చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏరి పారేస్తా.. పార్టీలో కోవర్టులపై చంద్రబాబు కామెంట్స్

|
Google Oneindia TeluguNews

పార్టీలో కోవర్టులు ఉన్నారు అని చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు. సొంత పార్టీ గురించి కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కొందరు కామెంట్స్ చేయడంతో దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో తన నియోజకవర్గం నుంచే ప్రక్షాళన అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరినీ గమనిస్తున్నానని చెప్పారు.

కుప్పం నియోజ‌క‌వ‌ర్గ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. కుప్పం మున్సిపల్ ఎన్నిక‌ల ఫలితాలు, నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ స్థితిగ‌తుల‌పై స‌మీక్ష‌ నిర్వహించారు. కుప్పం రివ్యూలో ఆయన సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర స్థాయిలో పార్టీలో కోవ‌ర్టులు త‌యార‌య్యారని తెలిపారు. కుప్పం నుంచే పార్టీ ప్ర‌క్షాళ‌న ప్రారంభిస్తా అన్నారు. పార్టీలోని కోవర్టులను ఏరిపారేస్తా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

 chandrababu naidu sensational comments

తనను మెప్పించ‌డం కాదు... ప్ర‌జ‌ల్లో ప‌ని చేసిన వారికే గుర్తింపు అని చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. ఇందులో మరో మాటకు తావులేదని చెప్పారు. స్థానిక నేత‌ల అతి విశ్వాసం వ‌ల్లే కుప్పంలో ఓట‌మి ఎదురైందని చంద్ర‌బాబు అన్నారు. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓట‌మికి కుప్పం ప‌ట్ట‌ణ నేత‌లు కార‌ణాలు వివ‌రించారు. అధికార పార్టీ అరాచ‌కాల‌తో పాటు సొంత పార్టీలో త‌ప్పిదాల‌ను అధినేత‌కు తెలిపారు. దీంతో చంద్రబాబు కామెంట్స్ చేశారు. విశ్వాసం ఉండొచ్చు కానీ.. అతి విశ్వాసం ఉండొద్దు అని స్పష్టంచేశారు.

Recommended Video

Balakrishna Emotional On NTR's Backstabbing | Akhanda | CBN || Oneindia Telugu

కుప్పం స్థానిక నాయ‌క‌త్వంలో మార్పులు చెయ్యాల‌నే కార్య‌క‌ర్త‌ల సూచ‌న‌లు అమ‌ల్లోకి తీసుకొస్తాన‌ని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇక‌పై త‌రుచూ కుప్పంలో ప‌ర్య‌టిస్తానని... కార్య‌క‌ర్త‌ల‌కు, నేత‌లు ఎక్క‌వ స‌మ‌యం ఇస్తానని చంద్రబాబు అన్నారు. దీంతో వారికి వేధింపులు తప్పనున్నాయి. లేదంటే అధికార పార్టీ హరాస్ చేసే అవకాశం ఉంది. కుప్పంలో ఇల్లు నిర్మించుకుని ఎక్కువ స‌మ‌యం ఇవ్వాల‌నే కార్య‌క‌ర్త‌ల సూచ‌న‌లకు చంద్రబాబు ఓకే చెప్పారు. అందుబాటులో ఉంటే ఎవరికీ ఏ సమస్య ఉండదు. ఒకవేళ సమస్య వచ్చిన పరిష్కరించే వీలు ఉంటుంది.

English summary
tdp chief chandrababu naidu sensational comments on his party some anti leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X