Software engineer: భార్య పుట్టింటిలో, వర్క్ ఫ్రమ్ హోమ్, 20 సెకన్లలో కాల్చి చంపేశాడు, సీసీటీవీల్లో !

పూణే/ముంబాయి/చెన్నై: ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న యువకుడు వివాహం చేసుకున్నాడు. కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇవ్వడంతో సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఇంటి నుంచి పని చేస్తున్నాడు. కొంతకాలం క్రితం సాఫ్ట్ వేర్ ఇంజనీరు పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో ఆఫీసు పని చేస్తున్న టెక్కీ వంట వండుకునే తీరిక, ఓపిక లేకపోవడంతో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసి తింటున్నాడు. ప్రతిరోజు టెక్కీకి మూడుపూటల ఫుడ్ డెలవరీ ఇవ్వడానికి డెలవరీ బాయ్స్ వెళ్లి వస్తున్నారు. టెక్కీకి ఆహారం ఇవ్వడానికి డెలవరీ బాయ్ వెళ్లాడు. ఉదయం ఇచ్చిన ఫుడ్ ప్యాకెట్ పార్శిల్ బయటే ఉండటంతో అతనికి అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లోని మొదటి అంతస్తులో టెక్కీ శవమై కనపించాడు. టెక్కీని రివాల్వర్ తో కాల్చి చంపేశారని గుర్తించిన డెలవరీ బాయ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. భార్య పుట్టింటిలో ఉన్న సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న టెక్కీ హత్యకు గురి కావడం కలకలం రేపింది. టెక్కీని హత్య చేసే సమయంలో అతని ఇంటిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు అయ్యింది. కేవలం 20 సెకన్లలో టెక్కీని కాల్చి చంపేశారని సీసీటీవీల్లో రికార్డు అయ్యింది. రెండు సంవత్సరాల క్రితం టెక్కీ అన్న కూడా హత్యకు గురైనాడు.

వర్క్ ఫ్రమ్ హోమ్

వర్క్ ఫ్రమ్ హోమ్

మహారాష్ట్రలోని పూణేలోని హాజీపూర్ ప్రాంతంలో సుమన్ శేఖర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న సుమన్ శేఖర్ అనే యువకుడు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇవ్వడంతో సాఫ్ట్ వేర్ ఇంజనీరు సుమన్ శేఖర్ గత ఐదు నెలల నుంచి ఇంటి నుంచి ఆఫీసు పని చేస్తున్నాడు.

 పుట్టింటికి వెళ్లిన భార్య

పుట్టింటికి వెళ్లిన భార్య

కొంతకాలం క్రితం సాఫ్ట్ వేర్ ఇంజనీరు సుమన్ శేఖర్ భార్య పుట్టింటికి వెళ్లింది. ఇంట్లో ఆఫీసు పని చేస్తున్న టెక్కీ సుమన్ శేఖర్ అతని భార్య పుట్టింటికి వెళ్లడంతో వంట వండుకునే తీరిక, ఓపిక లేకపోవడంతో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసి తింటున్నాడు. ప్రతిరోజు సాఫ్ట్ వేర్ ఇంజనీరు సుమన్ శేఖర్ కు మూడుపూటల ఫుడ్ డెలవరీ ఇవ్వడానికి డెలవరీ బాయ్స్ అతని ఇంటికి వెళ్లి వస్తున్నారు.

 డెలవరీబాయ్ కు అనుమానం

డెలవరీబాయ్ కు అనుమానం

టెక్కీ సుమన్ శేఖర్ కు ఆహారం ఇవ్వడానికి డెలవరీ బాయ్ అతని ఇంటికి వెళ్లాడు. ఉదయం ఇచ్చిన ఫుడ్ ప్యాకెట్ పార్శిల్ బయటే ఉండటం, సుమన్ శేఖర్ ఫుడ్ ప్యాకెట్ తీసుకోకపోవడంతో అతనికి అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లాడు. కింద అంతస్తులో ఎవ్వరూ లేకపోవడంతో డెలవరీ బాయ్ ఇంట్లోని మొదటి అంతస్తులో టెక్కీ సుమన్ శేఖర్ శవమై కనపించాడు.

 రివాల్వర్ తో కాల్చి చంపిన హంతకుడు

రివాల్వర్ తో కాల్చి చంపిన హంతకుడు

టెక్కీ సుమన్ ను రివాల్వర్ తో కాల్చి చంపేశారని గుర్తించిన ఫుడ్ డెలవరీ బాయ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పూణే సీనియర్ పోలీసు అధికారి సదర్ హాజీపూర్ రాఘవ్ దయాల్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. టెక్కీ సుమన్ శేఖర్ ఇంటిలో ఏర్పాటు చేసిన అన్ని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు.

 20 సెక్షన్లలో ఫినిష్

20 సెక్షన్లలో ఫినిష్

భార్య పుట్టింటిలో ఉన్న సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న టెక్కీ సుమన్ శేఖర్ హత్యకు గురి కావడం కలకలం రేపింది. టెక్కీ సుమన్ శేఖర్ ను హత్య చేసే సమయంలో అతని ఇంటిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు అయ్యింది. ఇంట్లోకి చోరబడిన గుర్తు తెలియని వ్యక్తి సుమన్ శేఖర్ కోసం అతని ఇంటిలోని అన్ని గదలులో వెతికాడు. చివరికి మొదటి అంతస్తులోకి వెళ్లిన దండుగుడు కేవలం 20 సెకన్లలో టెక్కీ సుమన్ శేఖర్ ను కాల్చి చంపేశాడని సీసీటీవీల్లో రికార్డు అయ్యిందని సీనియర్ పోలీసు అధికారి రాఘవ్ దయాల్ మీడియాకు చెప్పారు. ఇల్లు మొత్తం సీసీటీవీ కెమెరాలు ఉన్నా హంతకుడు మాత్రం ముఖం కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు.

Recommended Video

    ఓవైసీ vs బిపిన్ రావత్: పెహ్లూఖాన్‌ను చంపిన వారిని ఎవరు మారుస్తారు..?
     కిల్లర్ సినిమా స్కెచ్..... అసలు ఏం జరుగుతోంది ?

    కిల్లర్ సినిమా స్కెచ్..... అసలు ఏం జరుగుతోంది ?

    సుమన్ శేఖర్ ను హత్య చేసిన నిందితుడు ముఖానికి మాస్క్ వేసుకుని, తలకు టోపీ పెట్టుకున్నాడని, అతని ముఖం సీసీటీవీల్లో స్పష్టంగా కనపడటం లేదని పోలీసులు అంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం టెక్కీ సుమన్ శేఖర్ అన్న కూడా ఇలాగే దారుణ హత్యకు గురైనాడని పోలీసు అధికారులు అంటున్నారు. సుమన్ శేఖర్ భార్యను విచారణ చేస్తున్న పోలీసు అధికారులు కుటుంబండానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+