• search

నీరవ్ తెంపరితనం: ఎల్వోయూలతో మోసం బయటపడగానే పరారీ.. ఆ పై బెదిరింపులు

By Swetha Basvababu
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: దేశ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణానికి పాల్పడి పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)ను నిట్టనిలువునా ముంచిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఇప్పుడు ఆ ఏకంగా బ్యాంకునే సవాలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో పీఎన్బీ అతిగా వ్యవహరించి, తనపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం నిర్వహించి రుణాలను తిరిగి చెల్లించనీయకుండా తలుపులన్నీ మూసేసిందని ఎదురుదాడికి దిగారు. ఈ విషయమై నీరవ్ కొద్ది రోజుల క్రితం పీఎన్‌బీ యాజమాన్యానికి లేఖ రాశాడు.
  తన ఆఫర్‌ను కాదని రుణ బకాయిలను వసూలు చేసుకోవాలనే తొందరలో బ్యాంకు అనుసరించిన వ్యూహం మొదటికే మోసం తెచ్చిపెట్టిందని సెలవిచ్చారు. 'నా ఫైర్ స్టార్ గ్రూప్, అందులోని విలువైన వస్తువులు, ఆస్తుల విక్రయానికి అనుమతించాలని నేను కోరా' అని పేర్కొన్నాడు.

  భార్య అమీ, మేనమామ మెహుల్ చోక్సీ అమాయకులట

  భార్య అమీ, మేనమామ మెహుల్ చోక్సీ అమాయకులట

  దేశీయంగా నీరవ్ మోదీ వ్యాపార లావాదేవీల టర్నోవర్ సుమారు రూ.6,500 కోట్లు ఉంటుందన్నారు. కానీ తన బ్యాంక్ ఖాతాలు, ఆస్తులు స్వాధీనం చేసుకున్న తర్వాత రుణాలు చెల్లించే పరిస్థితులు లేకుండా పోయాయని వ్యాఖ్యానించారు. తన భార్య అమీకి, మేనమామ మెహుల్ చోక్సీలకు ఎటువంటి సంబంధం లేకున్నా ఈ కేసులో ఇరికించారని చెప్పుకొచ్చారు.

  పీఎన్బీ అధికారులు అతిస్పందనతోనే సోదాలని ఎదురుడాది

  పీఎన్బీ అధికారులు అతిస్పందనతోనే సోదాలని ఎదురుడాది

  పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు తన కంపెనీలు చెల్లించాల్సిన బకాయిలు రూ.5 వేల కోట్ల లోపే ఉంటాయని అతను ఆ లేఖలో స్పష్టం చేశాడని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. మేము చెల్లించాల్సిన బకాయిలపై పీఎన్‌బీ అతిగా స్పందించి మీడియాలో తప్పుడు ప్రచారం చేయడంతో అధికారులు మా కంపెనీల్లో సోదాలు నిర్వహించి వాటిని సీజ్ చేశారని ఆరోపించారు.

  సిబ్బంది వేతనాల చెల్లింపునకు సహకరించాలని వినతి

  సిబ్బంది వేతనాల చెల్లింపునకు సహకరించాలని వినతి

  సీబీఐ, ఈడీ దాడులతో తమ బ్రాండ్ నేమ్ దెబ్బతిని ఫైర్‌స్టార్ ఇంటర్నేషనల్, ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ సంస్థలు మూతబడటంతో పాటు బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించకుండా మమ్మల్ని దెబ్బతీశాయి. ఇప్పుడు ఈ రుణాలన్నీ తిరిగి చెల్లించలేనివిగా మిగిలిపోయాయని నీరవ్ మోదీ ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ మేరకు తన ప్రతినిధులు, బ్యాంక్ అధికారులకు మధ్య జరిగిన చర్చల వివరాలను వివరించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లోనూ తన సంస్థలో పని చేస్తున్న 2,200 మంది ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు వెసులు బాటు కల్పించాలని కోరడం ఆసక్తికర పరిణామం.

  ఇండియన్ నుంచి ఎన్నారైగా మార్చుకున్న నీరవ్

  ఇండియన్ నుంచి ఎన్నారైగా మార్చుకున్న నీరవ్

  భారీ కుంభకోణానికి పాల్పడ్డ వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ.. దేశాన్ని వీడేందుకు కూడా ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారత పౌరుడైన నీరవ్‌.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పిఎన్‌బి) కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందు తన హోదాను ప్రవాస భారతీయుడి (ఎన్‌ఆర్‌ఐ)గా మార్చుకున్నారు. అయితే నీరవ్‌ ఎన్‌ఆర్‌ఐ హోదాను ఎన్‌ఆర్‌ఐగా మార్చుకున్న విషయం భారతీయ బ్యాంకులకు, ప్రత్యేకించి పిఎన్‌బికి ముందే తెలుసా, లేదా అన్నది వెల్లడి కావాల్సి ఉంది.

  బ్యాంకు ఆడిటర్ల నియామక నిబంధనలు ఇక కఠినతరం

  బ్యాంకు ఆడిటర్ల నియామక నిబంధనలు ఇక కఠినతరం

  లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌ (ఎల్‌ఒయు), ఫారిన్‌ లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎఫ్ఎల్‌సి)కు సంబంధించిన నిజమైన (బోనఫైడ్‌) అన్ని చెల్లింపు హామీలను నెరవేరుస్తామని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పిఎన్‌బి) ప్రకటించింది. అందుకు సరిపడినన్ని ఆస్తులు కూడా తమ దగ్గర ఉన్నట్టు పేర్కొంది. నీరవ్‌ మోదీ కుంభకోణం తర్వాత బ్యాంకు ఆర్థిక పరిస్థితిపై వస్తున్న వార్తల నేపథ్యంలో పిఎన్‌బి ఈ ప్రకటన విడుదల చేయడం విశేషం. పిఎన్‌బి తాజా కుంభకోణంతో ఖంగుతిన్న ప్రభుత్వం ఇపుడు ప్రభుత్వ రంగ బ్యాంకు (పిఎ్‌సబి)ల ఆడిటర్ల నియామక నిబంధనలను కఠినం చేయాలని యోచిస్తోంది. 2011 నుంచే నీరవ్‌ మోదీ తదితరులు బ్యాంక్‌కు టోపీ పెడుతున్నా పిఎన్‌బి ఆడిటర్లు ఇప్పటి వరకు పసిగట్ట లేకపోవడంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పిఎన్బీల స్టాట్యుటరీ ఆడిటర్ల నియామకాన్ని మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  MUMBAI: Nirav Modi,the kingpin behind the largest banking scam+ in the country's history, has virtually wrung his arms in the air saying PNB's over zealousness has shut the doors on his ability to clear the dues, which he claimed is much lower than the bank has gone public with.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more