బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్నేహజీవి అనంత్ కుమార్: ఆరు సార్లు ఎంపీ, మూడు సార్లు కేంద్ర మంత్రి, చిరునవ్వుతో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కేంద్ర మంత్రిగా ఎనలేని సేవలు అందించిన అనంత్ కుమార్ చిన్నతనం నుంచి 'స్నేహజీవి' అని గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన సన్నిహితులు, బీజేపీ నాయకులు అంటున్నారు. ఎలాంటి సందర్బంలో అయినా చిరునవ్వుతో అందర్నీ పలకరించే అనంత్ కుమార్ ఇక మనమద్య లేరనే విషయం జీర్ణించుకోలేకపోతున్నామని అంటున్నారు. రాజకీయాల కోసం మొదటి సారి వెబ్ సైట్ ప్రారంభించిన రాజకీయ నాయకుడిగా అనంత్ కుమార్ రికార్డు సృష్టించారు. ఆరుసార్ల ఎంపీగా, మూడుసార్ల కేంద్ర మంత్రిగా పని చేసిన అనంత్ కుమార్ జీవితం ఇలా గడిచింది.

Bengaluru south MP Ananth Kumar passed away, Here is his brief profile.

* 1959లో బెంగళూరులో అనంత్ కుమార్ జన్మించారు.
* తండ్రి ఎన్ నారాయణ శాస్త్రీ, తల్లి గిరిజా శాస్త్రీ.
* హుబ్బళిలోని కేఎస్ ఆర్ట్స్ కాలేజ్ లో బీఏ విద్యాభ్యాసం పూర్తి చేశారు.
* దార్వాడలోని కర్ణాటక విశ్వవిధ్యాలయంలో ఎల్ఎల్ బీ పూర్తి.
* చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలో చురుకుగా పాల్గొన్నారు.
* భార్య తేజస్విని, ఐశ్వర్య, విజేతా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
* ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన అనంత్ కుమార్.
* 1985లో ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా పని చేశారు.
* బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు.
* 1998లో మొదటి సారి రాజకీయాల కోసం ప్రత్యేక వెబ్ సైట్ ప్రారంభించారు. రాజకీయాల కోసం మొదటి సారి వెబ్ సైట్ ప్రారంభించిన రాజకీయ నాయకుడిగా అనంత్ కుమార్ రికార్డు సృష్టించారు.
* అటల్ బీహారి వాజ్ పేయి ప్రభుత్వంలో అత్యంత చిన్న వయసులో మంత్రిగా పని చేశారు.
* బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజక వర్గం నుంచి ఆరుసార్లు వరుసగా ఎంపీగా విజయం సాధించిన అనంత్ కుమార్ మూడు సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు.
* 2003లో బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించిన అనంత్ కుమార్ మొదటి సారి కర్ణాటకలో అధిక సంఖ్యలో ఎంపీ సీట్లు కైవసం చేసుకుని దక్షిణ భారతదేశంలో సత్తా చాటుకున్నారు.
* 2004లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు స్వీకరించారు.
* మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాల్లో బీజేపీ భలోపేతానికి అనంత్ కుమార్ శక్తివంచనలేకుండా పని చేశారు.
* రాజకీయాలతో పాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి అనంతకుమార్ ఎక్కువ ఆసక్తి చూపించేవారు.
* బెంగళూరులో పరిశర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడానికి, పచ్చదనం కాపాడటానికి లెక్కలేనన్ని కార్యక్రమాలు నిర్వహించారు.
* ఇటీవల క్యాన్సర్ వ్యాదితో భాదపడుతున్న కేంద్ర మంత్రి అనంత్ కుమార్ లండన్ లో ప్రత్యేక చికిత్స చేయించుకునారు.
* లండన్ నుంచి బెంగళూరు చేరుకున్న అనంత్ కుమార్ ఇక్కడి శంకర్ క్యానర్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువ జామున తుదిశ్వాస విడించారు.

English summary
Union minister, Lok Sabha MP from Bengaluru South constituency, BJP leader Ananth Kumar passed away. Here is his brief profile.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X