హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జాతిరత్నాలా ఏందీ..? సత్యహరిశ్చంద్రులేం కాదు: రేవంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

మునుగోడు బై పోల్ తర్వాత రాజకీయ పరిణామలు మారిపోతున్నాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. భారత్ జోడో యాత్ర తర్వాత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. బీజేపీని కూడా వదల్లేదు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని మాట్లాడారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలను కేసీఆర్ ప్రశంసించడంపై మండిపడ్డారు. వారెమైనా జాతిరత్నాల అంటూ విరుచుకుపడ్డారు.

కలుషితం చేసి..

కలుషితం చేసి..


బీజేపీ, టీఆర్ఎస్ రెండు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని కలుషితం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు నాటకానికి తెరలేపాయని హాట్ కామెంట్స్ చేశారు. తమను ప్రలోభపెట్టారని చెబుతున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు సత్యహరిశ్చంద్రుడి వారసులు అని ఎద్దేవా చేశారు. అన్ని చోట్ల కెమెరాలు పెట్టి వాళ్లను పట్టివ్వాలని కేసీఆర్ చెప్పాడంట... వీళ్లు పట్టించారంట అంటూ సెటైర్లు వేశారు.

 జాతిరత్నాలా..?

జాతిరత్నాలా..?


ఆ ఎమ్మెల్యేలను మునుగోడు తీసుకెళ్లి జాతిరత్నాలు అని కేసీఆర్ చెబుతుండటం చూస్తే ఆయనకు మతి తప్పిందేమోననే సందేహాం కలుగుతుందన్నారు. ఈ జాతి రత్నాలు ఎక్కడివి? అని రేవంత్ నిలదీశారు. ఎక్కడ కొట్టుకొచ్చావు వీటిని? అని అడిగారు. కాంగ్రెస్ పార్టీపై గెలిచి అక్కడ అమ్ముడుపోయారు వాళ్లు అని తెలిపారు. మరీ అలాంటి వారు అలాగే ఉంటారా? అని అడిగారు.

వారిని నమ్మి.. రాజకీయం

వారిని నమ్మి.. రాజకీయం


అలాంటి వారిని నమ్మి రాజకీయం చేస్తున్నావా? అని ప్రశ్నించారు. కొనుగోలుపై వాళ్లు చెప్పగానే కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా? అన్నారు. కేసీఆర్ ఇంత దిగజారిపోయారా అనిపిస్తోందని విమర్శలు చేశారు. పైగా అతనే సుద్దులు చెబుతున్నారని అడిగారు. కేసీఆర్ ఏం చేశారో తెలంగాణ సమాజం చూసిందని వివరించారు.

 కేసీఆర్ బిల్డప్

కేసీఆర్ బిల్డప్


ఆ నలుగురు జాతి రత్నాలు అని కేసీఆర్ బిల్డప్ ఇచ్చారని మండిపడ్డారు. కాంగ్రెస్- టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినవారు.. మరో పార్టీలోకి వెళ్లారని మీరెలా అనుకుంటారని ప్రశ్నించారు. పైగా వారు చేసింది కరెక్ట్ అని.. అమ్ముడు పోలేదని అంటారా అని నిలదీశారు. ఆ రెండు పార్టీలు విలువలు లేకుండా ప్రవర్తించాయని మండిపడ్డారు.

English summary
tpcc president revanth reddy fires on cm kcr on mlas proach issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X