హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ys sharmila: 100 కిమీ చేరిన పాదయాత్ర.. కేసీఆర్ సర్కార్‌పై ఫైర్

|
Google Oneindia TeluguNews

పాదయాత్రలో వైఎస్ షర్మిల నిప్పుల చెరుగుతున్నారు. కేసీఆర్ సర్కార్‌పై ఒంటికాలిపై లేస్తున్నారు. షర్మిల మహా పాదయాత్ర 9వ రోజు ముగిసింది. ఉదయం 10.30 నిమిషాలకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఎలిమినేడు గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభం కాగా, కప్పపహాడ్, తుర్కగూడ గ్రామం, చెర్లపటేల్ గూడ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చేరుకుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోకి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రవేశించగా 100 కిలోమీటర్లకు చేరుకుంది. పాదయాత్ర 100 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా పార్టీ ప్రచార కమిటీ కోర్డినేటర్ నీలం రమేష్ శిలాఫలకాన్ని, వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. షర్మిల, విజయమ్మ పావురాలను విడిచి స్వేచ్చకు స్వాగతం పలికారు. తర్వాత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు.

ఇష్టంగా

ఇష్టంగా


కష్టంగా లేదా అని షర్మిలను అడిగితే, అమ్మా నాన్న చనిపోయి 12 సంవత్సరాలు అవుతున్నా ఎవరూ మర్చిపోలేదని, ఆయన వారి గుండెల్లో సజీవంగా ఉన్నాడమ్మా అని షర్మిల చెప్పిందని విజయమ్మ గుర్తుచేశారు. ఇది చాలా పెద్ద పని అని, జాతీయ పార్టీలు కూడా ఇందులో ఉన్నాయని చెప్పానన్నారు. నాన్న ఆశీస్సులు తనకు ఉన్నాయని, పేదల బాధలు పంచుకుంటానని చెప్పింది. ఆమె పట్టుబట్టి అనుకున్నది సాధించే వరకు వదలదు. ఆమె సంకల్పబలంతో సీఎం అవుతుందని చెబుతున్నాను. వైఎస్ఆర్ చెప్పినట్టు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్రకు మించి మరొకటి లేదని, సంక్షేమం, స్వయం సమృద్ధి అనే నినాదంతో ముందుకు సాగుతోందని, వైఎస్ఆర్ లానే షర్మిల పాదయాత్ర కూడా చరిత్ర సృష్టిస్తుందని తెలిపారు.

పాదయాత్ర ఇలా

పాదయాత్ర ఇలా

ఇబ్రహీంపట్నం క్రాస్ నుంచి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని చౌరస్తా వరకు పాదయాత్ర సాగింది. ఇబ్రహీంపట్నం చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు. వైఎస్ఆర్ కాలంలో వ్యవసాయం పండుగలా ఉండేది. ఉచిత వైద్యం కోసం ఆరోగ్య శ్రీ ఇచ్చారు. అయిదేళ్లలో ఒక్క రూపాయి కూడా పన్నులు పెంచలేదు. అంత గొప్ప పాలన వైఎస్‌దీ అని చెప్పారు. పావలా వడ్డీ రుణాలతో మహిళలు తమ సొంత కాళ్ల మీద నిలబడ్డారు. ఇప్పుడు వడ్డీ రూపాయి పావలా పడుతోంది. ఆ రుణాలను ఇంటి ఖర్చులకే వాడుతున్నారని మహిళలు చెబుతున్నారు. కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేదు. ఆరేళ్లు, నాలుగేళ్ల పసి పిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే సీఎం ఉరేసుకుని చచ్చిపోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమాజం ముందు నిరుద్యోగులు తలెత్తుకొని తిరగలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దున్నపోతు మీద వాన పడినట్లు కేసీఆర్‌లో చలనమే లేదు. హమాలీ పని చేసుకొని బతకండమని మంత్రులే నిరుద్యోగులకు చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబం అన్నింటిని నిర్ణయిస్తూ నియంతల్లా మారుతున్నారు. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల కోసం పుట్టిన పార్టీ.. కేసీఆర్ సర్కార్‌ను గద్దె దించి వైఎస్ఆర్ సంక్షేమ పాలన అందిస్తానని మాటిస్తున్నానని వివరించారు.

మేలు

మేలు

ఇబ్రహీంపట్నం నియోజవకవర్గానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం మేలు చేసింది. ఫార్మాసిటీ ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేస్తామని చెప్పి పట్టా భూములను కూడా గుంజుకున్నారు. భూ చట్టం ప్రకారం భూ సేకరణ చేస్తే ఉన్న విలువ కంటే మూడింతలు ఎక్కువగా ఇవ్వాలి. కానీ కేసీఆర్ 20 లక్షల రూపాయలు ఉన్న భూమిని పట్టాకైతే 10 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. అసైండ్ భూమి ఐతే 7 లక్షల రూపాయలే చెల్లిస్తున్నాడు. ఇది దోపిడీ కాదా..? సర్కారే దోపిడి చేస్తే ప్రజలు ఎవరిని అడగాలి అన్నారు. ధరణి పోర్టల్ ఏమైంది..? టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న విధానాలు కొండ నాలుకను బాగు చేయబోతే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్టుగా ఉంది. ధరణి పోర్టల్ ఎందుకు పెట్టారో ఎవరికీ తెలియదు. ధరణీ పోర్టల్ లో అన్నీ అవకతవకలే ఉన్నాయి. 20 ఎకరాలు ఉన్న వారికి 15 ఎకరాలు చూపిస్తుంది. 2 ఎకరాలు ఉన్న వారికి ఎకరం నరే చూపిస్తోంది. వేల ఎకరాలను కబ్జా చేసే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. ముఖ్యమంత్రే దొంగైతే ప్రజలు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ఊరికే వెళ్లాం...అక్కడ పెన్షన్, డ్రైనేజీ, రోడ్డు సమస్యలు ఉన్నాయి. అమ్మకు అన్నం పెట్టడు గానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట...స్వంత ఊరిని బాగు చేయలేని వాడు నియోజకవర్గాన్ని బాగుచేస్తానని అంటున్నాడు. ఫార్మాసిటీ భూమి విషయంలో ఎమ్మెల్యే కారుపై దాడి చేయడంపై బాగా బుద్ది చెప్పారన్నారు. మీకు అండగా మేము ఉంటాం. కేసీఆర్ లాంటి పనిమంతుడు పందిరివేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందన్నారు.

లక్ష 33 వేల కోట్లు

లక్ష 33 వేల కోట్లు


వైఎస్ఆర్ తలపెట్టిన 33 కోట్ల రూపాయల ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును లక్షా 33 కోట్ల రూపాయలకు పెంచి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి వేల కోట్లు డబ్బు మాయం చేశారు. రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం నుంచి ఎత్తిన నీళ్లు సముద్రంలో పారబోస్తున్నారు. కేసీఆర్ ఆదేశాలతో కలెక్టర్ల నుంచి రైతులకు వరి వేయవద్దని ఆదేశాలు ఇస్తున్నారు. వరి వేయకుంటే రైతులు ఉరివేసుకోవాలా? కేసీఆర్ గారు రైతులు వరి పంట వేస్తే ఆకరి గింజ వరకు కొనుగోలు చేస్తానని చెప్పాడు. కేంద్రంతో కొట్లాడైనా కొనుగోలు చేపిస్తానన్నారు. బీజేపీ పార్టీకి వంగి వంగి కేసీఆర్ దండాలు పెడుతున్నారు. రైతుకు ఏ పంట వేయాలో తెలియదా...? దొర బాంచన్ అని అందరూ కేసీఆర్ కాళ్ల దగ్గర పడి ఉండాలా..?

ఎన్నికల స్టంట్

ఎన్నికల స్టంట్

హూజురాబాద్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల కోసమే దళిత బందు ప్రవేశ పెట్టారు. ఏ పథకమైనా ఎన్నికల కోసమే ఏర్పాటు చేసి, ఎన్నికలు అయిపోతే పట్టించుకోవడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం హూజురాబాద్ ఎన్నికల్లో ఓటుకు 10వేల రూపాయలు పంచుతున్నారు. బీజేపీ పార్టీ 7 వేల రూపాయలు ఇస్తుందట. తీసుకుని ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలు పరక పట్టుకుని చెప్పండి. పెట్రోల్, డిజిల్ ధరలు పెరిగాయంటే దానికి కారణం బీజేపీ, టీఆర్ఎస్ లే. పెట్రోల్, డీజిల్ ధరలు సంవత్సరంలో 30 రూపాయలు పెరిగింది. ప్రజల మీద పడే భారాన్ని ఏ ప్రభుత్వం తగ్గించడం లేదు. టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఒక సప్లేయింగ్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇప్పడు టీఆర్ఎస్ పార్టీలో లేరా..? టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోవడం అనేది రాజకీయ వ్యభిచారం కాదా..?

Recommended Video

ఏపిలో అరాచకం రాజ్యమేలుతుందన్న టీడిపి జాతీయ అధికార ప్రతినిధి దివ్యవాణి || Oneindia Telugu
కొలువులు ఏవీ

కొలువులు ఏవీ

ఉద్యోగాలు ఇవ్వలేని ఈ సన్నాసులు ఈ రోజు మాపై టీఆర్ఎస్ మంత్రి మొరుగుతున్నారు. మంచీ చెడు ఆలోచించే నాయకుడు టీఆర్ఎస్ పార్టీలో లేరు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారు మంత్రులా లేక కుక్కలా అనిపిస్తోంది. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి పాదయాత్ర చేస్తున్నాం. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎం చేస్తోంది. మీకు దమ్ముంటే మాతో కలిసి పాదయాత్ర చేయండి. ఎంత అభివృద్ధి చేశారో మీరు చూపించండి. సమస్యలు ఉంటే రాజీనామాలు చేసి ఒక దళితున్ని ముఖ్యమంత్రిని చేయాలని సవాల్ విసిరారు.

English summary
ysrtp chief ys sharmila angry on cm kcr. kcr is a cheater she alleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X