• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శత్రువుకు కూడా రాకూడని కష్టాలు.!విషాదాల మీద విషాదాలు.!2020అంటేనే చీదరించుకుంటున్న జనం.!

|

హైదరాబాద్ : 2020 కొత్త దశాబ్దం ఒక్క భారత దేశాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని చీల్చి చంఢాడుతోంది. నూతన దశాబ్దం కావడంతో కొత్త టార్గెట్ లతో, కొత్త కొత్త ఆశయాలతో అత్యంత ఉత్సాహభరిత వాతవరణం మద్య కేరింతలతో 2020సంవత్సరానికి యువత ఘనంగా స్వాగతం పలికింది. 2019లో సాధించలేని లక్ష్యాలను 2020లో ఎలాగైనా సాధించి స్నేహితులతోనే కాకుండా తల్లిదండ్రులతో శభాష్ అనిపించుకుందామని కలలు కన్న యువత ఆశలను 2020 సంవత్సరం ఘోరంగా కల్లలు చేసింది. దీంతో 2020సంవత్సరానికి ఎంత ఘనంగా స్వాగతం పలికారో అంతే ఘోరంగా చీదరించుకుంటున్నారు ప్రపంచ యువత.

కష్టాలను తెచ్చిన 2020... కరోనా వైరస్ తో అల్లాడుతున్న ప్రపంచ జనాబా..

కష్టాలను తెచ్చిన 2020... కరోనా వైరస్ తో అల్లాడుతున్న ప్రపంచ జనాబా..

ఇదేం కొత్త సంవత్సరంరా బాబూ., 2020సంవత్సరం బాగానే దూల తీర్చిందిగా., సర్వం నాశనం చేసిన కొత్త సంవత్సరం., కొత్త సంవత్సరంలో కొత్త ఉద్యోగం దేవుడెరుగు, ఉన్న ఉద్యోగానికి దిక్కు లేదురా దేవుడా., మామా జాబ్ పోయిందిరా.., కరోనా తీవ్రత తగ్గిన తర్వాత కాల్ చేస్తామన్నారు రా., 2020వచ్చింది కష్టాలు తెచ్చింది, 2020లో మూత పడ్డ అనేక కంపెనీలు... ఎక్కడ చూసినా యువత ఈ అంశాల గురించే చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది. కోటి ఆశలతో, కొంగొత్త ఆలోచనలతో భవిశ్యత్ పట్ల బంగారు బాటలు వేసుకున్న యువతను తీవ్ర విషాదంలోకి నెట్టింది ఈ 2020సంవత్సరం.

నిరుద్యోగుల నిలయాలుగా నగరాలు... అంతా 2020 పుణ్యమే అంటున్న యువత..

నిరుద్యోగుల నిలయాలుగా నగరాలు... అంతా 2020 పుణ్యమే అంటున్న యువత..

అంతే కాకుండా ప్రపంచంలోని అగ్రదేశాల మీద కరోనా వైరస్ పేరుతో 2020 సంవత్సరం ఘోరమైన పంజా విసిరింది. అమెరికా, రష్యా, ఇటలీ, స్పెయిన్, చైనా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు కరోనా వైరస్ దెబ్బకు కకావికలం అయ్యాయి. కోట్ల ఉద్యోగాలు గల్లంతు కావడంతో పాటు లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పటిష్టమైన వ్యవస్థలన్నీ ఆర్థికంగా కుదేలయ్యి దివాళాతీసే పరిస్థితులు తలెత్తాయి. అంతర్జాతీయ విపత్తులా పరిణమించిన కరోనా వైరస్ ను కూడా 2020సంవత్సరం మోసుకొచ్చిందనే చర్చ యువతలో చోటు చేసుకుంటోంది. పగ వాడికి సైతం ఇలాంటి కష్టాలు రాకూడదనే అభిప్రాయానికి వచ్చేట్టు చేసింది ఈ 2020 సంవత్సరం.

ఇంతటి విపత్తు ఎన్నడూ చూడలేదు.. వ్యవస్ధల మీద చావు దెబ్బ తీసిన 2020సంవత్సరం..

ఇంతటి విపత్తు ఎన్నడూ చూడలేదు.. వ్యవస్ధల మీద చావు దెబ్బ తీసిన 2020సంవత్సరం..

ఇక ఎంతో మంది మహనీయులను పొట్టనపెట్టుకుంది ఈ 2020సంవత్సరం. ఆరోగ్యంగా కనిపించిన చాలా మంది సినిమా సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను కళాకారులను, క్రీడాకారులను కాలగర్బంలో కలిపేసి అంతులేని దుఃఖాన్ని 2020సంవత్సరం మిగిల్చింది. ప్రపంచ వ్యాప్తంగా 60సంవత్సరాలు నిండిన వ్యక్తులపై దారుణ ప్రభావం చూపించి ఐనవాళ్లందరి నుండి దూరం చేసింది. కరోనా పేరుతో ఆసుపత్రిలో చేరిన వారికి లక్షల్లో ఆర్దిక బారాన్ని కలిగించి దిక్కులేని ఏకాకులను చేసింది 2020 సవంత్సరం. అందుకే 2020సంవత్సరం అంటేనే యువత భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి.

మహనీయులను కనుమరుగు చేసిన 2020.. శత్రవుకు సైతం ఇలాంటి పరిస్థితి రావొద్దంటున్న యువత..

మహనీయులను కనుమరుగు చేసిన 2020.. శత్రవుకు సైతం ఇలాంటి పరిస్థితి రావొద్దంటున్న యువత..

అంతే కాకుండా భారతదేశానికే వరం లాంటి నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యాన్ని కూడా, ఈ 2020ఏడాది కనుమరుగు చేసి, యావత్ సంగీత ప్రపంచాన్ని శోక సంద్రంలోకి నెట్టేసింది. అంతే కాకుండా సినిమా ప్రపంచానికి అంతులేని దుఃఖాన్ని రగిల్చింది 2020సంవత్సరం. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారు కొందరైతే, కరోనా సోకి కానరాని లోకాలకు వెళ్తున్నారు మరికొంత మంది. తాజాగా ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు, బీజేపి నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, అమీత్ షా, అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా కోరల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఇంతటి ఉపద్రవాన్ని మోసుకొచ్చిన 2020సంవత్సరాన్ని మాత్రం అన్ని వర్గాల ప్రజానికం అసహ్యించుకుంటున్నట్టు తెలుస్తోంది.

English summary
The year 2020 has badly dreamed of the hopes of the youth who dreamed. With this, the youth of the world are suffering as badly as they welcomed the year 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X