ఆర్జేడీకి నితీష్ దూరం, సీటు మార్పించుకున్నారు

Posted By:
Subscribe to Oneindia Telugu

పాట్నా: బీహార్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ప్రభుత్వ కార్యక్రమం వేదికగా జేడీయూ-ఆర్జేడీ మధ్య శనివారం విభేదాలు బయటపడ్డాయి. అంతర్జాతీయ యువ నైపుణ్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం నితీష్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ గైర్హాజరయ్యారు. వేదికపై ఆర్జేడీ మంత్రి పక్కనున్న తన సీటును సీఎం నితీష్ మార్పించడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయని, ఎప్పుడైనా ఆర్జేడీతో జేడీయూ తెగతెంపులు ఖాయమంటున్నారు.

 Bihar Grand Alliance On The Edge: Nitish Neither Weak Nor Helpless, Says JD(U)

తేజస్వి ఎందుకు రాలేదో తమకు తెలియదని ఆర్జేడీ నేత, కార్మిక సాఖ మంత్రి విజయ్ ప్రకాశ్ చెప్పారు. కాగా, కార్యక్రమం ప్రారంభంలో ఆర్జేడీ మంత్రి విజయ్ ప్రకాశ్ పక్కనే సీఎం నితీష్ కూర్చున్నారు. కాసేపటికి తన సీటును జేడీయూ మంత్రి పక్కకు మార్పించుకున్నారు నితీష్.

పరిస్థితులపై సోనియా-శరద్‌ల చర్చ

నీతీశ్‌-లాలూల మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో మహాకూటమిలో మరో భాగస్వామి అయిన కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితులను గమనిస్తోంది.

జేడీ(యు) అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ కాంగ్రెస్‌ అధినేత సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. దాదాపు 40 నిమిషాలపాటు చర్చించారు. మహాకూటమి కొనసాగాలన్న విషయంపై చర్చలు జరిగాయని తెలుస్తోంది

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amid strain in the Bihar grand alliance over the corruption charges framed against Deputy Chief Minister Tejashwi Yadav, Janata Dal (United) said the state Chief Minister Nitish Kumar is neither weak nor helpless to take action in this matter and added that only time will tell what happens next.
Please Wait while comments are loading...