పాక్‌కు షాక్: జనవరి 18,19 తేదిల్లో అగ్ని- 5 టెస్ట్‌కు ఇండియా రెఢీ

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇండియా అమ్ములపొదిలో మరో కీలక అస్త్రం చేరనుంది. 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించే సామర్థ్యం ఉన్న క్షిపణిని పరీక్షించేందుకు రంగం సిద్దం చేసింది. అన్ని అనకూలిస్తే జనవరి 18,19 తేదిల్లో ఈ క్షిపణిని పరీక్షించనున్నారు.

అణు రంగంలో ఇండియా ఇతర దేశాలకు ధీటుగా తన శక్తిని నిరూపించుకొనే ప్రయత్నాలు చేస్తోంది. పొరుగుదేశాల కంటే శక్తి వంతంగా తయారయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

అగ్ని 5 పేరుతో 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడ చేధించే శక్తివంతమైన క్షిపణిని ఇండియా పరీక్షించనుంది.ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. అగ్ని పరీక్ష నిర్వహించనున్నారని తేలడంతో పాక్ గుండెల్లో గుబులు రేగుతోంది.

5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యం చేధించే అగ్ని

5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యం చేధించే అగ్ని


భారత్ కొత్త అగ్ని 5 పేరుతో అత్యాధునికి క్షిపణిని పరీక్షించనుంది. 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించనుంది. అగ్ని సిరీస్ లో భాగంగా గతంలో కంటే అత్యాధునికింగా ఈ క్షిపణిని రూపొందించారు.భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది.

జనవరి 18,19 తేదిల్లో పరీక్షలు

జనవరి 18,19 తేదిల్లో పరీక్షలు

జనవరి 18, 19 తేదీల్లో ఒక రోజున దీనిని పరీక్షించేందుకు వ్యూహాత్మక దళాల కమాండ్ సన్నాహాలు చేస్తోంది. పరీక్షకు అవసరమైన అన్నింటిని దాదాపు సిద్ధం చేశారు. పరీక్షకు అవసరమైన అన్నింటిని దాదాపు సిద్ధం చేశారు.భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుంటోంది. శత్రుదుర్బేధ్యంగా మార్చుకుంటోంది.

17 మీటర్ల పొడవు

17 మీటర్ల పొడవు

17 మీటర్ల పొడవు ఉండే అగ్ని-5 క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అవలీలగా చేధించనుంది. 1.5 టన్నుల వార్‌హెడ్‌లను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఇది ఏక కాలంలో పలు లక్ష్యాలపై దాడి చేయగలదు.

శత్రు దేశాల రాడార్లకు దొరకదు

శత్రు దేశాల రాడార్లకు దొరకదు


శత్రుదేశ రాడార్లకు చిక్కకుండా పని కానిచ్చేయగలదు. అగ్ని-5కు ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉండడంతో పరీక్షల నిమిత్తం ఇండోనేషియా, ఆస్ట్రేలియాలను అప్రమత్తం చేయనున్నట్టు సమాచారం. పాక్‌ మొత్తం ఈ క్షిపణి పరిధిలోకి వస్తుండడంతో దాని గుండెల్లో అప్పుడే గుబులు మొదలైంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hectic preparations have begun at Abdul Kalam Island defence test facility off Odisha coast for the first user trial of country’s most potent longest range surface-to-surface nuclear-capable ballistic missile Agni-V. The trial would be carried out by the Strategic Forces Command (SFC) of Indian Army.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి