• search

లాలూ ప్రసాద్ యాదవ్ దాణా స్కామ్ కథా కమామిషు

By Pratap
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  పాట్నా: దాణా కుంభకోణం కేసులో కోర్టు బీహార్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా నిర్ధారించింది. జగన్నాథ్ మిశ్రా కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. అయితే, ఆయనను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

  దాణా కుంభకోణం కేసు 1996లో వెలుగులోకి వచ్చింది. సిబిఐ దర్యాప్తులో తన పేరు ముందుకు రావడంతో లాలూ ప్రసాద్ యాదవ్ 1997లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పశు సంవర్ధక శాఖలో జరిగిన ఈ కుంభకోణం దాణా కుంభకోణంగా పేరు పొందింది.

  Bihar fodder scam: Key facts and timeline

  ఆ కుంభకోణంలో సిబిఐ 61 కేసులు నమోదు చేసింది. వాటిలో 53 రాష్ట్ర విభజన తర్వాత బీహార్ నుంచి జార్ఖండ్‌కు బదిలీ అయ్యాయి.

  జనవరి 1996: డిప్యూటీ కిషన్ అమిత్ ఖారే పశు సంవర్ధక శాఖ కార్యాలయాలపై దాడి చేసి మనుగడలోనే లేని కంపెనీలకు దాణా సరఫరా చేసినట్లు గల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దాంతో దాణా స్కామ్ వెలుగులోకి వచ్చిది.

  మార్చి 11, 1996: కుంభకోణంపై దర్యాప్తు చేయాలని పాట్నా హైకోర్టు సిబిఐని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆ ఆదేశాలను సమర్థించింది.

  మార్చి 27, 1996: చాయ్‌బసా ట్రెజరీ కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

  జూన్ 23,1997: సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. లాలూ ప్రసాద్‌తో సహా 56 మందిని నిందితులుగా చేర్చింది. ఐపిసి సెక్షన్ 420 (ఫోర్జరీ), 120 (బి) (క్రిమినల్ కుట్ర, సెక్షన్ 13 (బి) అవినీతి నిరోధక చట్టం కింద 63 కేసులు నమోదు చేసింది.

  జులై 30, 1997: సిబిఐ ముందు లాలూ ప్రసాద్ యాదవ్ లొంగిపోయారు. ఆయనకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.

  ఏప్రిల్ 30, 2000: సిబిఐ కోర్టు ముందు అభియోగాలను ఉంచారు. రబ్రీ దేవి పేరును సహ నిందితురాలిగా చేర్చారు. ఆమెకు బెయిల్ లభించింది. లాలూకు మాత్రం కోర్టు బెయిల్ నిరాకరించింది.

  అక్టోబర్ 5, 2001: కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసులను సుప్రీంకోర్టు జార్ఖండ్‌కు బదిలీ చేసింది.

  ఫిబ్రవరి 2002: రాంచీ సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ ప్రారంభమైంది.

  డిసెంబర్ 2006: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగాల నుంచి లాలూకు, రబ్రీకి విముక్తి లభించింది.

  జూన్ 2007: సిపిఐ ప్రత్యేక కోర్టు 5 మందికి జైలు శిక్ష విధించింది. వారిలో లూలు ప్రసాద్ యాదవ్ సమీప బంధువులు ఇద్దరు ఉన్నారు. చాయ్‌బసా ట్రెజరీ నుంచి 1990 దశకంలో అక్రమంగా రూ.48 కోట్లు తీసుకున్నారనే ఆరోపణపై వారికి రెండున్నర ఏళ్ల నుంచి ఆరేళ్ల వరకు శిక్షలు పడ్డాయ.

  మార్చి 2012: లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రాలపై సిబిఐ అభియోగాలు మోపింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ 1995-96లో ట్రెజరీల నుంచి రూ.47 కోట్లు అక్రమంగా తీసుకున్నారనే అబియోగం మోపారు.

  ఆగస్టు 13, 2013: ట్రయల్ కోర్టు న్యాయమూర్తిని మార్చాలనే లాలూ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.

  సెప్టెంబర్ 30, 2013: తీర్పును సిబిఐ కోర్టు రిజర్వ్‌లో పెట్టింది.

  సెప్టెంబర్ 30, 2013: లాలూ ప్రసాద్, మిశ్రాలతోపాటు 45 మందిని కోర్టు దోషులుగా ప్రకటించింది. ఆ తీర్పుతో లాలూ ప్రసాద్ యాదవ్ లోకసభ సభ్యత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

  డిసెంబర్ 23, 2017: దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా ప్రకటిస్తూ రాంచీ సిబిఐ కోర్టు తీర్పు చెప్పింది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  CBI court in Ranchi Saturday delivered the verdict in a fodder scam case involving former Bihar chief ministers Lalu Prasad Yadav.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more