• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బీజేపీకి ఎదురు దెబ్బ.. 5లో జీఎస్టీ కోత.. మోడీ చరిష్మా ఏమైంది?

|

హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ కు దీటుగా పోటీపడతామన్న కమలనాథుల ఆశలు ఫలించలేదు. 70 స్థానాలు గెలిచి అధికారంలోకి వస్తామనే ధీమా కనబరిచినా.. ఓటర్లు మాత్రం కనికరించలేదు. అదలావుంటే పోలింగ్ తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో కీ రోల్ పోషిస్తామని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. తీరా ఫలితాలొచ్చాక చూస్తే ఎదురుదెబ్బ తగిలింది.

2014 లో 5 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ ఈసారి ఓటింగ్ శాతంతో పాటు సీట్లు కూడా పెరుగుతాయని ఆశించింది. యువత బీజేపీ వైపు చూస్తుందని బలంగా నమ్మిన బీజేపీకి ఊహించని షాక్ ఎదురైంది. 70 స్థానాలతో అధికారం అని ఒకసారి, 10 సీట్లైనా గెలుస్తామని మరోసారి చెప్పిన సందర్భాలున్నాయి. తీరా చూస్తే 2014 కూడా రిపీట్ కాలేదు. అప్పటి 5 స్థానాలు కూడా రాని బీజేపీ ఈసారి కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకోవడం గమనార్హం.

 యువతపై నమ్మకం.. దెబ్బకొట్టిన ఓటర్లు

యువతపై నమ్మకం.. దెబ్బకొట్టిన ఓటర్లు

తెలంగాణ అసెంబ్లీ పోరుపై భారీ ఆశలే పెట్టుకుంది బీజేపీ. అందుకే ఏ పార్టీతోనూ పొత్తుల అంశం కూడా మాట్లాడలేదు. ఒంటరిగా బరిలోకి దిగి సత్తా చాటాలని ఉవ్విళ్లూరింది. ఒకానొక సందర్భంలో అధికారం ఖాయమంటూ వ్యాఖ్యానించారు ఆ పార్టీనేతలు. మరికొన్ని సందర్భాల్లో 10 సెగ్మెంట్లలో గెలుపు మాదే అన్నారు. అయితే ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు. హైదరాబాద్ గోషామహల్ నుంచి రాజాసింగ్ ఒక్కరే గెలుపొందడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అంబర్ పేట నుంచి ముచ్చటగా మూడోసారి (హిమాయత్ నగర్ కాకుండా ) గెలుద్దామనుకున్న కిషన్ రెడ్డి ఆశలు ఫలించలేదు. ముషీరాబాద్ నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఓడిపోవడం గమనార్హం. ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డి, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఓటమి పాలయ్యారు. అటు కరీంనగర్ లో బండి సంజయ్ గెలుపు ఖాయమని భావించినా.. కారు హవా బ్రేకులు వేసినట్లయింది. మొత్తానికి యువత ఓట్లపై భారీగా అంచనాలు పెంచుకున్న బీజేపీకి చివరకు ఎదురుదెబ్బ మిగిలింది.

స్టార్ క్యాంపెయిన్ తుస్.. వర్కవుట్ కాని చరిష్మా

స్టార్ క్యాంపెయిన్ తుస్.. వర్కవుట్ కాని చరిష్మా

బీజేపీ స్టార్ క్యాంపెయిన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం పనిచేయలేదని చెప్పొచ్చు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం రాష్ట్రానికి వచ్చి ప్రచారం నిర్వహించినా ఓట్లు రాలలేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పలు దఫాలుగా వచ్చి క్యాంపెయిన్ చేసినా నో యూజ్. ఇక ఆధ్యాత్మికవేత్త పరిపూర్ణానంద తనదైన స్ట్రాటజీ ఉపయోగించినా లాభం లేకుండా పోయింది. ఎలాంటి అవినీతికి పాల్పడబోమని పార్టీ అభ్యర్థులతో ప్రచార సభల్లో ప్రమాణం చేయించినా కూడా ఓటర్లు మొగ్గు చూపలేదు. మొత్తానికి మోడీ, అమిత్ షా చరిష్మా పనిచేయకపోవడంతో పార్టీశ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2014 లో 5 సీట్లు గెలిస్తే.. ఇప్పుడు ఒకే ఒక్క సీటు గెలవడంతో జీఎస్టీ కోత పడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

 కేంద్రం నిర్ణయాలు దెబ్బ కొట్టినట్టా?

కేంద్రం నిర్ణయాలు దెబ్బ కొట్టినట్టా?

నోట్ల రద్దు, జీఎస్టీ అమలు లాంటి కేంద్రం నిర్ణయాలు తెలంగాణలో బీజేపీకి దెబ్బకొట్టాయని చెప్పొచ్చు. నోట్ల రద్దుపై రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకోవడంతో సామాన్యులు చాలా ఇబ్బందులు పడ్డారు. తమ డబ్బులు బ్యాంకుల్లో ఉన్నా.. తీసుకోలేని పరిస్థితులు తలెత్తాయి. వాస్తవానికి నోట్ల రద్దు మంచి పరిణామమని చాలామంది భావించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో సామాన్యులను ఒప్పించి మెప్పించడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారనే వాదనలున్నాయి. అటు జీఎస్టీ ప్రభావం కూడా బీజేపీ ఓట్లు చీల్చిందనేది మరో కోణం.

మొత్తానికి 5 స్థానాల నుంచి ఒక్క స్థానానికి పడిపోవడం నిజంగా బీజేపీకి మింగుడుపడని విషయం. బీజేపీ సోషల్ మీడియా స్టార్ అమిత్ షా బూత్ లెవెల్ నుంచి పునాదులు వేసినా ఫలితం లేకుండా పోయింది. ఇక తెలంగాణలో బీజేపీ స్టాండ్ ఏంటో.. వారి కార్యాచరణ ఏవిధంగా ఉండబోతుందో చూడాలి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In Telangana, the BJP suffered a stroke. BJP Cadre hopes of competing against the TRS were in vain. BJP won 5 seats in 2014, it is now the only one to won a single seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more