4 గంటల్లోనే సొంత ఇల్లు రెడీ..!
సాధారణంగా ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం జీవితంలో అత్యంత కీలకమైన మైలురాళ్లు. ముఖ్యంగా ఇల్లు కట్టడం అంటే సమయం, ఖర్చు, నాణ్యత, నమ్మకం అన్నీ కలిసి సుదీర్ఘ ప్రక్రియగా మారిపోతుంది. డిజైన్ ఎంపిక నుంచి సామగ్రి కొనుగోలు, పనివాళ్ల లభ్యత, వాతావరణం వరకు ప్రతి అంశం నిర్మాణ కాలాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే భారతీయ గృహ నిర్మాణ రంగానికి కొత్త దిశ చూపే ప్రయత్నంగా షార్క్ ట్యాంక్ ఇండియా తాజా సీజన్లో 'అప్రియర్ బిల్డ్' (Aprier Build) అనే స్టార్టప్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
4 గంటల్లో ఇల్లు..
అప్రియర్ బిల్డ్ స్టార్టప్ మోడల్ పూర్తిగా మాడ్యులర్ హౌసింగ్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. అంటే సంప్రదాయంగా సైట్లో ఇటుకలు, సిమెంట్‌తో ఇల్లు కట్టే విధానానికి భిన్నంగా, ఇంటికి అవసరమైన గోడలు, ఫ్లోర్లు, పైకప్పులు, వైరింగ్, ప్లంబింగ్ వంటి భాగాలను ముందుగానే ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. అనంతరం వాటిని నిర్మాణ స్థలానికి తీసుకువచ్చి కేవలం 4 గంటల్లోనే ఒక ప్రామాణిక యూనిట్‌ను ఇన్స్టాల్ చేయవచ్చు.

ఈ విధానంలో నిర్మించిన ఇల్లు తాత్కాలికంగా కనిపించినా, డిజైన్ పరంగా, నాణ్యత పరంగా బలంగా ఉంటుంది. కంపెనీ ప్రకారం, ఈ ఇళ్లు 30 నుంచి 40 ఏళ్ల వరకు ఎలాంటి నిర్మాణ సమస్యలు లేకుండా ఉపయోగించవచ్చు. అంతేకాదు, వాతావరణ మార్పులు, వర్షాలు లేదా పనివాళ్ల ఆలస్యం వంటి సమస్యలు ఈ విధానంలో చాలా వరకు తగ్గిపోతాయి.
కాగా అప్రియర్ బిల్డ్ ఇంటి ప్రత్యేకత ఏమిటంటే, దీనిని పూర్తిగా మడతపెట్టి ప్యాక్ చేయవచ్చు. ఆ తరువాత ట్రక్కు ద్వారా కావాల్సిన ప్రాంతానికి తరలించి, నిపుణుల సహాయంతో కొన్ని గంటల్లోనే అక్కడ ఇన్స్టాల్ చేయవచ్చు. అవసరమైతే ఒక చోట నుంచి మరో చోటుకు తరలించే అవకాశం కూడా ఉంటుంది. భవిష్యత్తులో బహుళ అంతస్తుల మాడ్యులర్ ఇళ్లను కూడా ఈ టెక్నాలజీ ద్వారా నిర్మించాలనే లక్ష్యంతో కంపెనీ ముందుకు సాగుతోంది.
ఇలాంటి టెక్నాలజీ ఇప్పటికే యూరప్, అమెరికా వంటి దేశాల్లో విస్తృతంగా ఉపయోగంలో ఉంది. కానీ భారతదేశంలో మాత్రం ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అందుకే అప్రియర్ బిల్డ్‌ను దేశీయ గృహ నిర్మాణ రంగంలో ఒక ఇన్నోవేటివ్ గేమ్ చేంజర్‌గా భావిస్తున్నారు.
షార్క్ ట్యాంక్‌లో డీల్ - రూ.2 కోట్ల ఇన్వెస్ట్మెంట్
షార్క్ ట్యాంక్ ఇండియా వేదికగా అప్రియర్ బిల్డ్ తన ఐడియాను ప్రెజెంట్ చేయగా, ప్రముఖ వ్యాపారవేత్త కునాల్ బహల్ ఈ స్టార్టప్‌పై ఆసక్తి చూపారు. చివరకు ఆయన రూ.2 కోట్ల పెట్టుబడిని అందించేందుకు అంగీకరించారు. దీనికి ప్రతిఫలంగా కంపెనీలో 2.5% ఈక్విటీని పొందనున్నారు. అనుపమ్ మిట్టల్ కూడా ఈ స్టార్టప్‌పై ఆసక్తి చూపినప్పటికీ, చర్చల అనంతరం అప్రియర్ బిల్డ్ బృందం కునాల్ బహల్ ఆఫర్‌ను ఓకే చేసింది. ఈ పెట్టుబడి వెనుక ప్రధాన షరతుగా, భవిష్యత్తులో పెద్ద ఆర్డర్లు తెచ్చుకోవడం, మెరుగైన మార్జిన్లు సాధించడం అనే లక్ష్యాలను కంపెనీ నిరూపించాల్సి ఉంటుంది. ఆ దిశగా ఇప్పటికే అప్రియర్ బిల్డ్ తన తదుపరి విస్తరణ దశకు సిద్ధమవుతోంది.
భారత గృహ నిర్మాణ రంగానికి కొత్త దిశ..
ఈ మోడల్ విజయవంతమైతే, భారతదేశంలో ఇల్లు కట్టే సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా ఖర్చు కూడా నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంది. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ టెక్నాలజీ ఉపయోగపడే అవకాశముంది. ముఖ్యంగా తాత్కాలిక నివాసాలు, వర్క్సైట్లు, విపత్తుల తర్వాత పునరావాస గృహాల నిర్మాణంలో ఇది కీలక పాత్ర పోషించవచ్చు.
-
Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..! -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
ఆంజనేయుడి దివ్యమంత్రం -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ












Click it and Unblock the Notifications