Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డీ-గ్రేడ్ మైండ్ సెట్: మా ప్రవర్తనపై అనుమానాలా? డ్రెస్ కోడ్ పై భగ్గుమన్న విద్యార్థినులు హైదరాబాద్:

హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ అమ్మాయిలకు 'డ్రెస్ కోడ్' విధించడంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. విద్యార్థినులు తమ మోకాళ్లు కనిపించకుండా కింది వరకూ ఉండేలా కుర్తీలు ధరించాలని, మోచేతుల వరకు పొడవు ఉండే టాప్ లను వేసుకోవాలంటూ డ్రెస్ కోడ్ ను విధించింది కళాశాల యాజమాన్యం. డ్రెస్ కోడ్ ను పాటించని విద్యార్థినులను తరగతులకు హాజరు కానివ్వకుండా అడ్డుకున్నారు కళాశాల సిబ్బంది. వారిని వెనక్కి పంపించేశారు. ఈ ఉదయం 10:30 గంటలకు విద్యార్థినుల తరఫున ముగ్గురు ప్రతినిధులు ప్రిన్సిపల్ తో చర్చించారు. డ్రెస్ కోడ్ ను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కళాశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయం అయినందున.. తానేమీ చేయలేనని, అవసరమైతే ఈ విషయాన్ని తాను మేనేజ్ మెంట్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

ప్రిన్సిపల్ నుంచి ఎలాంటి హామీ రానందున.. విద్యార్థినులు నిరసన ప్రదర్శనకు దిగారు. తరగతులను బహిష్కరించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డీ గ్రేడ్ మైండ్ సెట్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఆధునిక యుగంలోనూ అమ్మాయిల పట్ల తమకు ఉన్న మైండ్ సెట్ ను మార్చుకోవాలని సూచించారు. షార్ట్స్ ధరించి కళాశాలకు రావడం వల్ల జరిగే అనర్థమేంటో యాజమన్యం వెల్లడించాలని పట్టుబట్టారు.

 St Francis students protest against management for restricting wearing kurtas above knees

మున్ముందు మరిన్ని కఠినమైన నిబంధనలను తీసుకుని రాబోదనే గ్యారంటీ తమకు లేదని విద్యార్థినులు చెబుతున్నారు. తమ నినాదాలతో పరిసర ప్రాంతాలను హోరెత్తించారు. వారిని శాంతింపజేయడానికి ప్రిన్సిపల్, ఇతర సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారాన్ని అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. విద్యార్థినులను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

st fransis

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+