లంబసింగిలో జీరో డిగ్రీల టెంపరేచర్...నిజంకాదా?

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

విశాఖపట్టణం: దక్షిణాదిలో అతిశీతల ప్రాంతంగా....ఆంధ్రా కాశ్మీర్ గా...ప్రత్యేక గుర్తింపు పొందిన లంబసింగికి సంబంధించి ఒక సంచలన వాస్తవం వెలుగుచూసింది...పైగా ఆ నిజం కూడా లంబంసింగిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల గురించే కావడం గమనార్హం.

  వణికిస్తున్న చలిపులి: కారణం ఇదీ...

  లంబసింగిలో జీరో టెంపరేచర్ నమోదు నిజం కాదా? అసలు లంబసింగిలో ఎప్పుడూ సున్నాడిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాలేదా?...అంటే వినడానికి విచిత్రంగా ఉన్నా ఒక విషయం మాత్రం వాస్తవమట. అదేమిటంటే లంబసింగిలో జీరో డిగ్రీల టెంపరేచర్ అనేది నిజమో అబద్దమో ఇప్పటిదాకా ఎవరికీ తెలియదట. ఎందుకంటే అలా లంబసింగి ఉష్ణోగ్రతల గురించి అధికారికంగా ప్రకటించే వాతావరణ సంస్థ ఏదీ లేదట. విశాఖ నుంచి వెలువడే ఒక స్థానిక పత్రిక ఈ సంచలన విషయాన్ని బైటపెట్టింది.

   అందాల లంబసింగి...వర్ణన

  అందాల లంబసింగి...వర్ణన

  లంబసింగి...గాలిని సైతం గడ్డకట్టించే చలి...దట్టమైన పొగమంచు...హిమ తుంపరులు...అతిచల్లని గాలులు...వలస పూల సొగసులు...ఆకుపచ్చని హరితారణ్యం అందాలు.... ఇలా అంతా ప్రకృతి సోయగాలతో నిండి ఉండే అతిశీతల ప్రాంతాన్ని చూడాలంటే ఎక్కడకు వెళ్లాలి అని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు? ఠక్కున ఏ స్విట్జర్లాండ్‌కో...కనీసం కాశ్మీర్ కో వెళ్లాలని చెబుతారు కదా...కానీ ఆ అవసరం లేనేలేదు...మన ఆంధ్రప్రదేశ్‌లోనే అలాంటి ప్రదేశం ఒకటుంది...అదే లంబసింగి...అందుకే దాన్ని ఆంధ్రా కాశ్మీర్ అంటారు...ఎందుకంటే లంబసింగిలో సైతం అక్కడలాగే జీరో డిగ్రీల టెంపరేచర్ నమోదవుతోంది...ఇదీ ఇప్పటివరకు లంబసింగి గురించి మన మీడియాలో వెలువడే వార్తా కథనాల సారాంశం...

   అన్నీ నిజమే కాని...ఆ ఒక్కటి మాత్రం...

  అన్నీ నిజమే కాని...ఆ ఒక్కటి మాత్రం...

  ప్రకృతి అందాలకు సంబంధించి లంబసింగి(అసలు పేరు లమ్మసింగి) గురించి చేసే వర్ణన లంతా నూటికి నూరుపాళ్లు నిజమేనట...కానీ ఒక్క విషయం...ఒకే ఒక్క విషయం...అదీ లంబసింగికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఆ విషయం మాత్రం అబద్దమని చెప్పలేరు కాని అలాగని నిజమనీ చెప్పలేమట. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే...లంబసింగిలో ఉష్ణోగ్రత జీరో డిగ్రీల టెంపరేచర్ కు పడిపోవడం గురించే...అసలు లంబసింగిలో ఇప్పటిదాకా ఎప్పుడైనా సున్నాడిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందో లేదో ఎవరూ అధికారికంగా చెప్పలేదట. అంతే కాదు ఇప్పటివరకు ఉన్నవాతావరణ వ్యవస్థ ప్రకారం అలా చెప్పడం కూడా సాధ్యం కాదట. ఎందుకంటే లంబసింగికి సంబంధించి టెంపరేచర్ నమోదు చేసే అధికారిక సంస్థ గానీ ,వ్యవస్థ గానీ ఏమీ ఇక్కడ లేవట.

  మరి టెంపరేచర్ లెక్క ఎలా?

  మరి టెంపరేచర్ లెక్క ఎలా?

  లంబసింగికి 10 కిలోమీటర్ల దూరంలో చింతపల్లి సెంటర్ ఉంటుంది. అక్కడ మాత్రం ఒక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉంది. అక్కడ ఆ కేంద్రంలో నమోదయ్యే చింతపల్లికి సంబంధించిన ఉష్ణోగ్రతలనే సుమారుగా మరి కొంచెం తగ్గించి సుమారుగా అంచనా కట్టి లంబసింగి టెంపరేచర్ గా చెప్పేస్తున్నారట. ఫర్ ఎగ్జాంపుల్ చింతపల్లిలో 8 డిగ్రీల టెంపరేచర్ నమోదైతే లంబసింగి చింతపల్లి కంటే ఎగువన ఉంటుంది కాబట్టి అక్కడ మరికొంత చల్లగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు డిగ్రీలు తగ్గించి లంబసింగిలో ఉష్ణోగ్రత 6 డిగ్రీలుగా చెప్పేస్తున్నారట. ఎందుకలా అంటే...మరి లంబసింగి టెంపరేచర్ లెక్క కట్టే అవకాశం లేదు కాబట్టి...అది ఒక అంచనా అంటున్నారట.

   అలా చెప్పడం కరక్టేనా...

  అలా చెప్పడం కరక్టేనా...

  నిజానికి శాస్త్రీయంగా అలా చెప్పడం కరెక్ట్ కాదంటున్నారు వాతావరణ నిపుణులు. ఎందుకంటే...వాస్తవంగా ఒక ప్రదేశం దగ్గర నమోదయ్యే ఉష్ణోగ్రత ఆ ప్రదేశానికే పరిమితం అంటున్నారు. ఆ ప్రాంతానికి దగ్గరగా ఫలానా ప్రాంతం ఉంది...అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి టెంపరేచర్ ఇలా ఉండొచ్చు అనే అంచనాలు అస్సలు శాస్త్రీయ సమ్మతం కాదని వారు తేల్చేస్తున్నారు... అందుకే...లంబసింగిలో జీరో డిగ్రీల టెంపరేచర్ నమోదు కూడా అధికారికం కాదని స్పష్టం చేస్తున్నారు...సో...అదండి మరి లంబసింగి జీరో డిగ్రీల టెంపరేచర్ వెనుకున్న కథ.

   తొలిసారి...ఎప్పుడంటే...

  తొలిసారి...ఎప్పుడంటే...

  అయితే లంబసింగికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది...పర్యాటకులు ఇక్కడకు పోటెత్తుతోంది...లంబసింగిలో జీరో డిగ్రీల టెంపరేచర్ నమోదు అని మీడియాలో వార్తలు వెలువడినప్పటి నుంచే...అదెప్పుడంటే...తొలిసారిగా 2012 లో ఇక్కడ సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ఒక వార్త వచ్చాయట. ఆ తరువాత అలా అలా మీడియాలో ప్రచారం జరిగి...లంబసింగిపై అందరికీ ఆసక్తి పెరిగిందట...కట్ చేస్తే ఇప్పుడు లంబసింగి కూడా ఆంధ్రాలో ఒకానొక ఫేమస్ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది.

  ప్రభుత్వం చిన్నచూపు...

  ప్రభుత్వం చిన్నచూపు...

  అయితే లంబసింగిలో జీరో డిగ్రీ టెంపరేచర్ సంగతి అటుంచితే ఇక్కడ ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నమాట నిజం. అయినప్పటికి ప్రభుత్వం కూడా ఈ ప్రదేశంపై ఏమాత్రం ఆసక్తి చూపడం లేదన్నది కూడా నిజమే. ప్రభుత్వం లేదా పర్యాటక శాఖ ఈ ప్రదేశంపై కొంత దృష్టి పెట్టి అభివృద్ది కోసం కొన్ని చర్యలు చేపడితే చాలు ఇది మంచి టూరిస్ట్ సెంటర్ గా మరింత గుర్తింపు పొందుతుంది. కానీ పర్యాటకులు వెల్లువలా తరలివస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడకు వచ్చే సందర్శకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంబసింగిలో సరైన వసతి,సదుపాయాలు అటుంచి కనీసం చిన్న హోటళ్లు, రెస్ట్ హౌస్లు లేకపోవడంతో ఇక్కడ ఉన్నంత సేపు ఉండి మళ్లీ చింతపల్లికి మరలి వెళ్లాల్సిందే. ఇదండీ లంబసింగి వెనుక కథ...

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Lambasingi is a small village in the Chintapalli Mandal of Visakhapatnam district of Andhra Pradesh, India. It is situated in the agency area. This place is often referred as Kashmir of Andhra Pradesh. But one sensational truth is comeout about lambasingi. That Is not it true in Zero Temperate registration in Lamborghini. Does the original Lamborghini ever have zero temperature temperatures recorded? ... What a strange about hearing is a fact. It is true that the temperatures of zero degrees in the lambasangi are untrusted to date. Because there is no weather organization that officially announces the temperature perpendicular.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి