గడ్డ కట్టుకుపోతున్న అమెరికా: ఆ నగరాలకు Air India ఫ్లైట్లు బంద్..!!
అమెరికా గడ్డకట్టుకుపోతోంది. అతి తీవ్ర శీతాకాల తుఫాన్ ఆ దేశ తీర్పు తీరాన్ని తాకనుంది. ఆ దేశ వాణిజ్య రాజధాని న్యూయార్క్ సహా అనేక నగరాల్లో పగటి ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోతోంది. విపరీతంగా మంచు కురుస్తోంది. రష్యాను నిలువునా వణికించిన మంచు తుఫాన్.. ఇప్పుడు అమెరికాకు తాకబోతోంది. చలిగాలుల తీవ్రత మున్ముందు మరింత అధికంగా ఉంటుందని ఆ దేశ జాతీయ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు సైతం జారీ చేసింది.
అమెరికా జనాభాలో మూడింట రెండు వంతుల మంది భారీ శీతాకాల తుఫాను మరియు తీవ్రమైన చలిని ఎదుర్కొంటున్నారు. ఈ తుఫాను మంచు టెక్సాస్ నుండి న్యూ ఇంగ్లాండ్ వరకు 2,500 కిలోమీటర్లకు పైగా విస్తరించింది. ఈ వారాంతంలో తూర్పు వైపు కదులుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసినట్లు సీఎన్ఎన్ తెలిపింది. తుఫాను ప్రభావంతో విద్యుత్ లైన్ల దెబ్బతీనే ప్రమాదం ఉంది. లక్షలాది మంది ప్రజలు రోజుల తరబడి చీకట్లో మగ్గే అవకాశం ఉంది.

తుఫాను నేపథ్యంలో వేలాది విమానాలు ఇప్పటికే రద్దయ్యాయి. ప్రభావిత ప్రాంతాలలో రోడ్డు ప్రయాణం అత్యంత కష్టంగా లేదా అసాధ్యంగా మారుతుందని, మంచు పేరుకుపోతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నాటికి కనీసం 15 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మిస్సౌరీ, టెక్సాస్, అర్కాన్సాస్, లూసియానా, మిసిసిపీ, టేనస్సీ, అలబామా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా, న్యూయార్క్, కెంటకీ, మేరీల్యాండ్, న్యూజెర్సీ, కాన్సాస్ వంటివి ఇందులో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. పలు విమాన సర్వీసులు రద్దయినట్లు వెల్లడించింది. తన అధికారిక ఎక్స్ లో దీన్ని పోస్ట్ చేసింది. ఈ నెల 25, 26 తేదీల్లో న్యూయార్క్, నెవార్క్ నుండి కనెక్ట్ అయ్యే తమ అన్ని విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. అమెరికా తూర్పు తీరంలోని న్యూయార్క్, న్యూజెర్సీ, సమీప ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుండి సోమవారం వరకు భారీ మంచుతో కూడిన తీవ్ర శీతాకాల తుఫాను వస్తుందని అంచనా వేసింది.
#TravelAdvisory
— Air India (@airindia) January 24, 2026
A severe winter storm with heavy snow is forecast for New York, New Jersey and adjoining areas in the US East Coast from early Sunday morning to Monday, which will have a significant impact on flight operations.
In view of the safety, well-being and convenience…
ఇది విమానాల రాకపోకలు, ఎయిర్ పోర్టులు, ఇతర కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, ప్రయాణికులు, సిబ్బంది భద్రత, శ్రేయస్సు, వారి సౌలభ్యం కోసం ఈ నెల 25, 26 తేదీల్లో న్యూయార్క్, నెవార్క్ల నుండి వచ్చే, వెళ్ళే అన్ని విమానాలను రద్దు చేశామని ఎయిరిండియా యాజమాన్యం తెలిపింది.
ఈ తేదీల్లో బుక్ చేసుకున్న ప్రయాణికులకకు అన్ని విధాలా సహాయ సహకారాన్ని అందించడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని పేర్కొంది. మరింత సమాచారం కోసం రౌండ్ ద క్లాక్ పని చేసే కాల్ సెంటర్ +91 1169329333, +91 1169329999 నంబర్లను సంప్రదించవచ్చని లేదా తమ అధికారిక వెబ్సైట్ http://airindia.com ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలని ఎయిర్ ఇండియా సూచించింది.
-
భారీ వర్షాలు, పిడుగులు, ఈదురు గాలులు - బీ అలర్ట్.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications