వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంట్రప్రెన్యూర్స్ కోసం... మీ ఫిట్‌నెస్ అంచనా వేసేందుకు 3 సులువైన వ్యాయామ టెస్టులు...

|
Google Oneindia TeluguNews

పరిమిత వనరులే ఉన్నప్పటికీ.. తమ విలువైన ఎంట్రప్రెన్యూరియల్ సమయాన్ని ఎక్కడ ఫోకస్ చేయాలో తెలిసినవాళ్లు సరైన ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్యం,ఫిట్‌నెస్ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. మీరూ అందరి లాంటి ఎంట్రప్రెన్యూర్స్ అయితే ఎప్పుడూ తగినంత ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఇది కేవలం మీ ఆరోగ్యానికే కాదు... మీపై విపరీతమైన ఒత్తిడి నెలకొన్నప్పుడు కూడా మీరు రాణించేలా చేస్తుంది. దాదాపు 12 గంటల పాటు మీరు మెరుగైన మానసిక స్థితిని కొనసాగించేలా చేస్తుంది. అంతేకాదు,మీ బుర్రను సైతం ఇంకాస్త పదునెక్కిస్తుంది. శారీరకంగా మీరెంత ఫిట్‌గా ఉన్నారో ఇలా సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి...

అప్పర్ బాడీ స్ట్రెంత్

అప్పర్ బాడీ స్ట్రెంత్

మనిషి శారీరక శక్తిని అంచనా వేసేందుకు అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ సంస్థ 'పుషప్ టెస్టు'ను ప్రతిపాదిస్తోంది. దీని ప్రకారం... ముందుగా కాళ్లు,చేతులు నేలపై సమానంగా పెట్టి.. శరీరాన్ని పైకి లేపాలి. ఆ తర్వాత 90 డిగ్రీల కోణంలో శరీరాన్ని పైకి-కిందకు ఆడించాలి. అలా ఒక పీరియడ్‌లో ఎన్ని పుషప్స్ చేశారో లెక్కించండి. కింద ఉన్న గ్రాఫ్‌ని బట్టి పుషప్స్‌లో మీ స్థానం ఎక్కడుందో చూసుకోండి. ఇతరులతో పోల్చి చేసుకోవడం ఇంకాస్త సహేతుకంగా ఉంటుంది. ఒక రీసెర్చ్ ప్రకారం... పురుషుల్లో 10 లేదా అంతకన్నా తక్కువ పుషప్స్ చేసేవారితో పోలిస్తే... 40 లేదా అంతకన్నా ఎక్కువ పుషప్స్ చేసేవారిలో హృదయ సంబంధిత సమస్యలు రావడం 96శాతం కన్నా తక్కువ.

లోయర్ బాడీ స్ట్రెంత్

లోయర్ బాడీ స్ట్రెంత్

ఈ టెస్టు కోసం మీకో కుర్చీ అవసరం. మీరు ఆ కుర్చీలో కూర్చొన్నప్పుడు మీ కాళ్లు 90డిగ్రీల కోణంలో ఉండాలి. ఆ తర్వాత మీ చేతులు ముందుకు చాచాలి. ఆపై కుర్చీ నుంచి కాస్త పైకి లేస్తూ కిందకు వస్తూ గుంజీలు తీయాలి. మీ వెనక భాగం కుర్చీని కొద్దిగా మాత్రమే తాకాలి. అలా వీలైనన్నీ గుంజీలు తీయాలి. ఈ కింద ఉన్న గ్రాఫ్‌లో మీ స్ట్రెంత్‌ని పరిశీలించవచ్చు. ఈ వ్యాయామం ద్వారా మీ లోయర్ బాడీ ధృఢంగా తయారవుతుంది. బాడీకి మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది.

కార్డియోవస్క్యులర్ ఫిట్‌నెస్

కార్డియోవస్క్యులర్ ఫిట్‌నెస్

ఇందుకోసం చాలా రకాల వ్యాయామాలు ఉన్నాయి. ఇందులో ఒకటి.. మీరు ఒక మైలు దూరం పరిగెత్తడం.. మీరెంత వేగంగా పరిగెత్తుతున్నారన్న దానిపై మీ ఫిట్‌నెస్ ఆధారపడి ఉంటుంది. మరొకటి VO2 మ్యాక్స్ పద్దతి. మీ శరీరం గరిష్ఠంగా ఎంత ఆక్సిజన్‌ను తీసుకుంటుందనేది దీని ద్వారా అంచనా వేయడం. మీ వయసు,దిన చర్యలు,నడుము సైజు తదితర అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. వాకింగ్,జాగింగ్,సైక్లింగ్ ద్వారా కూడా కార్డియోవస్క్యులర్ ఫిట్‌నెస్ పొందవచ్చు.

English summary
Most small-business owners understand the concept of diminishing returns: The idea that, when other variables stay constant, at some point putting in additional time and effort results in increasingly smaller results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X