బెంగళూరులో భారీ రైల్వే స్టేషన్..!!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా రూపుదిద్దుకుంటోన్న సిలికాన్ సిటీ బెంగళూరు రూపురేఖలు సమూలంగా మారబోతోన్నాయి. రెండో అంతర్జాతీయ విమానాశ్రయం ఇక్కడ ఏర్పాటు కాబోతోంది. దీనికోసం కర్ణాటక పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ టెండర్‌ను సైతం ఆహ్వానించింది. నగర శివార్లలో మూడు ప్రదేశాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. దీనికి సంబంధించిన డీపీఆర్ ను సిద్ధం చేయడానికి కర్ణాటక ప్రభుత్వం కన్సల్టెంట్‌ను సైతం నియమించనుంది.
ఇప్పుడు తాజాగా బెంగళూరులో ఓ భారీ రైల్వే స్టేషన్ రాబోతోంది. యలహంక రైల్వే స్టేషన్ ను 6,000 కోట్ల రూపాయలతో పునర్నిర్మించనుంది ప్రభుత్వం. చైనాలోని హాంగ్ఝౌ రైల్వే స్టేషన్ తరహాలో దీన్ని రూపొందించాలని నిర్ణయించింది. ఇది అందుబాటులోకి వస్తే బెంగళూరులో నాలుగో ప్రధాన టెర్మినల్‌గా మారుతుంది. ప్రస్తుతం క్రాంతివీర సంగోళి రాయణ్ణ, సర్ ఎం విశ్వేశ్వరయ్య, యశ్వంత్ పూర్ తర్వాత అతిపెద్ద టెర్మినల్ గా రూపుదిద్దుకుంటుంది.

దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలోని ఈ టెర్మినల్ కోసం రైల్వే వీల్ ఫ్యాక్టరీకి చెందిన భూమి, ప్రైవేట్ స్థలాలు, ప్రస్తుత యలహంక స్టేషన్ యార్డ్, రైల్వే సిబ్బంది నివాసాలను వినియోగిస్తారు. ప్రస్తుతం యలహంక రైల్వే స్టేషన్ లో అయిదు ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. ప్రతిపాదిత టెర్మినల్‌లో మొత్తం 16 ప్లాట్‌ఫామ్‌లు, 10 స్టేబ్లింగ్ లైన్లు, 15 పిట్ లైన్లు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల బెంగళూరు ఉత్తర ప్రాంతంలో రైళ్ల రాకపోకల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.
నిజానికి- శివార్లలోని దేవనహళ్లిలో ఈ తరహా టెర్మినల్ ను డెవలప్ చేయాలని ప్రతిపాదించినప్పటికీ.. అక్కడ అందుబాటులో భూమి లేదు. ప్రైవేట్ భూమిని సేకరించాల్సి రావడం వల్ల దీని నుంచి ప్రభుత్వం విరమించుకుంది. యలహంకలో రైల్వే స్థలం అధికంగా ఉండటం వల్ల దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా తాజా నిర్ణయం తీసుకుంది.
ఇది- బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 లను కలిగి ఉంటుంది. కన్కోర్స్, మెజానిన్ ఫ్లోర్, ప్లాట్‌ఫామ్‌లు, భూగర్భ బేస్మెంట్ దీనిలో భాగం. రైలు ట్రాక్‌లు బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ స్థాయిలలో నడుస్తాయని రైల్వే అధికారులను ఉటంకిస్తూ మనీకంట్రోల్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దేశంలోనే మొదటి పూర్తిగా ఎలివేటెడ్ రైల్వే టెర్మినల్ అవుతుందని పేర్కొంది. ఈ టెర్మినల్ కోగిలు క్రాస్ వద్ద రాబోయే బ్లూ లైన్ మెట్రోకు అనుసంధానిస్తారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్












Click it and Unblock the Notifications