బాలినేని స్థానం ప్రకాశంలో ఆయనకే, తేల్చి చెప్పిన జగన్ - ఇక నుంచి..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయంగా పార్టీ వ్యవహారాల పైన దిశా నిర్దేశం చేసారు. కూటమి ప్రభుత్వం పైన అన్ని వర్గాల్లో వ్యతిరేకత పెరుగుతోందని చెప్పుకొచ్చారు. రెండేళ్ల కాలంలో ఏ ప్రభుత్వం పైనా ఈ స్థాయిలో వ్యతిరేకత గతంలో చూడలేదన్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం... కూటమి ఎమ్మెల్యేల పైన లైంగిక ఆరోపణలు.. టీటీడీ వ్యవహారం పైన జగన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ప్రకాశం జిల్లాలో ముఖ్య నేత భవిష్యత్ పైన జగన్ చేసిన వ్యాఖ్యలు కీలక చర్చగా మారాయి.
మాజీ ముఖ్యమంత్రి జగన్ కూటమి ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. వైసీపీకి గుండె ధైర్యం ట్రేడ్ మార్క్ గా పేర్కొన్నారు. ఒంగోలు వైసీపీ ముఖ్య నేతలు.. కేడర్ తో జగన్ సమావేశమయ్యారు. ఒంగోలు ఇంఛార్జ్ చుండూరు రవి, పార్లమెంట్ ఇంఛార్జ్ చెవిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డితో కలిసి నియోజకవర్గం పైన సమీక్ష చేసారు. వైసీపీ జగన్ ది మాత్రమే కాదని.. పార్టీ అంతా కలిసి కట్టుగా నిర్మించుకున్నదని చెప్పారు. వైసీపీ విలువలు, విశ్వసనీయత మీద పుట్టి ప్రజల కోసం నిలబడుతుందని వివరించారు. వైసీపీ - కూటమి పాలన మధ్య తేడా ప్రజలు గుర్తించారని చెప్పుకొచ్చారు. అన్ని చోట్ల ఇదే చర్చ జరుగుతోందని చెప్పుకొచ్చారు. అవినీతి కోసం మాత్రమే కూటమి నేతలు అధికారంలో ఉన్నారని.. ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసారని వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో అద్భుతమైన రాష్ట్రాన్ని ఇచ్చినట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని.. వ్యవస్థలను చిన్నాభిన్నం చేసారని.. ఖజానాలో వంద కోట్లు మాత్రమే ఉంచారని చెప్పారు. ఆర్దిక ఒత్తిళ్లు... కోవిడ్ మధ్య పాలన సాగిందని వివరించారు.

ప్రకాశంలో పార్టీ.. భవిష్యత్ పై క్లారిటీ ఇచ్చిన జగన్
వైసీపీ హయాంలో రూ 3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే... 2.70 లక్షల కోట్లు పథకాల కింద ఖాతాల్లో జమ చేసామని గుర్తు చేసారు. రెండేళ్లకే చంద్రబాబు రూ 3.30 లక్షల కోట్ల అప్పులు చేసారని లెక్కలు చెప్పారు. చంద్రబాబు హామీలు మోసాలుగా గుర్తించారని జగన్ చెప్పుకొచ్చారు. పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ పుట్టా మహేషే అని విమర్శించారు. ఈ వ్యవహారం పుట్టా మహేష్‌తో మొదలై, పుట్టా మహేష్‌తో ఆగిపోలేదన్నారు. ఇలాంటి వాటిపట్ల చంద్రబాబు వ్యవరించిన తీరును తప్పు బట్టారు. కూటమి ఎమ్మెల్యేలు పలువరు లైంగిక ఆరోపణల్లో ఉన్నారని.. వారి పైన ఎలాంటి చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేసారు. టీటీడీ లో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను జగన్ చెప్పుకొచ్చారు. కాగా.. గతంలో ప్రకాశం నుంచి బాలినేని వైసీపీలో కీలక నేత గా.. మంత్రిగా పని చేసారు. ఈ రోజు జరిగిన సమావేశంలో జగన్ ప్రత్యేకంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గురించి ప్రస్తావన చేసారు. జిల్లా అధ్యక్షుడుగా పార్టీ కోసం సమర్ధవంతంగా పని చేస్తున్నారని.. అన్నీ కలిసి వస్తే భవిష్యత్ లో ఉన్నత పదవిలో ఉంటారని పరోక్షంగా అధికారంలోకి వస్తే మంత్రి పదవి దక్కుతుందనే సంకేతాలు ఇచ్చారు. పార్టీ కోసం బూచేపల్లి కష్టపడుతున్నారు.. తోడుగా నిలుస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో ఒంగోలు కేంద్రంగా కీలక నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేసారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
మండలిలో 'చీకటి' రోజు.. బయటపడ్డ వైసీపీ అరాచకాలు! -
కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. అలా చేస్తానంటూ వైసీపీ నేత వార్నింగ్ ! -
రాజ్యసభలో అమరావతి బిల్లుపై రూటు మార్చిన వైసీపీ, అనూహ్య డిమాండ్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం










Click it and Unblock the Notifications