హిందు బాయ్- ముస్లిం గర్ల్ ప్రేమ: మొహర్రం రోజు మీట్.. ఘర్షణ, ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
కర్ణాటకలో మత ఘర్షణ చెలరేగింది. కొప్పాల్‌లో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. హులిహైదర్ గ్రామంలో హిందు, ముస్లింల మధ్య ఫైట్ జరిగింది. గ్రామానికి చెందిన ఓ హిందు అబ్బాయి.. ముస్లిం అమ్మాయిని ప్రేమించాడట. ఇటీవల మొహర్రం పండగ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో యువతిని యువకుడు కలిశాడు.

వారిద్దరీ కలిసి కనిపించడమే పాపమైపోయింది. ఇంకేముంది ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. చినికి చినికి గాలివానలా మారింది. ఇద్దరి ప్రాణాలను తీసింది. మరో ఆరుగురు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.












Click it and Unblock the Notifications