వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీట్ పరీక్షలో ‘బ్రా’ దుమారం: రంగంలోకి NCW, విచారణకు ఆదేశం, ఐదుగురి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

నీట్ పరీక్షకు హాజరైన కేరళ విద్యార్థికి చేదు అనుభవం ఎదురయిన సంగతి తెలిసిందే. దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్ పర్సన్‌ చేత స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఇదీ ముమ్మాటికీ న్యాయ విరుద్దం అని చెబుతుంది. ఘటనను కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. యువతుల పట్ల కొందరి ప్రవర్తన ఇదీ సిగ్గుచేటు అని అభిప్రాయపడింది.

కేరళ డీజీపీకి ఆదేశాలు..

కేరళ డీజీపీకి ఆదేశాలు..


ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని కేరళ డీజీపీని కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ ఆదేశించారు. ఘటనకు సంబంధించి బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్పష్టంచేశారు. మరోవైపు కేరళ పోలీసులు విద్యార్థినీల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు సమాచారం.

ఇన్నర్స్ విప్పించి

ఇన్నర్స్ విప్పించి


విద్యార్థిని చేత ఇన్నర్స్ విప్పి వేయించిన బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థుల నుంచి తమకు మూడు ఫిర్యాదులు వచ్చాయని కొల్లాం పోలీసులు తెలిపారు. అయితే తొలుత అందిన ఫిర్యాదును ఎన్టీఏ తోసిపుచ్చింది. సదరు ఫిర్యాదు తప్పు అని.. దురుద్దేశంతో కంప్లైంట్ చేశారని కొల్లంలో గల నీట్ పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్.. ఎన్టీఏకు తెలిపారు.

 బ్రా ముఖ్యమా..?

బ్రా ముఖ్యమా..?


మీకు మీ బ్రా ముఖ్యమా.. లేదంటే భవిష్యత్ ముఖ్యమా అని సిబ్బంది తమతో అన్నారని యువతి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు 90 శతం మంది విద్యార్థులు తమ ఇన్నర్స్ విప్పివేశారని తెలిసింది. వాటిని స్టోర్ రూమ్‌లో వేశారని రిపోర్ట్ చేసింది.

కేంద్రమంత్రికి లేఖ

కేంద్రమంత్రికి లేఖ


ఘటనకు సంబంధించి కేరళ విద్యాశాఖ మంత్రి బిందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు లేఖ రాశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటన తనను షాక్‌నకు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు. ఇదీ పరీక్షకు హాజరైన విద్యార్థుల పరువుకు సంబంధించిన అంశం అని తెలిపారు.

English summary
National Commission for Women has asked the NTA and the Kerala police to conduct a time-bound and independent probe into the allegations of inappropriate frisking of some girl students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X