దమ్ముందా అని నిలదీసినా: జగన్ పదేపదే అదే పొరపాటు చేస్తున్నారా? బాబు సుందరముఖం అంటూ..

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన తప్పునే చేస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

'నమ్మొచ్చా, మోడీ మోసం చేశారని చెప్పే దమ్ము జగన్‌కు ఉందా, బాబు వేస్ట్ ఫెలో'

అనంత యువభేరీలో చంద్రబాబునే టార్గెట్ చేశారు. ఏపీకి హోదా రాకుంటే, చంద్రబాబు సుందర ముఖం చూసి ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ రారని ఎద్దేవా చేశారు. హోదా కోసం పోరాడాల్సిన వారే బెదిరిస్తున్నారన్నారు. యువభేరీకి వచ్చే విద్యార్థులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు.

పెద్ద పొరపాటు

పెద్ద పొరపాటు

రాష్ట్రంలోని సమస్యల విషయంలో పదేపదే ముఖ్యమంత్రి చంద్రబాబును, తెలుగుదేశం ప్రభుత్వాన్ని తప్పుపట్టడంలో అర్థం ఉంది. కానీ ప్రత్యేక హోదా విషయంలో కేవలం టిడిపినే ఎక్కువగా టార్గెట్ ఆయన చేస్తున్న పెద్ద పొరపాటు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బీజేపీని పల్లెత్తుమాట అనలేదు!

బీజేపీని పల్లెత్తుమాట అనలేదు!

ప్రతి విషయంలోను చంద్రబాబునే జగన్ టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అనంత యువభేరీలోను ఆయన పదేపదే చంద్రబాబునే టార్గెట్ చేశారు. కేంద్రంలో పొత్తులో ఉన్న బాబును నిలదీయడం సరైనదే. కానీ బీజేపీని పల్లెత్తుమాట అనకుండా కేవలం చంద్రబాబును ప్రశ్నించడమే ఇక్కడ ఆయన రాజకీయ లబ్ధి కనిపిస్తోందని అంటున్నారు.

దమ్ముందా అని నిలదీశారు, కానీ

దమ్ముందా అని నిలదీశారు, కానీ

యువభేరీకి ముందు ఇతర రాజకీయ పార్టీల నాయకులు జగన్‌కు ఓ సూటి ప్రశ్న సంధించారు. హోదాపై మోడీని నిలదీసే దమ్ము నీకుందా అని ప్రశ్నించారు. కానీ జగన్ ఆ మాటలను పక్కన పెట్టారని అంటున్నారు. మోడీని, బీజేపీని నిలదీసే దమ్ము, మోడీ మోసం చేశారని చెప్పే దమ్ము జగన్‌కు ఉందా అని రఘువీరా ప్రశ్నించిన విషయం తెలిసిందే.

బీజేపీని అంతకుమించి అనలేదు

బీజేపీని అంతకుమించి అనలేదు

యువభేరీ సభలో ప్రారంభంలో బిజెపి హామీలను, ప్రధాని మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య అన్న మాటలను వీడియో ద్వారా చూపించి, ఆ తర్వాత ప్రశ్నించారు. కానీ అంతకుమించి బిజెపిని నిలదీయలేదు. తాను మాట్లాడినప్పుడు, విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడు జగన్.. చంద్రబాబునే టార్గెట్ చేశారు. హోదా ఇవ్వాల్సిన బిజెపిని ప్రధానంగా విమర్శించకుండా కేవలం చంద్రబాబును అంటే అది సరికాదని అంటున్నారు. జగన్ తీరు చూస్తుంటే కేసుల భయం ఉన్నట్లుగానే కనిపిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party President YS Jagan Mohan Reddy today will be addressing the students at MYR Function Hall on Bellary road in Anantapur district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి