కేంద్రంపై సీఎంల పోరు బాట- మూడు రోజుల్లో ముగ్గురు- మోడీ సర్కార్‌పై విమర్శలు

సమాఖ్య విధానం కొనసాగుతున్న మన దేశంలో తొలిసారిగా కేంద్రం తీరుపై రాష్ట్రాలు ఒక్కొక్కటిగా గళం విప్పుతున్నాయి. కరోనా సాయం విషయంలో మొదలైన ఈ పోరు వ్యాక్సిన్లకు వచ్చి ఇప్పుడు ఏకంగా అధికార వర్గాల్ని టార్గెట్‌ చేసే వరకూ వెళ్లింది. దీంతో కేంద్రం తీరుపై మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు సీఎంలు లేఖలు రాయడం కలకలం రేపుతోంది. కేరళ సీఎం పినరయి విజయన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ వివిధ అంశాలపై కేంద్రంతో ముఖాముఖీ పోరుకు దిగడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

 మోడీ సర్కార్‌పై సీఎంల పోరు

మోడీ సర్కార్‌పై సీఎంల పోరు

కేంద్రంలో మోడీ సర్కార్ విధానాలపై ముఖ్యమంత్రులు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. గతంలో ఢిల్లీ సీఎం కేజ్రివాల్, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వంటి వారు మాత్రమే కేంద్రంతో ముఖాముఖీ పోరు సలపగా.. ఇప్పుడు వీరికి మరో ఇద్దరు సీఎంలు పినరయి విజయన్‌, హేమంత్ సోరెన్ కూడా జతకలిశారు. దీంతో ఏకంగా నలుగురు సీఎంలు కేంద్రంపై పోరాటం సాగిస్తున్నట్లయింది. అరవింద్‌ కేజ్రివాల్‌, మమత గతం నుంచే కేంద్రంపై పోరు సాగిస్తుండగా.. ఇప్పుడు కరోనా సాయం విషయంలో విజయన్‌, సోరెన్ కూడా గళం విప్పారు. రాష్ట్రాల్ని నిర్లక్ష్యం చేస్తూ కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ వీరు చేస్తున్నఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.

 మూడు రోజుల్లో ముగ్గురు సీఎంలు

మూడు రోజుల్లో ముగ్గురు సీఎంలు

మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు సీఎంలు పినరయి విజయన్‌, మమతా బెనర్జీ, హేమంత్‌ సోరెన్ రాష్టాలతో వ్యవహరించే విషయంల కేంద్రాన్ని టార్గెట్‌ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్టాలపై పెత్తనం అంశంలో ఈ ముగ్గురు సీఎంలు కేంద్రాన్ని టార్గెట్‌ చేస్తున్నారు.

దీంతో వీరిని ఎలా ఎదుర్కోవాలో తెలియక కేంద్రం మథనపడుతోంది. సమాఖ్య విధానంలో రాష్ట్రాలపై కేంద్రానికి అధికారాల విషయంలో ఆధిక్యం ఉన్నప్పటికీ ఇలా రోజువారీ వ్యవహారాల విషయంలో కేంద్రం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు సీఎంలకు అస్సలు గిట్టడం లేదు.

 తోటి సీఎంలను రెచ్చగొడుతూ లేఖలు

తోటి సీఎంలను రెచ్చగొడుతూ లేఖలు

ఈ ముగ్గురు ముఖ్యమంత్రుల్లో ఇద్దరు పినరయి విజయన్‌, మమతా బెనర్జీ అయితే ఏకంగా కేంద్రం తీరుపై తమ తోటి ముఖ్యమంత్రుల్ని సైతం రెచ్చగొడుతున్నారు. రాష్ట్రాలు మౌనంగా ఉంటే కేంద్రం ఇలాగే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని వారిని హెచ్చరిస్తున్నారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై ఐక్యంగా పోరాడదామని వారికి పిలుపునిస్తున్నారు. తాజాగా పినరయి విజయన్‌ 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖ కేంద్రం తీరును ఎండగట్టేలా ఉంది. దీంతో కేంద్రం కూడా ఇప్పుడు డిఫెన్స్‌లో పడుతోంది. ఇప్పటికిప్పుడు మిగతా సీఎంల నుంచి తక్షణ స్పందన లేకపోయినా భవిష్యత్తులో పరిస్ధితులు ఎలా మారతాయో చెప్పలేని పరిస్ధితి.

 కేంద్రంతో సీఎంల పోరుకు కారణాలివే

కేంద్రంతో సీఎంల పోరుకు కారణాలివే

పశ్చిమబెంగాల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. మిగతా ఇద్దరు సీఎంలు విజయన్‌, సోరెన్ వ్యాక్సిన్ విధానం విషయంలో కేంద్రం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రాలపై వ్యాక్సిన్‌ భారం మోపడం సరికాదని వీరు వాదిస్తున్నారు. తగినంత వ్యాక్సిన్ సరఫరా లేకపోవడంపైనా వీరు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అలాగే వ్యాక్సిన్ల తయారీదారులు కేంద్రానికో రేటు, రాష్ట్రాలకో రేటుకు అమ్మడాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ కొరత నెలకొన్న నేపథ్యంలో వీరి ఆరోపణలకు బలం పెరుగుతోంది.

అధికార, విపక్షాల మధ్య సీబీఐ వివక్ష

అధికార, విపక్షాల మధ్య సీబీఐ వివక్ష

కేంద్ర దర్యాప్తు సంస్ధ సీబీఐ కేంద్రంలోఅధికారంలో ఉన్న బీజేపీకి ఓ న్యాయం, విపక్ష నేతలకు ఓ న్యాయం అన్నట్లుగా వ్యవహరించడంపైనా బెంగాల్ సీఎం మమత మండిపడుతున్నారు. ముఖ్యంగా బెంగాల్లో నారద స్టింగ్ ఆపరేషన్‌ కేసులో బీజేపీ, టీఎంసీ నేతలకు మధ్య సీబీఐ వ్యత్యాసం చూపడం కూడా ఇందుకు కారణం. టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన నేతల్ని వదిలిపెట్టి కేవలం టీఎంసీ నేతల్ని మాత్రమే టార్గెట్ చేయడమేంటని మమత ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కేంద్రంతో సఖ్యతగా ఉంటున్న జగన్‌ వంటి నేతలపై సీబీఐ మెతకవైఖరి ప్రదర్శిస్తోందన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. కేంద్రం రాష్ట్రాల్ని నిర్లక్ష్యం చేస్తోందంటూ సోరెన్‌ చేసిన ఆరోపణల్ని జగన్‌ తప్పుబట్టిన తర్వాత ఈ చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+