వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ విషయంలో ప్రపంచంలోనే ఇండియా లాస్ట్: పాకిస్తాన్ మనకంటే డబుల్ బెటర్..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 'డిజిటల్ ఇండియా' వైపు దేశం వేగంగా అడుగులు వేస్తున్నా.. మొబైల్ ఫోన్స్ ఇంటర్నెట్ స్పీడు మాత్రం ఇప్పటికీ సవాల్ గానే ఉంది. టెలికాం కంపెనీలు 4జి ఇంటర్నెట్ సేవలను విస్తృతం చేసిన తర్వాత.. దేశంలో ఇంటర్నెట్ స్పీడు మరింత పడిపోయింది. ఆఖరికి పాకిస్తాన్, అల్జీరియా, కజకిస్తాన్, ట్యునిషియాల కంటే ఇండియాలోనే 4జి స్పీడు తక్కువ అని తేలింది. ఒకరకంగా ప్రపంచవ్యాప్తంగా ఇండియానే ఈ విషయంలో అట్టడుగు స్థానంలో ఉంది.

88దేశాల్లో.. ఇండియానే చివరి స్థానం..:

88దేశాల్లో.. ఇండియానే చివరి స్థానం..:

ఓపెన్ సిగ్నల్ కంపెనీ అనాలిసిస్ ప్రకారం.. ఆరు ఖండాల్లో విస్తరించి ఉన్న 88దేశాల్లో కంటే ఇండియాలోనే 4జి స్పీడ్ అత్యంత 'స్లో'గా ఉందని తేలింది.

2జీ నుంచి 4జికి అత్యంత వేగంగా ఇండియా ఎదిగొచ్చిన క్రమంలో.. అన్ని సంస్థలు సర్వీసులను అప్‌గ్రేడ్ చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే స్పీడుకు సంబంధించి మాత్రం టెలికాం సంస్థలు వెనుకంజలోనే ఉన్నాయి.

మనకంటే పాకిస్టాన్ బెటర్..:

మనకంటే పాకిస్టాన్ బెటర్..:

ఇండియాలో యావరేజ్ 4జి స్పీడు 6ఎంబీపీఎస్‌గా ఉంది. అదే పాకిస్తాన్ లో యావరేజ్ స్పీడు మనకన్నా రెట్టింపు ఉంది. ఆ దేశంలో సగటున 14ఎంబీపీఎస్ స్పీడు అందుబాటులో ఉంది. ఇండియా తర్వాత తక్కువ 4జి స్పీడ్ సర్వీసెస్ కలిగిన దేశంగా అల్జీరియా ఉంది. ఈ దేశంలో సగటున 9ఎంబీపీఎస్ స్పీడు అందుబాటులో ఉంది.

సింగపూర్ అందరికంటే ముందు..:

సింగపూర్ అందరికంటే ముందు..:

ఓపెన్ సిగ్నల్ రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచంలో అందరికంటే సింగపూర్ వాసులు అత్యంత ఫాస్టెస్ట్ డౌన్ లోడింగ్ సర్వీసెస్ పొందుతున్నారని తేలింది. ఆ దేశంలో సగటున 44ఎంబీపీఎస్ 4జీ స్పీడు అందుబాటులో ఉన్నట్టు వెల్లడైంది. ఆ తర్వాత , నెదర్లాండ్ 42ఎంబీపీఎస్, నార్వే 41ఎంబీపీఎస్, దక్షిణ కొరియా 40ఎంబీపీఎస్ ఉన్నాయి.

ఇలా తేల్చారు..:

ఇలా తేల్చారు..:

దాదాపు 5వేల కోట్ల సమీకరణల తర్వాత ఈ 4జి స్పీడు లెక్కల్ని తేల్చింది ఓపెన్ సిగ్నల్ సంస్థ. ఆరు ఖండాల్లోని 38లక్షల స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్స్ 4జి స్పీడును అంచనా వేసి ఈ ఇంటర్నెట్ స్పీడ్ లెక్కల్ని సిద్దం చేసింది.

4జి 'స్లో'.. కారణమేంటి?:

4జి 'స్లో'.. కారణమేంటి?:

టెలికాం నెట్ వర్క్ ల సామర్థ్య లేమి వల్లే ఇండియాలో 4జి స్పీడ్ ఆశించిన స్థాయిలో లేదని ఓపెన్ సిగ్నల్ సంస్థ తెలిపింది. '3జి కంటే వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీస్ అందించడంలో 4జి నెట్ వర్క్ అంతగా సఫలం కాలేదు' అని సంస్థ పేర్కొంది.
అయితే ఆయా టెలికాం సంస్థలు ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలే దీనిపై పరోక్షంగా ప్రభావం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆశించిన స్థాయిలో లాభాలు లేక, పెట్టుబడులు కూడా తగ్గిపోవడంతో.. నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కంపెనీలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. దానివల్లే 4జి స్పీడు అంత వేగంగా ఉండటం లేదని చెబుతున్నారు.

English summary
India may be going digital, but high-speed internet on mobile phones still remains a challenge, even on 4G. Despite telecom companies announcing massive rollout of 4G services, the average network speed in India remains the slowest across countries having substantial telecom networks, lagging even Pakistan, Algeria, Kazakhstan and Tunisia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X