Siddharth Shukla: ఆ రాత్రి అసలేం జరిగింది-సిద్దార్థ శుక్లా తీసుకున్న మెడిసిన్స్ ఏంటి-ఆ విషాద ట్వీట్ వైరల్
యువ నటుడు,బిగ్‌బాస్-13 విన్నర్ సిద్దార్థ శుక్లా హఠాన్మరణం బాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎంతో భవిష్యత్ ఉన్న నటుడు 40 ఏళ్లకే లోకాన్ని వీడటం చాలామందిని కలచివేసింది. సిద్దార్థ శుక్లా గుండెపోటుతో మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించినప్పటికీ... ఇంకా ఎక్కడో అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. శుక్లా రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఏవో మెడిసిన్స్ తీసుకున్నట్లు చెబుతున్నారు. నిద్రలోనే అతను శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. అసలు ఆ రాత్రి ఏం జరిగి ఉంటుందనేది ఇప్పుడు అందరి మదిని తొలుస్తోంది.

ఆ రాత్రి అసలేం జరిగింది..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... గురువారం(సెప్టెంబర్ 2) తెల్లవారుజామున 3.30గంటల సమయంలో సిద్దార్థ శుక్లా అస్వస్థతకు గురయ్యాడు. ఛాతిలో నొప్పి రావడంతో తల్లికి చెప్పాడు. ఆమె కొన్ని మంచి నీళ్లు ఇచ్చి తాగమని చెప్పింది. ఆ తర్వాత బెడ్‌పై అతన్ని పడుకోబెట్టింది. ఉదయం చాలాసేపటివరకూ సిద్దార్థ శుక్లా నిద్ర నుంచి మేల్కొనలేదు. తల్లి అతని గదిలోకి వెళ్లి నిద్ర లేపే ప్రయత్నం చేయగా... అతని నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా పోయింది. దీంతో వెంటనే తన కూతురికి ఫోన్ చేయగా... ఆమె డాక్టర్‌కు ఫోన్ చేసింది.

ఆ సమయానికి ఆస్పత్రికి...
గురువారం ఉదయం 9.40 గంటల సమయంలో సిద్దార్థ శుక్లాను అంబులెన్సులో కూపర్ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో శుక్లా సోదరి,బావ,కజిన్ ముగ్గురు అతని వెంట ఉన్నారు. 10.15గంటల సమయంలో వైద్యులు శుక్లా మృతదేహాన్ని పరిశీలించి అతను చనిపోయినట్లు ధ్రువీకరించారు. క్యాజువాలిటీ వార్డులో వైద్యులు మొత్తం మూడుసార్లు డెడ్ బాడీని పరిశీలించారు. శుక్లా శరీరంపై ఎక్కడా గాయాలు లేవని కూపర్ ఆస్పత్రి వైద్యులు డా.నిరంజన్ తెలిపారు.

ఇవాళ పోస్టుమార్టమ్ రిపోర్ట్...
గురువారం మధ్యాహ్నం 3.45గంటలకు సిద్దార్థ శుక్లా డెడ్ బాడీకి పోస్టుమార్టమ్ నిర్వహించారు.ఇద్దరు పోలీసుల సమక్షంలో పోస్టుమార్టమ్ ప్రక్రియను వీడియో షూట్ చేశారు. ఇది సున్నితమైన కేసు కావడం.. గతంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును దృష్టిలో ఉంచుకుని... ప్రతీ అంశాన్ని వైద్యులు ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తున్నారు.
శుక్రవారం సాయంత్రానికి పోస్టుమార్టమ్ నివేదిక అందే అవకాశం ఉంది. ఇప్పటికైతే సిద్దార్థ శుక్లా కుటుంబం ఎలాంటి అనుమానాలు లేవనెత్తలేదు. పోలీసులు కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు.అలాగే రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు సిద్దార్థ శుక్లా ఏ మందులు తీసుకున్నారో విచారించనున్నారు. ప్రస్తుతం ఓ పోలీస్ బృందం శుక్లా ఇంటి వద్దే ఉన్నట్లు తెలుస్తోంది.

సిద్దార్థ శుక్లా ప్రొఫైల్...
1980,డిసెంబర్ 12న జన్మించిన సిద్ధార్థ్ శుక్లా రచనా సంసద్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 'బాలికా వధు'(తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు), 'దిల్ సే దిల్ తక్' వంటి డైలీ సీరియల్స్‌తో ఫేమస్ అయిన సిద్దార్థ.. 'జలక్ దిక్లాజా 6', 'ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి' 'బిగ్ బాస్ 13' వంటి రియాలిటీ షోలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.
బిగ్ బాస్ 13 షో ద్వారా సిద్ధార్థ్ శుక్లా-షెహనాజ్ గిల్‌ల ప్రేమాయణం మొదలైంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇప్పటికే సోషల్ మీడియాలో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి సమయంలో సిద్దార్థ శుక్లా ఆకస్మిక మరణం ఫ్యాన్స్‌ను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. సిద్దార్థ్ ఇక లేడనే వార్తతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు అతని మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

షెహనాజ్‌తో ప్రేమాయణం...
బిగ్‌బాస్ 13 సీజన్ పూర్తయి రెండేళ్లు కావస్తున్నా శుక్లా షెహనాజ్ జంటకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. 'సిద్నాజ్' పేరిట ఇన్‌స్టాగ్రామ్‌లో వీరికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ వీరి లవ్‌ట్రాక్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. బిగ్‌బాస్ సీజన్ పూర్తయిన తర్వాత కూడా వీరి బంధం కొనసాగింది. షెహనాజ్ సిద్దార్థ్ శుక్లా జంటగా పలు మ్యూజిక్ ఆల్భమ్స్‌లోనూ నటించారు.
కొద్ది రోజుల కిందటే సిద్ధార్ద-షెహనాజ్ జంటగా బిగ్‌బాస్ ఓటీటీకి విచ్చేసి సందడి చేశారు. చివరగా దివానే-3 షోలో పాల్గొని సందడి చేసింది ఈ జంట. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Recommended Video

ఆ ట్వీట్ వైరల్...
గతంలో ఓ సందర్భంలో సిద్దార్థ శుక్లా చేసిన ట్వీట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 'జీవితంలో మరణం అనేది అతి పెద్ద నష్టమేమీ కాదు. అన్నింటినీ మించిన నష్టమేమిటంటే... మనం బతికుండగా మనలో మనం మరణించడమే.' అని శుక్లా ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
శుక్లా చేసిన ట్వీట్ గురించి ఇంత సీరియస్‌గా ఆలోచించే సందర్భం వస్తుందని ఎవరూ ఊహించలేదు.సిద్దార్థ శుక్లా అంత్యక్రియలు శుక్రవారం జరగనున్నాయి. బాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు అంతిమయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు టీవీ నటులు,సినీ ప్రముఖులు ముంబైలోని సిద్దార్థ నివాసానికి చేరుకున్నారు.
సిద్దార్థ శుక్లాతో కలిసి దిల్ సే దిల్ తక్‌లో నటించిన రషమి దేశాయ్ అతని మృతిపై భావోద్వేగంతో స్పందించారు.'కొన్నిసార్లు జీవితం సంక్లిష్టంగా మారుతుంది. ఈరోజు అనిపిస్తోంది... మనందరి కంటే పెద్దది ఏదో ఉందని. పదాలతో దాన్ని చెప్పలేం.ఇది టైప్ చేస్తున్నప్పుడు నా గుండె ముక్కలవుతోంది. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.ఓం శాంతి.' అని దేశాయ్ ట్వీట్ చేశారు.
-
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
ప్రశాంత్ వర్మ మ్యాజిక్.. అక్షయ్ ఖన్నా రోల్ మామూలుగా లేదుగా! -
ఓటీటీలో జనాలు ఎగబడి చూస్తున్న సినిమా ఇదే.. మీరు చూశారా? -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు!












Click it and Unblock the Notifications