వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్డీఏ నుంచి మరో భాగస్వామి ఔట్? బీజేపీతో పొత్తుపై పునరాలోచన

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రంలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కొత్తగా మరో సమస్య ఎదురైంది. ఎన్డీఏ కూటమి నుంచి మరో భాగస్వామ్య పార్టీ వైదొలగడానికి సిద్ధంగా ఉంది. బీజేపీ నాయకత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే.. కూటమి నుంచి బయటికి వెళ్లడం ఖాయమని అప్నాదళ్ ప్రకటించింది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన రాజకీయ పార్టీ అది. 2014 ఎన్నికల్లో రెండు లోక్ సభ స్థానాలను గెలుచుకుంది. మీర్జాపూర్ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అప్నా దళ్ లోక్ సభ సభ్యురాలు అనుప్రియా పటేల్.. నరేంద్రమోడీ మంత్రివర్గంలో సభ్యురాలు కూడా. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రిగా ఉన్నారామె.

ఎన్డీఏలో భాగస్వామ్య పక్షమైనప్పటికీ, బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర శాఖ నాయకుల నుంచి తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నామని అనుప్రియా పటేల్ తెలిపారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను బీజేపీ అధిష్ఠానం ముందు ఉంచామని చెప్పారు. వాటిని పరిష్కరించాలని కోరామని అన్నారు. దీనిపై ఇప్పటిదాకా తమకు బీజేపీ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని యోచిస్తున్నట్లు అనుప్రియా పటేల్ చెప్పారు. బీజేపీ నుంచి తుది సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని వివరించారు. ఈ నెల 20వ తేదీ వరకు గడువు ఇచ్చామని, అయినప్పటికీ.. బీజేపీ అగ్ర నాయకత్వం నుంచి ఎలాంటి బదులు రాలేదని అన్నారు. దీనితో బీజేపీతో కుదుర్చుకున్న పొత్తు ఒప్పందాన్ని పున: సమీక్షించుకోవాలని నిర్ణయించామని చెప్పారు.

Apna Dal BJP Ally In Uttar Pradesh, Hints At Exit From NDA

ప్రస్తుతం తాము ఎన్డీఏలోనే కొనసాగుతున్నామని, ఆ పార్టీ భాగస్వామ్యపక్షంగానే ఉన్నామని అప్నా దళ్ అధ్యక్షుడు, అనుప్రియా పటేల్ భర్త ఆశీష్ పటేల్ తెలిపారు. ఈ భాగస్వామ్యం ఎన్నిరోజులు ఉంటుందనేది చెప్పలేమని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని చెప్పారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో అప్నా దళ్ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా.. బీజేపీ కేటాయించిన రెండు స్థానాల్లో పోటీ చేసి, విజయం సాధించింది. మీర్జాపూర్, ప్రతాప్ గఢ్ లోక్ సభ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అనుప్రియా పటేల్, కువర్ హరివంశ్ సింగ్ గెలుపొందారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. అనుప్రియా పటేల్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే

ఎన్డీఏ నుంచి బయటికి వస్తే అప్నాదళ్ పార్టీకి కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ లో బలమైన ఎస్పీ, బీఎస్పీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఏఏ స్థానాల్లో పోటీ చేయాలనేది కూడా ఖరారైంది. ఈ నేపథ్యంలో అప్పాదళ్ కాంగ్రెస్ తో కలిసి వెళ్లడం మినహా మరో మార్గం లేదు. లేదా.. సొంతంగా పోటీ చేయాల్సి ఉంటుంది.

English summary
Apnal Dal, BJP’s ally in Uttar Pradesh, has threatened to quit the National Democratic Alliance. Apna Dal’s Anupriya Patel, minister of state at the Centre, hinted at the exit on Thursday, saying the BJP did not seem interested in resolving its issues. “We had a few issues with the BJP, which we put forward to their central leadership. We have given them time till 20 February to resolve these issues but they have not. It shows the BJP is not interested in the issues brought up by its allies. So, Apna Dal is now independent to make its own decisions,” Patel told reporters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X