నేతన్న నేస్తంపై రాజకీయ రగడ .. ఆపన్న హస్తమని వైసీపీ, నేతన్నకు మోసం అంటూ టీడీపీ

సంక్షేమ కార్యక్రమమైనా, ఎలాంటి పథకమైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరగాల్సిందే. ఇటీవల జాతీయ చేనేత దినోత్సవం నాడు మొదలైన చేనేతలపై రగడ నేటికీ కొనసాగుతోంది. నేత కార్మికులకు అండగా ఉంటుంది వైసిపి ప్రభుత్వమని వైసీపీ నేతలు, కాదు టీడీపీ హయాంలో నేతన్నలకు స్వర్ణ యుగమని టీడీపీ నేతలు మాటల దాడి చేస్తున్నారు . చేనేతకు బ్రాండ్ క్రియేట్ చేస్తామని, సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతన్న నేస్తంతో చేనేత కుటుంబాలను ఆదుకుంటున్నారు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రచారం చేస్తుంటే, వైసిపి హయాంలో చేనేతల పరిస్థితి దుర్భరంగా మారిందని టిడిపి విమర్శల బాణాలు ఎక్కు పెడుతోంది.

చేనేతలను జగన్ సర్కార్ మోసం చేస్తుందంటూ టీడీపీ

చేనేతలను జగన్ సర్కార్ మోసం చేస్తుందంటూ టీడీపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత కార్మికుల కోసం టిడిపి ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిందని, ఇప్పుడు వైసీపీ సర్కార్ చేనేతను చీకటిలోకి నెడుతోందని తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు నాయుడు వైసిపి పాలనలో నేతన్నల పరిస్థితి దారుణంగా తయారైందని టిడిపి పాలనలో నేతన్నలకు ఎంతగానో చేయూతనిచ్చామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నేతన్నలకు చేసిన సహాయాన్ని గుర్తు చేసి వైసీపీ ప్రభుత్వం చేనేత బతుకులను దయనీయమైన పరిస్థితిలోకి నెట్టిందని విమర్శించారు.

 నేతన్న నేస్తం కాదు నేతన్న మోసం అన్న పంచుమర్తి అనురాధ

నేతన్న నేస్తం కాదు నేతన్న మోసం అన్న పంచుమర్తి అనురాధ

తాజాగా టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ నేతన్న నేస్తం పేరుతో, నేతన్నలను మోసం చేస్తున్నారని ధ్వజ మెత్తారు. టీడీపీ హయాంలో యాభై వేల రూపాయల సాయం నేతన్నలకు అందితే, దానిని వైసీపీ హయాంలో 24 వేలకు కుదించారని విమర్శలు గుప్పించారు. లబ్ధిదారులకు సంఖ్య తగ్గింపుతో అన్యాయం చేశారని పంచుమర్తి అనురాధ విమర్శించారు మూడు లక్షల 50 వేల మందికి పైగా చేనేత కార్మికులు ఉంటే 80 వేల మందికి గురించి ద్రోహం చేశారని ఆమె నిప్పులు చెరిగారు. గతంలో చంద్రబాబు హయాంలో ఏ విధంగా అయితే చేనేత కార్మికులకు సహాయాన్ని అందించారో అదేవిధంగా చేనేత కార్మికుల సహాయాన్ని పునరుద్ధరించాలని పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు.

నేతన్న నేస్తం ద్వారా జరిగిన లబ్ధిని పేర్కొన్న విజయసాయి రెడ్డి

నేతన్న నేస్తం ద్వారా జరిగిన లబ్ధిని పేర్కొన్న విజయసాయి రెడ్డి

ఇదిలా ఉంటే చేనేత కార్మికులకు ఆపన్నహస్తం అందించేలా వరుసగా మూడో ఏడాది కూడా వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేశారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేనేత కార్మికులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు ఈ ఏడాది 80,032 మంది నేతన్నలకు 192.08 కోట్లను నేరుగా వారి ఖాతాలోనే జమ చేశారని పేర్కొన్నారు. ఇప్పటివరకు చేనేతలకు 576.07 కోట్లు రూపాయల సహాయం అందించారని విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు.

పాదయాత్ర సమయంలో చేనేతల కష్టాలు చూసే చేనేతలకు నేతన్న నేస్తం అంటున్న వైసీపీ

పాదయాత్ర సమయంలో చేనేతల కష్టాలు చూసే చేనేతలకు నేతన్న నేస్తం అంటున్న వైసీపీ

మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా ఇరవై నాలుగు వేల రూపాయలను అందిస్తున్నారని పేర్కొన్న విజయసాయిరెడ్డి తన పాదయాత్ర సమయంలో చేనేతల కష్టాలు చూశానని ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకు ఆర్థిక సహాయం చేస్తున్నట్టు సీఎం జగన్ వెల్లడించారని తెలిపారు. ఇక నేతన్నలకు బాసటగా నేతన్న నేస్తం పథకంతో చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయని, నేతన్న నేస్తం నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపిందని ఇదివరకే సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ సాయంతో చేనేత కార్మికులు నిలబడే ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. ఇక టిడిపి నేతలు, వైసీపీ నేతలు నేతన్న నేస్తం విషయంలో ఒకరిని మించి ఒకరు లెక్కలు చెబుతూ విమర్శలకు దిగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+