అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నీతి ఆయోగ్ రిపోర్ట్: భారీగా ఎగబాకిన అసిఫాబాద్, టాప్-5లో కడప, విజయనగరం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లా ఆసిఫాబాద్‌ జిల్లా అద్భుతమైన పురోగతి సాధిస్తోందని నీతి ఆయోగ్‌ తాజా నివేదిక స్పష్టం చేసింది. దేశంలో వెనుకబాటు నుంచి పురోగమి పథంలో సాగుతున్న జిల్లాల జాబితాను తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసింది.

ఈ జాబితాలో గతంలో వందో స్థానంలో ఉన్న ఆసిఫాబాద్‌ జిల్లా అద్భుతమైన ప్రగతితో 15వ స్థానానికి ఎగబాకడం విశేషం. విద్య, వైద్యం, వ్యవసాయం, సమ్మిళిత ఆర్థిక వృద్ది, ‌ మౌలిక సదుపాయాల ఆధారంగా జిల్లాలకు నీతి ఆయోగ్‌ ఈ ర్యాంకులు ప్రకటించింది.

asifabad top 15 in centre aspirational districts scheme

దేశవ్యాప్తంగా వెనుకబడిన 115 జిల్లాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఆశావహ జిల్లాల అభివృద్ధి పథకం (ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆఫ్‌ ఆస్పిరేషనల్‌ డిస్ట్రిక్ట్స్‌ స్కీమ్‌) కింద అభివృద్ధి చేస్తున్నారు.

తెలంగాణ నుంచి భూపాలపల్లి, ఆసిఫాబాద్‌, ఖమ్మం తదితర వెనుకబడిన జిల్లాలు ఈ పథకంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి విజయనగరం, విశాఖపట్నం, కడప తదితర జిల్లాలు ఉన్నాయి.

Recommended Video

ఆసక్తికరం గా మారనున్న 2019 ఎన్నికలు

టాప్-5లోకి విజయనగరం, కడప

మంచి పురోగతిని సాధించిన తొలి 5 జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విజయనగరం(4), వైయస్సార్ కడప(5) జిల్లాలు చోటు దక్కించుకున్నాయి. తొలి మూడు స్థానల్లో దామోడ్(గుజరాత్), వెస్ట్ సిక్కిం(సిక్కిం), రామనాథపురం(తమిళనాడు) జిల్లాలు ఉన్నాయి.

English summary
Asifabad District of Telangana ranked 100th in Baseline ranking released in March this year, has made significant improvement & now ranks 15th in Delta ranking.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X