health tips: నిద్రకు ముందు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా? ఎన్ని ఆరోగ్యసమస్యలు వస్తాయో తెలుసా!!
ప్రస్తుత సమాజంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి, నిద్రపోయే వరకూ చేతిలో మొబైల్ ఫోన్ లేకుండా ఎవరు ఉండడం లేదు. ఏ చిన్న విషయం అయినా, ఏదైనా సమాచారం అయినా మొబైల్ ద్వారానే తెలుసుకోవడం అలవాటు అయిన తర్వాత, మొబైల్ మన జీవితంలో భాగంగా మారిపోయింది. మనకు వచ్చే ఫోన్ కాల్స్ మాట్లాడడానికి, అవసరమైనప్పుడు కావాల్సిన సమాచారాన్ని చూసుకోవడానికి మొబైల్ ఫోన్లు ఉపయోగించవచ్చు కానీ, అదేపనిగా ఒక వ్యసనం లాగా మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తే ఆరోగ్యం పాడవుతుందని వైద్యులు చెబుతున్నారు.

స్మార్ట్ ఫోన్ల వినియోగంతో తలనొప్పి
ముఖ్యంగా కొందరు రాత్రి పడుకునే ముందు కూడా మొబైల్ ఫోన్ ను ఇష్టారాజ్యంగా వాడుతూ ఉంటారు. దీనివల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. నిద్రకు ముందు స్మార్ట్ ఫోన్ ఉపయోగం వల్ల విపరీతమైన తలనొప్పి వస్తుంది అని, కళ్ళు పొడిబారి దురదలు రావడం ప్రారంభమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ను విపరీతంగా ఉపయోగిస్తే, స్మార్ట్ ఫోన్ లో కాంతి మన కళ్ల పై ప్రభావాన్ని చూపి, కళ్ళు సమస్యలకు కారణం అవడమే కాకుండా, నిద్ర సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

స్మార్ట్ ఫోన్ల వినియోగంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం
ఫోన్లను ఉపయోగించేటప్పుడు ఫోన్ లలో వచ్చే బ్లూ లైట్ అనేక అనర్థాలకు కారణమవుతుందని చెబుతున్నారు. అంతే కాదు స్మార్ట్ ఫోన్లను విపరీతంగా వాడటం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. ఎక్కువగా ఫోన్ ఉపయోగించే మగవారిలో శుక్రకణాల నాణ్యత దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల స్పెర్మ్ ప్రోగ్రెసివ్ మెటిలిటీని తగ్గిస్తుందని హెచ్చరిస్తున్నారు.

రేడియేషన్ ప్రభావంతో బ్రెయిన్ ట్యూమర్ల ప్రమాదం
అంతేకాదు ఎక్కువగా ఫోన్ల వాడకం వల్ల వచ్చే రేడియేషన్ ప్రభావంతో ఆడవారిలో గర్భస్రావానికి అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. బ్రెయిన్ ట్యూమర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, చెవి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తల నరాల సమస్యలు, కంటి నరాలు దెబ్బతినటం జరుగుతుందని అంటున్నారు.

స్మార్ట్ ఫోన్ల ఉపయోగంతో మానసిక ఆరోగ్యం ఎఫెక్ట్
ఎక్కువగా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించడం వల్ల మానసిక ఆరోగ్యం ప్రభావితం అవుతుందని, అనేక మానసిక రుగ్మతలు కలుగుతాయని, ఇన్సోమ్నియా సమస్య వేధిస్తుందని చెబుతున్నారు. రాత్రి సమయాలలో పడుకునే ముందు ఎటువంటి పరిస్థితులలోనూ స్మార్ట్ ఫోన్ లను ఉపయోగించకూడదని హెచ్చరిస్తున్నారు. నిద్రకు ఉపక్రమించే ముందు ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా పడుకోవాలని తద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications