Viral Video: వానొచ్చినా.. వరదొచ్చినా.. తగ్గేదే లే.. ప్రజల కోసం ఆశ వర్కర్ల సాహసం..
కొందరు తమ పనిని దైవంగా భావించి పని చేస్తుంటారు. ముఖ్యంగా ఆరోగ్య శాఖలో ఉన్నవారు కచ్చితంగా నిబద్ధతతో పని చేయాలి. ఇలా ముగ్గురు ఆశ కార్యకర్తలు తమ విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేస్తున్నారు. వారు కొండల్లో, వరదల్లో నడుచుకుంటూ ఏజేన్సీ ప్రజలకు సర్వీస్ చేస్తున్నారు. వారు ధైర్యంగా కొండాలు, వాగులు దాటుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral video: #ASHA workers in Maharashtra's #Kolhapur find way to remote hamlet despite gushing waters pic.twitter.com/zfAyF8MWQO
— TOI Nashik (@TOINashikNews) July 13, 2022
కొండలు దాటుతూ
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, ఆరోగ్య కార్యకర్తలు మారుమూల ప్రాంతాలకు వెళ్లే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కొల్హాపూర్ జిల్లాలోని కొండ అజరా తహసీల్‌లో అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ (ఆశా) వర్కర్లు వర్షాలు, నీటి ప్రవాహం ఉన్నప్పటికీ మారుమూల కుగ్రామానికి వెళ్లడాన్ని చూడవచ్చు. ఆశా వర్కర్లు 'హర్ ఘర్ దస్తక్' కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు టీకాలు వేసేందుకు వెళ్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల ప్రయత్నాన్ని ప్రశంసించారు.

కాగా, జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొల్లాపూర్‌లోని రాజారాం వాగు వద్ద పంచగంగ నది మట్టం 35.2 అడుగులకు చేరుకుంది.ఈ వాగు వద్ద హెచ్చరిక స్థాయి 39 అడుగులు కాగా, ప్రమాద స్థాయి 43 అడుగులుగా ఉంది. కొల్హాపూర్‌లోని నాలుగు రాష్ట్ర రహదారులు, ఏడు జిల్లా ప్రధాన రహదారులు కొన్ని ప్రాంతాలలో నీరు చేరడంతో వాహనాల రాకపోకలను నిలిపి వేశారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications