అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసు: దోషులకు జీవితఖైదు.. శిక్ష ఖరారు చేసిన ఎన్ఐఏ న్యాయస్థానం

అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసులో దోషులు దేవేంద్ర గుప్తా, భవేశ్ పటేల్ కు జీవితఖైదు శిక్షను ఖరారు చేస్తూ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది.

ఢిల్లీ: అజ్మీర్ దర్గా పేలుళ్ల కేసు దోషులకు ఎన్ఐఏ కోర్టు జీవితఖైదు విధించింది. 2007 అక్టోబర్ 11న రంజాన్ మాసంలో దర్గా వద్ద పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో దేవేంద్ర గుప్తా, భవేశ్ పటేల్ కు శిక్షను ఖరారు చేస్తూ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు బుధవారం తీర్పును వెలువరించింది.

దోషులు భవేశ్ పటేల్, దేవేంద్ర గుప్తా.. ఇద్దరూ ఆరెస్సెస్ మాజీ ప్రచారక్ లు. ఓ ఉగ్రవాద కేసులో ఆరెస్సెస్ అనుబంధ వ్యక్తలును దోషులుగా తేల్చడం ఇదే మొదటిసారి. ఇదే కేసులో మూడో దోషిగా ఉన్న ఆరెస్సెస్ ప్రచారకర్త సునీల్ జోషి 2007 డిసెంబర్ లో హత్యకు గురయ్యాడు.

Ajmer blast case: Two including a former RSS worker get life imprisonment

అజ్మీర్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు మొత్తం ముగ్గురిని దోషులుగా తేల్చింది. మరో ఏడు మందిని నిర్దోషులుగా ప్రకటించింది. స్వామి అసిమానంద్ కూడా ఈ కేసులో నిర్దోషిగా తేలారు.

2007 అక్టోబర్ 11న రంజాన్ మాసంలో సూఫీ ఖ్వాజా మొయినుద్దీన్ దర్గాలో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 17 మంది గాయపడ్డారు. పేలుడు జరిగినప్పుడు దర్గాలో సుమారు అయిదే వేల మంది వరకు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+