నమ్మశక్యం కాని విధంగా మళ్లీ కుప్పకూలుతున్న బంగారం ధరలు
రెండురోజుల పాటు భారీగా ఎగిసిన బంగారం ధరల దూకుడు మళ్లీ తగ్గింది. పసిడి రేట్లు నేడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. భారీ పతనం కనిపించింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర అస్థిరతను చవిచూశాయి. అమెరికా ఈక్విటీలలో చోటుచేసుకున్న భారీ హెచ్చుతగ్గుల కారణంగా మార్కెట్ గోల్డ్ క్యాపిటలైజేషన్లో దాదాపు తొమ్మిది ట్రిలియన్ల డాలర్ల మేర భారీ కదలిక నమోదైంది. ఈ పరిణామం అనిశ్చితికి దారి తీసింది.
ఈ ఉదయం దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధర తగ్గు్ముఖం పట్టింది. లాభాల స్వీకరణ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సడలడం, డాలర్ సూచీలో భారీ పెరుగుదల దీనికి ప్రధాన కారణాలు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు మూడు శాతం మేర అంటే 4,600 రూపాయలు పడిపోయింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,48,455కి చేరింది. అదేవిధంగా, సిల్వర్ రేట్లు కూడా తగ్గాయి. సుమారు 9 శాతం క్షీణించింది. రూ. 24,200 పతనమైంది. కిలోకు 2,44,654 వద్ద ట్రేడ్ అయింది.

అమెరికా, ఇరాన్‌లు శుక్రవారం ఒమన్‌లో చర్చలు జరపడానికి అంగీకరించినట్లు నివేదికలు రావడంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ లో నేటి సెషన్లో బంగారం ఔన్స్ ధర 4,770 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం, వెండి ధరల ట్రెండింగ్ పై పృథ్వీ ఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్ విశ్లేషకుడు మనోజ్ కుమార్ జైన్ తన అభిప్రాయాలను వెల్లడించారు. గోల్డ్‌కు రూ. 1,47,700- రూ.1,50,500 వరకు ట్రేడ్ అవ్వొచ్చని, దీని స్టాప్ లాస్‌తో రూ. 1,56,800 వరకు ఉంటుందని పేర్కొన్నారు.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,622, 22 క్యారెట్లు - రూ. 14,320, 18 క్యారెట్లు - రూ. 12,250
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,442, 22 క్యారెట్లు- రూ. 14,155, 18 క్యారెట్లు - రూ. 11,582
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,442, 22 క్యారెట్లు- రూ. 14,155, 18 క్యారెట్లు- రూ. 11,582
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,442, 22 క్యారెట్లు- రూ. 14,155, 18 క్యారెట్లు- రూ. 11,582
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,442, 22 క్యారెట్లు- రూ. 14,155, 18 క్యారెట్లు- రూ. 11,582
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,442, 22 క్యారెట్లు- రూ. 14,155, 18 క్యారెట్లు- రూ. 11,582
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications