల్లో చర్చనీయాంశం అవడమే కాకుండా సొంత పార్టీలోనూ ఆయనపై తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి.

అలా చేశారని...బిజెపి గుర్రు...

అలా చేశారని...బిజెపి గుర్రు...

పార్టీలో కొనసాగడంపై వ్యాఖ్యలు, అసెంబ్లీలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి తీర్మానం ఆమోదం సమయంలో ఆయన స్పందన, టిడిపి నేతలతో కలసి పోలవరం గ్యాలరీ వాక్ సందర్శన...ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలు వీటని బట్టి ఆయన టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు జోరందుకున్నాయి. మరి ముఖ్యంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అసెంబ్లీ సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపే ప్రక్రియ జరిగే సమయంలో విష్ణుకుమార్ రాజు సభలో ఉండి చర్చలో పాల్గొనడమే కాకుండ అది కేంద్రానికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేయలేదని బిజెపి నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారట.

నిలదీశారు...బదులిచ్చారు

నిలదీశారు...బదులిచ్చారు

ఇదే విషయమై బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును నిలదీసిన బిజెపి అగ్రనేత ఆయనను ఈ విషయమై ప్రశ్నిస్తూ...మీరు ఈ తీర్మానానికి ఎలా సహకరిస్తారని నిలదీశారట. కేంద్రంలో మనపార్టీనే అధికారంలో ఉండగా...మన ప్రభుత్వం అన్యాయం చేసిందని టిడిపి నేతలు అసెంబ్లీలో తీర్మానం చేశారు. మీరు ఉండి కూడా దానిని వ్యతిరేకించకపోతే ఎలా?' అని ఆనేత పశ్నించారని తెలిసింది. అయితే అందుకు విష్ణుకుమార్ రాజు సమాధానం ఇస్తూ..."ఆ తీర్మానంపై అసెంబ్లీలో ఓటింగ్‌ జరగలేదని...తీర్మానం చేశారని...నేను ఒక్కడినే ఆపినా ఆ తీర్మానం ఆగదు కదా"...అన్నారట. పైగా ఆ తీర్మానాన్ని కేంద్రం అన్యాయం చేసి ఉంటే అని మార్చాల్సిందిగా కోరారని...అంతేతప్ప కేంద్రం అన్యాయం చేసిందనే దానికి తానెక్కడా సపోర్ట్ చేయలేదని వాదించారట.

టిడిపిలోకే...ఖాయం అంటున్నారు

టిడిపిలోకే...ఖాయం అంటున్నారు

ఇటీవల కాకినాడలో జరిగిన బీజేపీ ముఖ్యనేతల సమావేశాల్లో అసెంబ్లీ తీర్మానం ప్రాతిపదికగా చేసుకొని విష్ణును బీజేపీ నుంచి సస్పెండ్‌ చేయబోతున్నారని ప్రచారం కూడా జరిగింది. కానీ అలా జరగలేదు. ఈ క్రమంలోనే వైసీపీ ముఖ్యనేతలు విష్ణుకుమార్ రాజుని కలిసి ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. దీంతో వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గానికి కేకే రాజుని సమన్వయకర్తగా ప్రకటించింది. అయితే మరోవైపు టీడీపీ మాత్రం ఇంతవరకు ఆ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిని ఖరారు చేయకపోవడమే చర్చనీయాంశంగా మారింది. కేవలం విష్ణుకుమార్ రాజు చేరిక కోసమే టిడిపి ఆ పోస్టు ఖాళీగా ఉంచిందని, ఇక ఎక్కువ ఆలస్యం చేయకుండా త్వరలోనే విష్ణుకుమార్ రాజు టిడిపి తీర్థం పుచ్చుకోవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

English summary
Visakhapatnam:Is BJP MLA Vishnukumar Raju will be join in TDP...Political observers says such type of conditions are appear now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X