ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 2026 ఏప్రిల్ 9వ తేదీన మూడు రాష్ట్రాలకు పోలింగ్ జరగుతోంది. అస్సాం, కేరళం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. గత కొన్ని రోజులుగా అక్కడి అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఇక ఫైనల్‌గా ఆ రాష్ట్ర ప్రజల చేతిలో ఓటు అస్త్రం ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భద్రత మరింత కట్టుదిట్టం చేసింది.
అస్సాం అసెంబ్లీకి మొత్తం 126 స్థానాలుండగా అన్ని స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది.ఇక అక్కడ ప్రధాన పోటీ ఎన్డీయే కాంగ్రెస్ కూటమిల మధ్యే ఉండనుంది. ఇక కేరళంలో ఎల్‌డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్‌గా పోటీ జరుగుతుంది. పినరయి విజయన్ గెలిచి వరుసగా మూడో సారి ముఖ్యమంత్రి అయ్యేందుకు వ్యూహాలు రచించగా..ఎలాగైనా సరే ఈసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రయత్నిస్తోంది. కేరళం రాష్ట్ర అసెంబ్లీకి మొత్తం 140 స్థానాలున్నాయి. పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరుగుతుంది. వీటితో పాటు కొన్ని చోట్ల ఉపఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మూడు రాష్ట్రాల అసెంబ్లీకి సంబంధించి మినిట్-టు-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం
Apr 09, 2026, 6:07 pm IST
అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్.. ఎక్కడ ఎంత శాతం ఓటింగ్ నమోదైంది?
ఓటింగ్ శాతం: అస్సాం, కేరళ, పుదుచ్చేరిలోని 296 స్థానాల్లో ముగిసిన పోలింగ్.. ఎక్కడ ఎంత శాతం ఓట్లు నమోదయ్యాయో తెలుసుకోండి.
Apr 09, 2026, 5:55 pm IST
అసెంబ్లీ ఎన్నికలు 2026 లైవ్: సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం
అసోం - 84.42%కేరళ - 75.01%పుదుచ్చేరి - 86.92%
State Assembly Elections | Approximate voter turnout as of 5 pm
అసోం అసెంబ్లీ ఎన్నికలు 2026 LIVE: ముగిసిన పోలింగ్.. ఈవీఎంలు, వీవీప్యాట్లు సీల్
అసోం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎన్నికల అధికారులు ఈవీఎంలు, వీవీప్యాట్లను సీల్ చేశారు. కామరూప్ జిల్లాలోని పోలింగ్ కేంద్రం నుంచి వచ్చిన దృశ్యాలు ఇక్కడ చూడవచ్చు.
#WATCH | Assam | Polling officials seal EVM and VVPAT on the conclusion of voting in Assam Assembly elections; Visuals from Kamrup.
A presiding officer says, "The voting concluded peacefully...I thank the Election Commission of India for conducting the elections peacefully" pic.twitter.com/qLjlE45IXi
గోవా పోండా ఉప ఎన్నిక రద్దు: అసలు కారణం ఏంటి? ఈ నిర్ణయం ముందే తీసుకుంటే బాగుండేదని సీఎం అభిప్రాయపడ్డారు.
Apr 09, 2026, 5:24 pm IST
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లైవ్: 'కాంగ్రెస్ ఎక్కడుంది? పవన్ ఖేరా ఎవరు?'.. సీఎం హిమంత బిశ్వ శర్మ ఘాటు వ్యాఖ్యలు
ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన అస్సాం ముఖ్యమంత్రి, జలుక్బారి బీజేపీ అభ్యర్థి హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. "అసలు కాంగ్రెస్ ఎక్కడుంది? పవన్ ఖేరా ఎవరు? ఆయనొక పరారీలో ఉన్న వ్యక్తి. ఆయన అడిగే ప్రశ్నలకు నేను ఎందుకు సమాధానం చెప్పాలి?" అంటూ ఎద్దేవా చేశారు.
Apr 09, 2026, 5:19 pm IST
అసెంబ్లీ ఎన్నికలు 2026 లైవ్: నేను ఓటు వేయడం ఎప్పుడూ మిస్ అవ్వను - సింగర్ పాపోన్
గువహటిలోని ఒక పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత సింగర్ పాపోన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను ఎన్నికల్లో ఓటు వేయడం ఎప్పుడూ మర్చిపోను. కానీ ప్రయాణ ఖర్చులు (టికెట్ ధరలు) భారీగా పెరగడంతో ఇప్పుడు అది కష్టంగా మారుతోంది. నేను వృత్తిరీత్యా చాలా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఓటు వేయడానికి కుటుంబం మొత్తాన్ని వెంట తీసుకురావడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. టికెట్ ధరల భారం వల్ల చాలా మంది ఓటింగ్‌కు దూరమవుతున్నారు. ఓటింగ్ సమయంలో పాత మిత్రులను కలవడం సంతోషంగా ఉంటుంది. భారత్‌లో బయోమెట్రిక్ లేదా ఫింగర్‌ప్రింట్ స్కానింగ్ వంటి రిమోట్ ఓటింగ్ విధానం అందుబాటులోకి వస్తే బాగుంటుంది. దీనివల్ల ఓటు వేయలేకపోతున్న వారికి ఎంతో మేలు జరుగుతుంది" అని పాపోన్ పేర్కొన్నారు.
VIDEO | Assam Election: Singer Papon, after casting his vote at a polling booth in Guwahati, said, “I don’t miss voting in elections, but it has become difficult now because ticket prices have become so high. I have to do a lot of travelling. It’s not possible to bring the family… pic.twitter.com/W98Ea6D0K6
బైపోల్ లైవ్: పోండా ఉప ఎన్నిక రద్దు.. సీఎం సావంత్ షాకింగ్ కామెంట్స్
పోండా ఉప ఎన్నిక రద్దుపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పందిస్తూ.. "మా ఎన్నిక రద్దయింది. ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఇలా జరగడం మాకు కూడా షాకింగ్ న్యూస్. ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని ముందే తీసుకుని ఉంటే బాగుండేది" అని వ్యాఖ్యానించారు.
#WATCH | Panaji | On Ponda by-election cancellation, Goa CM Pramod Sawant says, "Our election has been cancelled. It was a setback and shocking news for us also after the completion of the whole process. It would have been better if the Election Commission had taken a decision… pic.twitter.com/1YzvynAHPY
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు 2026 లైవ్: పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమిదే విజయం - ఏ. నమశ్శివాయం ధీమా
పుదుచ్చేరి హోం మంత్రి, మన్నాడిపేట నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఏ. నమశ్శివాయం కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటనలు పుదుచ్చేరి అంతటా మార్పు గాలిని తీసుకొచ్చాయి. ఓటర్లు ఎంతో ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు, ఇది మా పార్టీలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం, ఇందులో ఎలాంటి సందేహం లేదు" అని ఆయన పేర్కొన్నారు.
Puducherry | 2026 Puducherry Legislative Assembly elections | Home Minister of Puducherry and BJP candidate from the Mannadipet Assembly constituency, A. Namassivayam says, "The visits of Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, and BJP National President J.P.… https://t.co/6RBSXo30SSpic.twitter.com/RKM2Iv0sWi
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు 2026 LIVE: ఓటు వేసిన హోం మంత్రి నమశ్శివాయం
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి, మన్నాడిపేట నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎ. నమశ్శివాయం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరుక్కనూర్ లోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన ఓటు వేశారు.
#WATCH | Home Minister of Puducherry and BJP candidate from the Mannadipet Assembly constituency, A Namassivayam, casts his vote for the Puducherry Legislative Assembly elections 2026, at a polling station in Thirukkanur pic.twitter.com/ptiTmqhaGY
ఎవరీ షామా మొహమ్మద్? రాహుల్ గాంధీకి వీర విధేయురాలిగా గుర్తింపు..
కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2026: 'బీజేపీ ఓట్లను కొంటోంది' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన షామా మొహమ్మద్ ఎవరు? రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలిగా పేరున్న ఆమె గురించి ఆసక్తికర విషయాలు.
Apr 09, 2026, 2:18 pm IST
అసోం ఎన్నికలు 2026 లైవ్: బీజేపీకి 75-80కి పైగా సీట్లు పక్కా.. మంత్రి అశోక్ సింఘాల్ ధీమా
అసోం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో రాష్ట్ర మంత్రి అశోక్ సింఘాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "మా బూత్‌లో ఓటు వేసిన మొదటి వ్యక్తిని నేనే. ఈరోజు అసోం ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతున్నారు. ప్రజల మద్దతు చూస్తుంటే ఈ ఎన్నికలు రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తాయనిపిస్తోంది. ప్రజలంతా సురక్షితమైన అసోంను కోరుకుంటున్నారు. మాకు భారీగా ఓట్లు పోలవుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఒంటరిగానే 75-80కి పైగా సీట్లు వస్తాయి. ఇక మిత్రపక్షాలతో కలిపి 100 మార్కును సులువుగా దాటుతాం" అని ధీమా వ్యక్తం చేశారు.
#WATCH | Dhekiajuli, Sonitpur: Assam Minister Ashok Singhal casts his vote for the Assam Assembly Elections.
He says, "I was the first one to cast my vote at my booth. The people of Assam are going to give a very important verdict today. This will be historic. The way people… pic.twitter.com/3z8x4B5kir
అసెంబ్లీ ఎన్నికలు 2026 LIVE: మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు
అస్సాం - 59.63%కేరళ - 49.70%పుదుచ్చేరి - 56.83%
Apr 09, 2026, 1:30 pm IST
అసెంబ్లీ ఎన్నికలు 2026 ఓటింగ్ లైవ్: మార్పు కావాలంటే ఓటు వేయండి - మీరా బోర్ఠాకూర్ గోస్వామి
ప్రజల్లో మార్పు కోరిక బలంగా కనిపిస్తోందని, మార్పును ఆకాంక్షించే వారంతా బయటకు వచ్చి తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని కాంగ్రెస్ అభ్యర్థి మీరా బోర్ఠాకూర్ గోస్వామి విజ్ఞప్తి చేశారు. ప్రజల నుంచి లభిస్తున్న మద్దతు చూస్తుంటే.. దిస్పూర్‌లో తాము భారీ మెజారిటీతో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
#WATCH | Assam Elections 2026 | Guwahati | Congress candidate from Dispur assembly constituency, Mira Borthakur Goswami says, "I felt a will among people for a change... I appeal to everyone to come out and vote for the candidate of their choice if they wish for change... I hope… pic.twitter.com/dYAprMfVPH
అసెంబ్లీ ఎన్నికలు 2026 ఓటింగ్ లైవ్: 'ఇది 100% క్లీన్ స్వీప్'.. సీఎం హిమంత బిస్వా శర్మ భార్య రినికి భుయాన్ శర్మ వ్యాఖ్యలు
"ఈ ఎన్నికల్లో మేం 100 శాతం విజయం సాధిస్తాం.. ఇది క్లీన్ స్వీప్" అని అస్సాం ముఖ్యమంత్రి, జలుక్‌బారి అభ్యర్థి హిమంత బిస్వా శర్మ భార్య రినికి భుయాన్ శర్మ మీడియాకు తెలిపారు.
#WATCH | "It is a 100% sweep", says Assam CM and candidate from Jalukbari, Himanta Biswa Sarma's wife Riniki Bhuyan Sharma pic.twitter.com/4UAHNqKcSD
అసెంబ్లీ ఎన్నికలు 2026 లైవ్: ఇక్కడ బీజేపీకి చోటే లేదు - కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
ఇక్కడ బీజేపీకి అస్సలు ప్రాధాన్యతే లేదు. అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేని రాష్ట్రం ఇది. అలాంటి పార్టీ గురించి చర్చించడం అంటే వారిని అనవసరంగా నెత్తిన పెట్టుకోవడమే. ఈ ఎన్నికల పోరు కేవలం అధికార ఎల్‌డీఎఫ్ (LDF), ప్రతిపక్ష యూడీఎఫ్ (UDF) మధ్యే సాగుతోంది అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యానించారు.
#WATCH | Thiruvananthapuram, Keralam | On Assembly elections, Congress MP Shashi Tharoor says, "...The BJP is not a factor here. This is a state where the BJP is a zero-seat party in the Assembly. To even mention them in the same breath is an excessive compliment. It is a fight… pic.twitter.com/EhCAPsRfrk
జుబీన్ గార్గ్‌కు న్యాయం కోసం పోరాడుతున్నాం: గరిమా సైకియా గార్గ్
"నిన్ననే నేను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాను. గతంలో జుబీన్‌తో కలిసి ఓటు వేయడానికి వచ్చేదాన్ని. ఓటు వేయడం మన బాధ్యత. అందుకే ఆరోగ్యం బాగోలేకపోయినా ఓటు వేయడానికి వచ్చాను. జుబీన్ గార్గ్‌కు న్యాయం కోసం మేము పోరాడుతున్నాం. త్వరలోనే దీనిపై సానుకూల ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను" అని గరిమా సైకియా గార్గ్ పేర్కొన్నారు.
#WATCH | Garima Saikia Garg says, "I got discharged from the hospital yesterday. Earlier, I used to go to vote along with Zubeen. It is our duty to cast a vote. So, I am physically unwell, but I have come here to vote..."
అసెంబ్లీ ఎన్నికలు 2026 LIVE: ఓటు హక్కు వినియోగించుకున్న దివంగత జుబీన్ గార్గ్ భార్య గరిమా సైకియా
దివంగత గాయకుడు జుబీన్ గార్గ్ భార్య గరిమా సైకియా గార్గ్, ఆమె సోదరి పాల్మీ బోర్ఠాకూర్ కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దిస్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 116వ నంబర్ పోలింగ్ కేంద్రానికి చేరుకుని వారు ఓటు వేశారు.
#WATCH | Assam Elections 2026 | Wife of late singer Zubeen Garg, Garima Saikia Garg, and his sister Palmee Borthakur arrived at polling booth number 116 in Dispur assembly constituency to cast their vote. pic.twitter.com/L2kjBnKsVf
అసెంబ్లీ ఎన్నికలు 2026 లైవ్: ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ భారీ మెజారిటీతో గెలుస్తుంది - షామా మహమ్మద్
ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ (UDF) భారీ మెజారిటీతో విజయం సాధించబోతోందని కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ ధీమా వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. "ప్రజలు మార్పు కోరుకుంటున్నారని క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది, నిరుద్యోగం పెరిగిపోయింది, డ్రగ్స్ సమస్య కూడా వేధిస్తోంది. బీజేపీ ఎంతలా దిగజారిపోయిందంటే.. ఓటమి భయంతో ఓట్లను కొనుగోలు చేస్తోంది" అని విమర్శించారు.
#WATCH | Kannur, Keralam | Congress leader Shama Mohammad says, "UDF is winning this election with a huge majority. You must have seen that people on the ground are saying they want change...The state is in debt, there is unemployment, there is a drug problem in the state… pic.twitter.com/ygfgscSd8Y
అస్సాం ఎన్నికలు 2026: సీఎం భార్యకు 3 దేశాల పాస్‌పోర్ట్‌లు.. కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
అస్సాం ఎన్నికలు 2026: సీఎం హిమంత బిశ్వ శర్మ భార్యకు మూడు దేశాల పాస్‌పోర్ట్‌లు ఉన్నాయంటూ కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. ఇంతకీ ఎవరీ రింకీ భుయాన్ శర్మ? కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారంటే..
Apr 09, 2026, 10:43 am IST
అసెంబ్లీ ఎన్నికలు 2026 లైవ్: మీ ఒక్క ఓటు సరిహద్దులను కాపాడుతుంది - అమిత్ షా
మీ ఒక్క ఓటు దేశ సరిహద్దులను సురక్షితం చేస్తుందంటూ అస్సాం ఓటర్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక విజ్ఞప్తి చేశారు.
On voting day, I urge the people of Puducherry to come out in large numbers and vote to form a government that will continue to provide you development, good governance and security and turn the vision of a fully developed Puducherry into a reality.
అసోం అసెంబ్లీ ఎన్నికలు 2026 LIVE: ఓటు హక్కు వినియోగించుకున్న అఖిల్ గొగోయ్
రాయ్ జోర్ దళ్ అధ్యక్షుడు, శివసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అఖిల్ గొగోయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 188 లఖిమీ నగర్ ఎల్‌పీ స్కూల్ (పశ్చిమ)లోని పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.
Apr 09, 2026, 10:38 am IST
అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్.. ఎక్కడ ఎంత శాతం ఓటింగ్ నమోదైందంటే?
ఓటింగ్ అప్‌డేట్స్: అస్సాం, కేరళ, పుదుచ్చేరిలోని 296 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. తాజా ఓటింగ్ శాతం వివరాలు ఇక్కడ చూడండి.
Apr 09, 2026, 10:38 am IST
అసెంబ్లీ ఎన్నికలు 2026 లైవ్: ఓటు వేసిన నటుడు మమ్ముట్టి
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తన భార్య సుల్ఫత్ కుట్టితో కలిసి కొచ్చిలోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు.
#WATCH | Keralam Elections 2026 | Actor Mammootty and his wife Sulfath Kutty arrive at a polling station in Kochi to cast their vote. pic.twitter.com/42V62LGVFY
అసెంబ్లీ ఎన్నికలు 2026 ఓటింగ్ లైవ్: కేరళలో మళ్లీ ఎల్డీఎఫ్ ప్రభుత్వమే.. సీపీఎం నేత ఎంఏ బేబీ ధీమా
ఓటు వేసిన అనంతరం సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ మీడియాతో మాట్లాడుతూ.. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) ఘనవిజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. "గత పదేళ్లలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం అద్భుతమైన పనితీరు కనబరిచింది. సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్య, వైద్య రంగాల్లో పురోగతితో పాటు రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం సఫలమైంది. కేరళలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. నీతి ఆయోగ్ నివేదికల ప్రకారం కేరళ అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో ఉంది. అందుకే మాకు భారీ విజయం దక్కుతుందని నమ్ముతున్నాం" అని ఆయన పేర్కొన్నారు.
#WATCH | Thiruvananthapuram, Keralam | CPM General Secretary MA Baby says, "We expect a resounding success for the Left Democratic Front because of the remarkable work the 10-year-long LDF govt. The communal amity that existed in the state during this period, not only social… pic.twitter.com/c2ybaueApo
అసెంబ్లీ ఎన్నికలు 2026 LIVE: అస్సాంలో 17.87%, కేరళలో 16.23% ఓటింగ్ నమోదు
ఉదయం 9 గంటల వరకు అస్సాంలో 17.87%, కేరళలో 16.23%, పుదుచ్చేరిలో 17.41% పోలింగ్ నమోదైంది. ఓటు వేసేందుకు ఓటర్లు భారీగా తరలివస్తుండటంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది.
State Assembly By-Elections | Approximate voter turnout as of 9 am -
కేరళం, అస్సాం, పుదుచ్చేరిల్లో ఈవీఎంల పనితీరును పరిశీలించడానికి ఉద్దేశించిన మాక్ పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. ఈ మూడుచోట్లా ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ఆరంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
6:25 AM, 9 Apr
ఢిల్లీ
వీటితో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, త్రిపురల్లో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ కూడా నేడే జరగబోతోంది. కర్ణాటకలో దావణగెరె సౌత్, బాగల్ కోటె, అజిత్ పవర్ కన్నుమూతతో ఖాళీ అయిన మహారాష్ట్రలోని బారామతి స్థానానికి నేడు పోలింగ్.
6:53 AM, 9 Apr
కేరళ
గురువాయూర్
తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి గురువాయూర్ దేవస్వొం ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్న త్రిశూర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి సురేష్ గోపీ.
7:06 AM, 9 Apr
కేరళ
పరవూర్
తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి కేసరి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ప్రతిపక్ష నేత వీడి సతీషన్. తన వంతు వచ్చేంత వరకు ఓటర్లతో పాటు క్యూ లో నిల్చొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పరవూర్ నుంచి ఆయన పోటీలో ఉన్నారు.
7:09 AM, 9 Apr
ఢిల్లీ
ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. కేరళ- 140, అస్సాం- 126, పుదుచ్చేరి- 30 స్థానాలకు ఒకేదశలో నేడు పోలింగ్ జరుగుతోంది. మే 4న ఓట్లను లెక్కిస్తారు.
7:28 AM, 9 Apr
కేరళ
తిరువనంతపురం
తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముదవాన్ ముగళ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. ఆ సమయంలో ఆయన వెంట మంత్రి, ఎల్డీఎఫ్ అభ్యర్థి వీ శివన్ కుట్టి ఉన్నారు. ఓటు వేయడానికి క్యూలో నిల్చున్నారు వారిద్దరూ.
7:46 AM, 9 Apr
ఢిల్లీ
కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో అతి పెద్ద పండగగా భావించే ఈ పోలింగ్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరిపై వేర్వేరుగా ట్వీట్లు వేశారు.
As polling begins for the Assam Assembly elections 2026, I appeal to the people of Assam to exercise their franchise in large numbers. I hope that the state’s youth and women voters participate enthusiastically and make this election a celebration of democracy and public duty.
జిల్లాలోని పినరయి ఆర్సీ అమల బేసిక్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
9:02 AM, 9 Apr
కేరళ ఎన్నికలు 2026 LIVE: ఓటు హక్కు వినియోగించుకున్న సుధాకరన్
అంబలపుజలోని ఒక పోలింగ్ కేంద్రంలో యూడీఎఫ్ అభ్యర్థి జి. సుధాకరన్ తన ఓటు వేశారు.
#WATCH | Keralam Elections 2026 | UDF candidate G. Sudhakaran casts his vote at a polling booth in Ambalapuzha. pic.twitter.com/PaODqi8Wa3
ఉప ఎన్నికల పోలింగ్ లైవ్: కర్ణాటక, నాగాలాండ్, త్రిపురలో మొదలైన ఓటింగ్
కర్ణాటక, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా బారులు తీరారు.
9:04 AM, 9 Apr
అసెంబ్లీ ఎన్నికలు 2026 లైవ్: అభివృద్ధి, సామరస్యం కోసమే ఓటు వేయండి - మల్లికార్జున ఖర్గే పిలుపు
2026 అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలో మార్పు గాలి స్పష్టంగా కనిపిస్తోంది. గత పదేళ్లుగా అస్సాం ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్రలు జరిగాయి. సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసి, వనరులను దోచుకోవడమే కాకుండా.. రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలు చేశారు. ఇప్పుడు అస్సాం ప్రజలంతా ఏకమై విభజన, వివక్ష రాజకీయాలను తమ ఓటుతో ఓడించాల్సిన సమయం ఆసన్నమైంది. ఐక్యత, సంక్షేమం, నిజమైన అభివృద్ధి వైపు నడవండి. మీ ఓటు అస్సాం ఆత్మగౌరవాన్ని, ఉజ్వల భవిష్యత్తును కాపాడుతుంది. ముఖ్యంగా తొలిసారి ఓటు వేస్తున్న యువత పెద్ద ఎత్తున తరలివచ్చి.. రాష్ట్ర పురోగతి కోసం ఓటు వేయాలని కోరుతున్నాను - మల్లికార్జున ఖర్గే
The change is palpable in Assam in this 2026 Assembly election.
In the past 10 years, Assam’s unity has been deliberately weakened - its social fabric strained, its resources exploited, and false narratives spread for political gain.
కేరళ ఎన్నికలు 2026 LIVE: 'UDF 100కు పైగా సీట్లు గెలుస్తుంది'.. ఓటు వేసిన తర్వాత సన్నీ జోసెఫ్ ధీమా
కేరళ పీసీసీ అధ్యక్షుడు, పేరావూర్ అభ్యర్థి సన్నీ జోసెఫ్ ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 'ఈ ఎన్నికల్లో UDFకు స్పష్టమైన మెజారిటీ వస్తుంది. మేము 100కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తాం. గత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే ఇక్కడ కూడా రిపీట్ అవుతాయని మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రస్తుత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు చరమగీతం పాడాలంటే.. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకుని UDFను గెలిపించాలి. ఇక ముఖ్యమంత్రి ఎవరనేది హైకమాండ్‌తో చర్చించిన తర్వాతే నిర్ణయిస్తాం' అని ఆయన పేర్కొన్నారు.
#WATCH | Keralam Elections 2026 | State Congress president and Peravoor candidate Sunny Joseph says, "UDF will win the majority seats. UDF will win more than 100 seats. The local body results will be repeated... We are hopeful... My appeal to the people is to exercise their… https://t.co/Lk39Kv6Wybpic.twitter.com/CS9O40tDEr
తమిళనాడు ఒపీనియన్ పోల్ 2026: సర్వే ఏం చెబుతోంది? ఎవరికి మొగ్గు?
తమిళనాడు ఒపీనియన్ పోల్ 2026: స్టాలిన్ 'ఉదయ సూర్యుడి'కి బ్రేక్ పడుతుందా? విజయ్ TVK ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తుంది?
9:07 AM, 9 Apr
కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2026 LIVE: ఓటు వేసిన ప్రతిపక్ష నేత వీడీ సతీశన్
కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రతిపక్ష నేత, పరవూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వీడీ సతీశన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎర్నాకుళంలోని కేసరి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.
#WATCH | Keralam LoP and Congress candidate from Paravur Assembly Constituency, VD Satheesan, casts his vote at the polling station in Kesari Government Arts and Science College in Ernakulam. pic.twitter.com/70AeFE7kSJ
అస్సాం అసెంబ్లీ ఎన్నికలు 2026 లైవ్: ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ అభ్యర్థి ప్రద్యుత్ బోర్డోలోయ్
దిస్పూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ప్రద్యుత్ బోర్డోలోయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నేను ఇప్పుడే నా ఓటు వేశాను. దిస్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్న సమయంలో.. నా ఓటును అక్కడికి బదిలీ చేయించుకోలేకపోయాను. ఓటు బదిలీ కాకపోవడంతో ఇక్కడే నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఇప్పుడు తిరిగి దిస్పూర్ వెళ్తున్నాను' అని తెలిపారు.
#WATCH | Nagaon, Assam: BJP candidate from Dispur assembly constituency, Pradyut Bordoloi, says, "I have just cast my vote. I couldn't transfer my voting rights when I decided to file my nomination as a BJP candidate from Dispur. Since it did not get transferred, I have just cast… https://t.co/56sjJThJrIpic.twitter.com/lYTN9zQWGM
అసెంబ్లీ ఉప ఎన్నికలు 2026 LIVE: ప్రారంభమైన పోలింగ్
కర్ణాటకలోని దావణగెరె సౌత్, బాగల్‌కోట్ స్థానాలతో పాటు నాగాలాండ్‌లోని కోరిడాంగ్, త్రిపురలోని ధర్మనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది.
9:09 AM, 9 Apr
అస్సాం అసెంబ్లీ ఎన్నికలు 2026 లైవ్: అస్సాంలో కొనసాగుతున్న పోలింగ్
జలుక్బారి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు.. సిరా గుర్తు ఉన్న తమ వేలిని చూపిస్తూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. సాయంత్రం 5:00 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
#WATCH | Assam Elections 2026 | Voters show their inked finger after exercising their franchise at a polling station in Jalukbari assembly constituency. pic.twitter.com/Wq6WBrBftg
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు 2026 LIVE: ప్రతి ఓటూ విలువైందే.. ఓటు హక్కు వినియోగించుకోండి: పీఎం మోదీ
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో.. ఓటర్లందరూ రికార్డు స్థాయిలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత, మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు. పుదుచ్చేరి భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రతి ఓటూ ఎంతో కీలకమని మోదీ పేర్కొన్నారు.
As the Puducherry Assembly elections commence, I urge every voter to come out and participate in record numbers. I especially appeal to our youth and to women voters to strengthen the process of democracy. Every vote matters in shaping the future of Puducherry.
అస్సాం అసెంబ్లీ ఎన్నికలు 2026 LIVE: 'ఓటు హక్కును భారీగా వినియోగించుకోండి'
అస్సాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో.. ప్రజలందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా రాష్ట్రంలోని యువత, మహిళా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని, ఈ ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగలా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను.
As polling begins for the Assam Assembly elections 2026, I appeal to the people of Assam to exercise their franchise in large numbers. I hope that the state’s youth and women voters participate enthusiastically and make this election a celebration of democracy and public duty.
కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2026 LIVE: భారీగా ఓటు వేయండి.. ప్రధాని మోదీ ట్వీట్
2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరూ భారీ సంఖ్యలో పాల్గొని ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైతే అది కేరళ ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా యువత, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ తన ట్వీట్లో విజ్ఞప్తి చేశారు.
Calling upon the people of Keralam to vote in large numbers in the 2026 Assembly elections. Record participation will add vigour to Keralam’s democratic spirit. I particularly request the youth and women of the state to step forward and vote in large numbers.
అసెంబ్లీ ఎన్నికలు LIVE: కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో మొదలైన పోలింగ్.. భారీ భద్రత
అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. నేడు అస్సాంలోని మొత్తం 126 స్థానాలు, కేరళలోని 140 స్థానాలు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు.
Voting for State Assembly Elections in Assam, Keralam and Puducherry begins. Today’s polling covers all 126 seats in Assam, all 140 in Keralam and all 30 in Puducherry.
కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2026 LIVE: నేడే పోలింగ్.. ఓటు వేయనున్న 2.71 కోట్ల మంది ఓటర్లు
కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 140 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మొత్తం 883 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, సుమారు 2.71 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
9:15 AM, 9 Apr
అసెంబ్లీ ఎన్నికలు 2026 లైవ్: కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ప్రారంభమైన పోలింగ్
9:16 AM, 9 Apr
LIVE అస్సాం అసెంబ్లీ ఎన్నికలు 2026: 5 జిల్లాల్లో 31,940 పోలింగ్ కేంద్రాలు
అస్సాం అసెంబ్లీలోని 126 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 722 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 జిల్లాల్లో ఒకే దశలో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు 31,940 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.
9:17 AM, 9 Apr
అసెంబ్లీ ఎన్నికలు 2026 లైవ్: మరికాసేపట్లో ప్రారంభం కానున్న పోలింగ్
కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. SNDP నర్సరీ స్కూల్లోని పోలింగ్ కేంద్రం వద్ద సందడి కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ ఇక్కడే తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
#WATCH | Kochi, Keralam: Preparations underway for Mock poll for the Keralam Assembly Elections. Visuals from SNDP Nursery School, polling Station, where the mock poll will begin. Congress MP Hibi Eden will cast his vote here. pic.twitter.com/zuK6LvkvPJ
అస్సాం ఎన్నికలు 2026: సీఎం భార్యకు 3 దేశాల పాస్‌పోర్ట్‌లు? కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్యకు మూడు దేశాల పాస్‌పోర్ట్‌లు ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. 2026 ఎన్నికల వేళ ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఇంతకీ ఎవరీ రినికి భుయాన్ శర్మ?
9:19 AM, 9 Apr
అసెంబ్లీ ఎన్నికలు 2026 LIVE: మూడు రాష్ట్రాల్లో పోలింగ్ షురూ.. అన్ని స్థానాల్లో ఒకేసారి ఓటింగ్
అస్సాంలోని 126, కేరళలోని 140, పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం నేడు ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఎన్నికల ఫలితాలు మే 4న విడుదలవుతాయి.
9:22 AM, 9 Apr
కేరళ అసెంబ్లీ ఎన్నికలు LIVE: ఎల్డీఎఫ్ చరిత్ర సృష్టించబోతోంది - ఎంబీ రాజేష్
కేరళ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, త్రిథాల నియోజకవర్గ ఎల్డీఎఫ్ అభ్యర్థి ఎం.బి. రాజేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎల్డీఎఫ్ గతంలో కంటే ఎక్కువ సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందని, తామంతా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
#WATCH | Palakkad | Parliamentary Affairs Minister & LDF Thrithala candidate MB Rajesh says, "LDF will come back to power with more seats. We are all set to create a new history..." pic.twitter.com/o9DzaVvc6h
Bank Holiday Today: ఈరోజు బ్యాంకులు పనిచేస్తాయా? మీ పనులు ఎలా పూర్తి చేసుకోవాలి?
Bank Holiday Today: అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు అక్కడ బ్యాంకులు మూతపడనున్నాయి. మరి మీ బ్యాంకింగ్ పనులు ఎలా పూర్తి చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
9:54 AM, 9 Apr
కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2026 LIVE: ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు రెంజీ పణిక్కర్.. వీడియో ఇదిగో!
కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా ప్రముఖ నటుడు, స్క్రిప్ట్ రైటర్ రెంజీ పణిక్కర్ తన ఓటు వేశారు. అనంతరం సిరా గుర్తు ఉన్న వేలిని చూపిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. "ప్రజాస్వామ్యంలో ఎన్నికలే అతిపెద్ద పండుగ. మీకు రాజకీయాలు నచ్చినా, నచ్చకపోయినా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి" అని రెంజీ పణిక్కర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
#WATCH | Ernakulam, Keralam | Actor and screenwriter Renji Panicker shows his inked finger after he cast his vote for the state Assembly elections 2026
He says, "Elections are the biggest festival of democracy... Everyone must exercise their right to vote, regardless of whether… pic.twitter.com/FE61qHTn4l