చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొజ్జల పాడే మోసిన ప్రాణ స్నేహితుడు చంద్రబాబు.. తుది నివాళి

|
Google Oneindia TeluguNews

టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మృతితో పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. ఇవాళ స్వ గ్రామం ఊరందూరులో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హజరయ్యారు. బొజ్జల పాడెను చంద్రబాబు మోశారు. తుది వీడ్కోలు పలికేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. బొజ్జల స్వస్థలం శ్రీకాళహస్తి మండలం, ఊరందూరులో అంత్యక్రియలు జరిగాయి.

శోకసంద్రంలో..

శోకసంద్రంలో..


శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి విమానంలో తిరుపతి విమానాశ్రయానికి బొజ్జల భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. రోడ్డు మార్గాన శ్రీకాళహస్తిలోని టీడీపీ కార్యాలయానికి తరలించారు. గంట పాటు ప్రజల సందర్శనార్థం పార్థీవదేహం ఉంచారు. తర్వాత పట్టణ ప్రధాన వీధుల మీదుగా ఊరేగింపుగా మధ్యాహ్నం 2.20 గంటలకు ఊరందూరుకు తరలించారు. పార్థివదేహం చూడగానే కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు భోరున విలపించడంతో గ్రామ శోకసంద్రంలో మునిగిపోయింది.

విలపించిన కూతురు

విలపించిన కూతురు


అమెరికా నుంచి అప్పటికే ఇంటికి చేరుకున్న బొజ్జల కుమార్తె పద్మరేఖ బోరున విలపించారు. శ్రీకాళహస్తిలోని శుకబ్రహ్మ ఆశ్రమ పీఠాధిపతి విద్యా స్వరూపానందగిరి స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమరనాథ్‌రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా రామచంద్రనాయుడు, ఎమ్మెల్సీ దొరబాబు, వైసీపీ ఎంపీ గురుమూర్తి, వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, అమర ఆస్పత్రి అధినేత రమాదేవి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గీర్వాణి, తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌ తదితరులు నివాళులు అర్పించారు.

 నేపథ్యం

నేపథ్యం


బొజ్జల స్వస్థలం శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరు.. ఆయన 1949 ఏప్రిల్ 15వ తేదీన గంగసుబ్బరామిరెడ్డి దంపతులకు జన్మించారు. గగసుబ్బరామిరెడ్డి కూడా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా పనిచేశారు. శ్రీవెంకటేశ్వర వర్శిటీ నుంచి 1968లో బొజ్జల బీఎస్సీ చేశారు. 1972లో లా పూర్తయ్యాక.. పెళ్లయ్యింది. లా ప్రాక్టీసు కోసం హైదరాబాద్ వచ్చి.. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

రాజకీయ రంగ ప్రవేశం

రాజకీయ రంగ ప్రవేశం


1989, 94, 98, 2009, 2014లో శ్రీకాళహస్తి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994-2004 మధ్య చంద్రబాబు కేబినెట్‌లో ఐటీ మంత్రిగా, రోడ్లు-భవనాల శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004 ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. మళ్ళీ 2009 ఎన్నికల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించగా.. చంద్రబాబు కేబినెట్‌లో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో మాత్రం గోపాలకృష్ణారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాజకీయవారసుడిగా కుమారుడు సుధీర్ రెడ్డిని బరిలోకి దింపగా ఓటమి ఎదురైంది. తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

English summary
bojjala gopala krishna reddy cremation completed. tdp chief chandrababu attend final rituals
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X