EPFO: పీఎఫ్ డబ్బులు చిటికెలో.. పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన కోట్లాది మంది సభ్యుల కోసం ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. సాధారణంగా పీఎఫ్ డబ్బులు చేతికి అందాలంటే ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత కూడా బ్యాంక్ బదిలీ కోసం రెండు మూడు రోజులు వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ అవసరం ఉండదు.
టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ, యూపీఐ (UPI) మరియు ఏటీఎం (ATM) ద్వారా నేరుగా పీఎఫ్ నిధులు ఉపసంహరించుకునే వెసులుబాటును కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2026 ఏప్రిల్ నాటికి ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కార్మిక మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 100 డమ్మీ ఖాతాలపై పైలట్ ప్రాజెక్టును మొదలుపెట్టి, సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.

ఈ సౌకర్యం ఒక వరం..: EPFO
ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, పీఎఫ్ క్లెయిమ్ ఆమోదించబడిన నిమిషాల్లోనే యూపీఐ ద్వారా డబ్బులు సభ్యుడి బ్యాంక్ ఖాతాకు చేరుతాయి. యూపీఐ రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ కావడమే దీనికి ప్రధాన కారణం. ఇక ఏటీఎం ద్వారా నగదు పొందాలనుకునే వారు, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్ మరియు మొబైల్‌కు వచ్చే ఓటీపీ (OTP) ద్వారా తమ గుర్తింపును ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. ధృవీకరణ పూర్తయిన వెంటనే ఏటీఎం యంత్రం ఆమోదించబడిన నగదును అందిస్తుంది. ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీ వంటి అత్యవసర సమయాల్లో పాక్షిక ఉపసంహరణలు (Partial Withdrawals) చేసుకునే వారికి ఈ సౌకర్యం ఒక వరమని చెప్పవచ్చు.
సవాళ్లు కూడా..
అయితే, ఈ వ్యవస్థను అమలు చేయడం వెనుక కొన్ని సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ వద్ద సభ్యుల బ్యాంక్ ఖాతా వివరాలు ఉన్నప్పటికీ, యూపీఐ ఐడీలు లేవు. అలాగే, యూపీఐ ఐడీలు ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లింక్ అయి ఉన్నప్పటికీ, ఈపీఎఫ్ఓ సిస్టమ్‌తో వాటిని అనుసంధానించడానికి అదనపు సాంకేతిక వ్యవస్థ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు, పాత రికార్డుల్లో పేర్లు లేదా సర్వీసు వివరాల్లో వ్యత్యాసాలు ఉంటే, చెల్లింపు మార్గం యూపీఐ అయినా సరే క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఈ లోపాలను సరిదిద్దడంపైనే ఈ కొత్త వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది.
కేవలం క్లీన్ రికార్డ్స్ ఉంటేనే..
మరోవైపు, డబ్బులు తీసుకోవడం ఇంత సులభమైతే, సభ్యులు తరచుగా నిధులను ఉపసంహరించి తమ పదవీ విరమణ పొదుపును (Retirement Corpus) కరిగించుకునే ప్రమాదం ఉందని కూడా కొందరు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా, ఈ మార్పు వల్ల కేవలం పేమెంట్ మోడ్ మాత్రమే మారుతుంది తప్ప, పీఎఫ్ ఉపసంహరణ నియమ నిబంధనలు లేదా అర్హత ప్రమాణాలు మారవు. కేవలం క్లీన్ రికార్డ్స్ ఉన్న సభ్యులకు మాత్రం ఇది ఎంతో ఊరటనిచ్చే విషయమే.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications