వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్ చేసి వేశ్య అంటే...దిమ్మతిరిగే షాక్, ఏమైందంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అత్యాచారం చేసి ఆ తర్వాత బాధితురాలిని వేశ్య అని సంబోధించినందుకు ఢిల్లీ కోర్టు ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. అంతేకాదు బాధితురాలికి రూ. 5 లక్షల పరిహరం చెల్లించాలని ఆదేశించింది.

దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని రాంనగర్‌‌లో ముంతాజ్ అలీ అనే వ్యక్తి టైలరింగ్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2015 లో తనకు సమీపంలోని దుకాణం నిర్వహిస్తున్న మహిళపై ముంతాజ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు బాధితురాలిపై రెండు దఫాలు అత్యాచారం చేశాడు.

7 years for man who called rape survivor ‘prostitute’

అంతేకాదు బాధితురాలి కూతురిని అడ్డుపెట్టుకొని అత్యాచారం చేశాడు. కూతురును కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరించి ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.

ఈ కేసుపై విచారణ సాగుతున్న సమయంలోనే బాధితురాలిని వేశ్య అంటూ ముంతాజ్ పిలిచాడు. ఈ విషయమై కోర్టు సీరియస్ అయింది. బహిరంగ ప్రదేశంలో మహిళ పట్ల అమర్యాదగా దూషించినందుకు ముంతాజ్ అలీకి రూ. లక్ష జరిమానాను విధించింది.

దీనికి తోడుగా ఏడేళ్ళ పాటు కఠిన కారాగార శిక్షను విధించింది. బాధితురాలికి నిందితుడు రూ. 5లక్షల పరిహరం చెల్లించాల్సిందిగా తీర్పు ఇచ్చింది. ఈ విషయమై బాధితురాలి తరపు న్యాయవాది నిందితుడి గురించి పలు సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో నిందితుడికి శిక్షలు కఠినమైన శిక్షలను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

బహిరంగ ప్రదేశాల్లో మహిళలను అగౌరవంగా మాట్లాడడం ఫ్యాషన్‌గా మారిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. స్త్రీలను గౌరవించకుండా అవమానించినందుకు నిందితుడికి ఈ శిక్షను విధించినట్టుగా ఆయన ప్రకటించారు.

English summary
In a case where the accused called the rape survivor a “prostitute”, a court recently rejected the claim and sentenced him to seven years’ rigorous imprisonment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X