బెంగళూరులో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం, ముగ్గురి మృతి, ఆంధ్రా కాంట్రాక్టర్!

Posted By:
Subscribe to Oneindia Telugu
  Under Construction Building Collapsed In Bangalore, VIDEO

  బెంగళూరు నగరంలో గురువారం సాయంత్రం కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనంలో శిథిలాల్లో చిక్కుకుని ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్రిష్ణరాజా రెడ్డి అనే కాంట్రాక్టర్ బహుళ అంతస్తుల భవనం నిర్మాణం పనులు చేయిస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. స్థానిక శాసన సభ్యుడు, మాజీ మంత్రి అరవింద్ లింబావలి సంఘటనా స్థలానికి పరుగు తీశారు.

   బెంగళూరు నగరంలోని మరోసారి నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల కట్టడం కుప్పకూలిపోయింది. బెంగళూరు నగరంలోని సర్జాపుర రోడ్డులోని కసవనహళ్ళి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్తుల భవనం గురువారం సాయంత్రం కుప్పకూలిపోయింది.

  30 మంది కార్మికులు

  30 మంది కార్మికులు

  కసవనహళ్ళిలో నిర్మాణంలో ఉన్న కట్టడంలో దాదాపు 30 మంది కార్మికులు పని చేస్తున్నారు. గురువారం ఉదయం నుంచి కార్మికులు బహుళ అంతస్తుల కట్టడంలో పని చేస్తున్నారు. సాయంత్రం కార్మికులు పని చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కట్టడం కుప్పకూలిపోయింది.

   శిథిలాల్లో కార్మికులు

  శిథిలాల్లో కార్మికులు

  ఒక్కసారిగా నిర్మాణంలో ఉన్న కట్టడం కుప్పకూలిపోవడంతో శిథిలాల్లలో కార్మికులు చిక్కుకున్నారు. విషయం గుర్తించిన స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద ఆరు మంది కార్మికులను రక్షించి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

  20 మంది ఆచూకి

  20 మంది ఆచూకి

  కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం శిథిలాల్లో ఇంకా 20 మందికి పైగా కార్మికులు చిక్కుకున్నారని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. శిథిలాలు కింద చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి అగ్నిమాపక శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

  యజమాని, ఇంజనీరు నిర్లక్షం

  యజమాని, ఇంజనీరు నిర్లక్షం

  కట్టడం యజమాని, ఇంజనీరు నిర్లక్షం వలనే ఐదు అంతస్తుల కట్టడం కుప్పకూలిపోయిందని పోలీసులు అంటున్నారు. నాసిరకంగా కట్టడం నిర్మించడం వలనే కూలిపోయిందని, ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A multi storage building collapse in Bengaluru's Kasavanahalli. at least 25 labors struck under remnant. fire fighters began there rescue operation.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి