వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో ‘సత్యం’గా ‘ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌’ రూపాంతరం?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

భారీ కుంభకోణం బయటపడొచ్చు: ఇన్‌ గవర్న్‌
న్యూఢిల్లీ: ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌లో లావాదేవీల తీరుతో భారీ కుంభకోణమేదో బయటపడుతుందన్న భయాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ర్యాన్‌బాక్సీతో అంచెలంచెలుగా ఎదిగి దాని విక్రయంతో బిలియనీర్‌ సింగ్‌ సోదరులుగా ఖ్యాతిగాంచిన మల్వీందర్‌ సింగ్, శివిందర్‌ సింగ్‌ స్థాపించిన ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌లో పలు పరిణామాలు వేగంగా జరిగిపోతున్నాయి. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల వరుస రాజీనామాలు, తరచుగా పునర్వ్యవస్థీకరణలు జరుగుతున్నాయి. ఇంతే కాక తాజాగా ఢిల్లీ హైకోర్టు కూడా ఈ ప్రమోటర్ల రెండు హోల్డింగ్‌ కంపెనీల ఆస్తుల్ని జప్తు చేయటం గమనార్హం. వాటాదారుల అనుమతి తీసుకోకుండానే నిధుల మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో పూర్తి వివరాలివ్వాలని స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ 'సెబీ' నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నెల 28వ తేదీ వరకు గడువు ఇవ్వాలని కోరింది. దీన్ని గమనిస్తున్న 'ఇన్ గవర్న్' అనే సంస్థ భారీ కుంభకోణం బయటపడవచ్చునని అనుమానిస్తోంది.

సత్యం, యూబీ గ్రూప్ తరహాలోనే నిధుల మళ్లింపు

సత్యం, యూబీ గ్రూప్ తరహాలోనే నిధుల మళ్లింపు

ఈ వరుస పరిణామాలతో ఇప్పటికే ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కోల్పోయిన ఈ సంస్థ వారి సంపదను కూడా భారీగా హరించేసింది. ట్రెజరీ ఆపరేషన్లలో భాగంగా సెక్యూర్డ్‌ షార్ట్‌ టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరిట రూ.473 కోట్ల నిధులను కొల్లగొట్టిన బోర్డ్‌.. ఈ నిధులను సింగ్‌ సోదరుల ఇతర కంపెనీలకు బదలాయించేసిందనే ఆరోపణలు కొనసాగడం చూస్తుంటే ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ మరో సత్యం కానుందని అనిపిస్తున్నట్లు ‘మనీలైఫ్‌' పత్రిక పేర్కొన్నది. ఇతర కంపెనీలకు నిధులనుమళ్లించడం అనేది పలు కంపెనీలలో తరచుగా జరిగేదైనా ‘ఫొర్టిస్ హెల్త్ కేర్' సంస్థలో జరుగుతున్న తరలింపు మాత్రం సత్యం, యూబీ గ్రూప్‌ తరహాలోనే ఉందని ప్రాక్సీ వోటింగ్‌ అడ్వైజరీ సంస్థ ఒకటి తెలిపింది. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న ఇన్‌గవర్న్‌ రీసెర్చ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తెలిపిన సమాచారం మేరకు కంపెనీ ప్రమోటర్ల పూర్తి అనుబంధ సంస్థల ద్వారా నిధులు మళ్లిపోయాయి. ఇందుకు సంబంధించి షేర్‌హోల్డర్ల అనుమతి తీసుకోలేదని తెలిసింది.

26 లోగా పూర్తి వివరాలివ్వాలని సెబీ ఆదేశం

26 లోగా పూర్తి వివరాలివ్వాలని సెబీ ఆదేశం

నియంత్రణ సంస్థలకు ఎటువంటి సమాచారం లేకుండానే అనుబంధ సంస్థలు సంబంధిత వ్యక్తులకు రుణాలను మంజూరీ చేశాయి. మరోవైపు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నిధుల మళ్లింపునకు సంబంధించి విషయాలపై తమకు పూర్తి సమాచారం అందించాలని ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ బోర్డ్‌ను ఆదేశించిందిజ ఇందుకు ఈ నెల 26వ తేదీని గడువుగా నిర్ణయించింది. ఒక కంపెనీ సంబంధిత వ్యక్తులకు రుణాలను జారీ చేయటం కంటే ముందే వాటాదారుల అనుమంతి పొందాల్సి ఉంటుందని 2013 కంపెనీల చట్టం, ఇండియన్‌ అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌ చెబుతుండగా ఈ నిబంధనను ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ అనుబంధ సంస్థలు పూర్తిగా విస్మరించాయి. కంపెనీ ఆర్థిక ఫలితాలను కూడా సమయానికి వెల్లడించకుండా రెలిగేర్‌ హెల్త్‌ ట్రస్ట్‌ ఆస్తులను విలీనం చేసుకోవడంలో నిమగ్నమైన ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ బోర్డ్‌.. ఫిబ్రవరి 13న సమావేశమైనా ఇదే నెల 28 వరకు అనుమతి పొందిందే తప్ప ఫలితాలను ఇప్పటికీ ప్రకటించలేదు. ఇదంతా చూస్తుంటే స్కామ్‌ భారీ స్థాయిలోనే జరిగి ఉంటుందనే ఊహాగానాలకు మరింత బలం చేకూరుతోంది.

కరంట్ లోన్స్ స్తానే కన్సాలిడేటెడ్ బాలెన్స్ నగదు

కరంట్ లోన్స్ స్తానే కన్సాలిడేటెడ్ బాలెన్స్ నగదు

కంపెనీకి అనుబంధంగా ఉన్న ఫోర్టిస్‌ హాస్పిటళ్ల ద్వారా గతేడాదిలో నిధుల మళ్లింపు జరిగిందని, అప్పుడు కూడా షేర్‌ హోల్డర్ల అనుమతి లేకుండానే ఇదంతా జరిగిపోయిందని వెల్లడించిన ఇన్‌గవర్న్‌ రీసెర్చ్‌.. ఇలాంటి నిర్ణయాలు ఫోర్టిస్‌లో సర్వసాధారణంగా మారాయని తెలియజేసింది. సెక్యూర్డ్‌ షార్ట్‌ టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రూపంలో కొల్లగొట్టిన మొత్తాన్ని బ్యాలెన్స్‌ షీటులో ఆస్తుల వైపు కరెంట్‌ లోన్స్‌ రూపంలో చూపాల్సి ఉండగా.. కన్సాలిడేటెట్‌ బ్యాలెన్స్‌ షీటులో నగదు కింద ఈ మొత్తాన్ని చూపింది. ఇది గతేడాదిలో రూ.142 కోట్లు ఉండగా.. ఇప్పుడు ఈమొత్తం రూ.544 కోట్లుగా ఉందని, ఇంతగా పెరగడం అనేది అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌కు విరుద్ధమని వివరించింది.

 పోర్టిస్ మారిషస్ లావాదేవీల ఊసే లేని అక్కౌంట్ బుక్స్

పోర్టిస్ మారిషస్ లావాదేవీల ఊసే లేని అక్కౌంట్ బుక్స్

2010లో ఫోర్టిస్‌ మారిష్‌ అనే 100% అనుబంధ సంస్థ ద్వారా సింగపూర్‌లో పార్క్‌వే హోల్డింగ్స్‌ 25% వాటాను కొనుగోలుచేసింది. ఎఫ్‌సీసీబీ మార్గంలో రూ.647 కోట్లను సమీకరించి అదే సమయంలో ఫోర్టిస్‌ మారిషస్‌కు రూ.395 కోట్ల రుణాన్ని ఇచ్చింది. పార్క్‌వే హోల్డింగ్స్‌లో వాటాను పెంచడం కోసం ఆర్‌హెచ్‌సీ హెల్త్‌కేర్‌ బిడ్‌ దాఖలు చేసింది. తొలుత ఆర్‌హెచ్‌సీ హెల్త్‌కేర్‌లో ఫోర్టిస్‌ మారిషస్‌కు 49 శాతం, ప్రమోటర్లకు 51 శాతం వాటా ఉండగా.. ఇది క్రమంగా 100 శాతానికి పెరిగిపోయింది. రెండు సార్లు పేర్లు మార్చడం ద్వారా చివరకు ఆర్‌హెచ్‌సీ హెల్త్‌కేర్‌ కాస్తా ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ ఇంటర్నేషనల్‌గా మారింది. 2010-11 సమయంలో ఫోర్టిస్‌ ఇంటర్నేషనల్‌ ద్వారా ఫోర్టిస్‌ ప్రమోటర్లు ఆరు విదేశీ ఆస్తులను కొనుగోలు చేశారు.
ఈ మొత్తం వ్యవహారంలో ఫోర్టిస్‌ మారిషస్‌కు ఇచ్చిన రూ.395 కోట్లకు లెక్కలు లేకుండా పోయాయి. ఇప్పటికీ ఫోర్టిస్ ఇంటర్‌నేషనల్‌కు 4.4 శాతం వడ్డీ, ఎఫ్‌సీసీబీపై 5 శాతం వడ్డీ చెల్లిస్తూనే ఉండడం కొసమెరుపు. ఇంతటి స్థాయిలో నిధుల మళ్లింపులు జరుగుతుండడం, ఇదే సమయంలో ఉన్నట్టుండి వరుసగా డైరెక్టర్లు రాజీనామాలు చేయడం చూస్తుంటే అతి త్వరలోనే ఫోర్టిస్‌లో భారీ కుంభకోణం బయటపడనుందని ఇన్‌గవర్న్‌ రీసెర్చ్‌ అంచనా వేస్తోంది.

English summary
Past actions at Fortis Healthcare Ltd about frequent restructurings and frequent resignations from directors has eroded investors' trust as well as wealth. Recently the company admitted having 'deployed' funds of Rs473 crore with companies that became promoter owned companies by terming them as 'secured short-term investments in normal course of treasury operations".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X