• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిల్కిస్ బానో: ఆమెకు న్యాయం దొరికిందా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

"ఈ తీర్పు రేప్ చట్టాన్నే అత్యాచారం చేసినట్లుగా ఉంది".

"న్యాయాన్ని సక్రమంగా అమలు చేయలేకపోతే, అది న్యాయాన్ని అపహాస్యం చేయడమే."

"ఇది ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు."

"ఇది మానవత్వానికి సంబంధించిన విషయం. ఈ కేసుపై నిర్ణయం తీసుకోవడానికి సాంకేతికత అంశాలేమి ఉండవు".

"ఈ నిర్ణయం బాధితులను కొత్తరకమైన ప్రమాదంలో పడేస్తుంది."

ఇవన్నీ గుజరాత్ అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో కేసులో శిక్షకు గురైన 11 మంది దోషులను విడుదల చేయడంపై కొందరు సీనియర్ న్యాయమూర్తుల స్పందనలు.

ఆగస్టు 15న గోద్రా జైలు నుంచి 11 మంది ఖైదీలు విడుదలయ్యారు. విడుదల తర్వాత ఈ ఖైదీలను సత్కరించి, స్వీట్లు తినిపిస్తున్న ఫోటోలు కనిపించాయి.

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసి ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేసిన కేసులో ఈ 11 మంది జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. ముంబయిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 2008లో ఈ 11 మందికి జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత బాంబే హైకోర్టు ఈ శిక్షను సమర్ధించింది.

ఈ దోషులను విడుదల చేయాలని గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ "ఏకగ్రీవంగా" నిర్ణయం తీసుకుంది.

దోషుల్లో ఒకరైన రాధే శ్యాం భగవాన్ దాస్ షా సుప్రీం కోర్టులో క్షమాభిక్ష దరఖాస్తును పెట్టుకోవడంతో గుజరాత్ లో అమలులో ఉన్న 1992 నాటి క్షమాభిక్ష విధానాన్ని అనుసరించినట్లు చెబుతున్నారు. దోషులకు శిక్ష విధించే సమయంలో 1992 నాటి విధానం అమలులో ఉండడంతో క్షమాభిక్షను ఆ విధానం ఆధారంగా అమలు చేశారు.

గుజరాత్ ప్రభుత్వం 2014లో కొత్త క్షమాభిక్ష విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో కొన్ని రకాల కేసులలో నేరస్థులను విడుదల చేయడంపై నిషేధం ఉంది. ఈ విధానం ప్రకారం అత్యాచారం, హత్య చేసిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాభిక్ష పెట్టకూడదు. కేసును సీబీఐ విచారణ చేసిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టలేదు. కమిటీ ఈ విధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఉంటే ఈ కేసులో దోషులకు ఎట్టి పరిస్థితుల్లో క్షమాభిక్ష లభించకూడదు.

మరి, ఈ కేసులో నిర్ణయాన్ని తీసుకోవడానికి 2014 క్షమాభిక్ష విధానానికి బదులు 1992 విధానాన్ని పరిగణనలోకి తీసుకోవడం సరైందేనా?

ఈ క్షమాభిక్షను పెట్టడంలో కమిటీ నిష్పాక్షికంగా వ్యవహరించిందా అనేది కూడా మరొక ప్రశ్న. ఈ 11 మంది దోషులను ఏకగ్రీవంగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న వారిలో ఇద్దరు బీజేపీ శాసనసభ్యులు, మాజీ బీజేపీ కౌన్సిలర్, బీజేపీ మహిళా విభాగానికి చెందిన వారు సభ్యులుగా ఉన్నట్లు తెలిసింది.

సీకే రౌల్జీ

దోషులను విడుదల చేసిన కొంత సేపటికే బీజేపీ గోద్రా శాసన సభ్యుడు సీకే రౌల్జీ ఈ దోషుల గురించి మాట్లాడుతూ, "వారంతా బ్రాహ్మణులు, సంస్కారవంతులు" అని వ్యాఖ్యానించారు. ఈయన కూడా కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.

"కమిటీలో సభ్యులందరూ వీరిని విడుదల చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. కమిటీ సభ్యుల నిర్ణయంలో బేధాభిప్రాయాలు లేవు" అని సీకే రౌల్జీ బీబీసీతో అన్నారు.

"దోషులంతా శిక్షా కాలంలో సత్ప్రవర్తన ప్రదర్శించారు. వారికి విధించిన శిక్షను భరించారు. జైలులో వారి ప్రవర్తన బాగుంది. వాళ్లకు నేర చరిత్ర కూడా లేదు" అని అన్నారు.

బిల్కిస్ బానో

బిల్కిస్ బానో కేసులో న్యాయం జరిగిందా?

ఈ విషయాన్ని అర్ధం చేసుకునేందుకు బీబీసీ రిటైర్డ్ న్యాయమూర్తులతో మాట్లాడింది.

జమ్మూ కశ్మీర్ మాజీ ప్రధాన న్యాయమూర్తి బషీర్ అహ్మద్ ఖాన్ బీబీసీతో మాట్లాడారు. "దోషులకు క్షమాభిక్ష పెట్టడం అత్యాచార చట్టాన్ని అత్యాచారం చేసినట్లుగా ఉంది" అని ఆయన అన్నారు.

"ఈ నిర్ణయం హానికారకంగా, అన్యాయంగా, ఉద్దేశ్యపూర్వకంగా, ఏకగ్రీవంగా, చట్టంలోని అన్ని రకాల నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది" అని అన్నారు.

"ఈ నిర్ణయం సదుద్దేశ్యంతో తీసుకున్నది కాదు. ఇది పక్షపాత వైఖరితో తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయాన్ని తీసుకునే కమిటీలో ఒకే పార్టీకి చెందిన వారు, పాలక పక్షానికి తలవంచే ప్రభుత్వ ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారు."

గుజరాత్‌లో 1992లో అమలులో ఉన్న విధానం ఆధారంగా దోషులకు క్షమాభిక్ష పెట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

"చట్టంలో ఉన్న విషయాన్ని చాలా రకాలుగా విశ్లేషించుకోవచ్చు. నేరం జరిగిన సమయంలో 1992లో క్షమాభిక్ష విధానం అమలులో ఉందని చెప్పొచ్చు. లేదా క్షమాభిక్ష పెట్టే సమయానికి అమలులో ఉన్న విధానాన్ని పరిశీలించాలి. ఈ విషయాన్ని సాంకేతిక అంశం ఆధారంగా నిర్ణయించేది అని నేననుకోవడం లేదు. ఇది మానవత్వానికి సంబంధించిన అంశం. మరో సారి బాధితుల ప్రాణాలు ముప్పులో పడ్డాయి. ఇప్పుడు బాధితుల నెలా రక్షిస్తారనేది పెద్ద ప్రశ్న" అని జస్టిస్ బషీర్ అహ్మద్ ఖాన్ అన్నారు.

"గుజరాత్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించే కమిటీని నియమించి ఉండాల్సింది. ఇది చాలా దిగ్భ్రాంతిని కలిగించే నిర్ణయం. ఈ నిర్ణయాన్ని 1992లో అమలులో ఉన్న విధానం ఆధారంగా తీసుకున్నామని చెప్పడం నా దృష్టిలో అర్ధం లేని వాదన" అని అన్నారు.

"నిర్భయ కేసు తర్వాత చట్టాన్ని మరింత పటిష్టం చేశారు. నేడున్న పరిస్థితుల రీత్యా ఇది సరైన నిర్ణయం కాదు. ఇది మానవీయ కోణంలో లేదు" అని అన్నారు.

"క్షమాభిక్ష పెడుతున్న సమయంలో ఈ నిర్ణయం బాధితురాలికి న్యాయం చేకూరుస్తుందో లేదో ఆలోచించి ఉండాల్సింది. ఈ నిర్ణయం వివక్షతో కూడుకుని హాని చేసేదిగా ఉంది. ఇది ఏకపక్ష నిర్ణయం. దీని వల్ల బాధితులకు కొత్త రకమైన ముప్పును సృష్టించారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు బాధితుల అభిప్రాయం కూడా విని ఉండాల్సింది" అని అన్నారు.

ఇది న్యాయం కోసం తీసుకున్న నిర్ణయంలా అనిపించడం లేదు.

"చట్టంలో ఉన్న నిబంధనల కంటే కూడా న్యాయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. ఏ మాత్రం స్పృహ మిగిలినా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి" అని అన్నారు.

"ఆలోచనతో తీసుకున్న నిర్ణయం కాదు"

ఈ నిర్ణయం ఏకపక్షం అని దిల్లీ హై కోర్టు జడ్జి ఆర్‌ఎస్ సోధీ అన్నారు.

"ఈ క్షమాభిక్ష పెట్టేందుకు పరిగణించిన విషయాలేంటి" అని ప్రశ్నించారు.

"14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన తర్వాత క్షమాభిక్ష పెట్టుకునేందుకు హక్కు కల్పిస్తుంది కానీ, క్షమాపణ పొందే హక్కును ఇవ్వదు".

"ఈ క్షమాభిక్ష ఏకగ్రీవం అవ్వకూడదు. అత్యాచార నేరానికి పాల్పడిన వారిని విడుదల చేసే అర్హత ఉంటుందా? న్యాయాన్ని సరిగ్గా అమలు చేయలేకపోతే చట్టాన్ని అపహాస్యం చేయడమే" అని అన్నారు.

ఈ అంశం పూర్తిగా పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తోంది. "ఈ నిర్ణయం తీసుకోవడంలో ఆలోచనను వాడలేదు. ఇందులో వారి మనసును పెట్టి ఉండాల్సింది" అని అన్నారు.

రాధేశ్యాం భగవాన్ దాస్ షా

1992 నాటి విధానమా లేక 2014 నాటిదా?

ఈ కేసులో క్షమాభిక్షను పెట్టేందుకు ఎప్పటి విధానాన్ని పరిశీలించారనే చర్చ కూడా మొదలయింది. 1992 నాటి విధానమా లేక 2014 నాటిదా?

"క్షమాభిక్ష పెడుతున్న సమయంలో ప్రస్తుతం అమలులో ఉన్న విధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. నేరం చేసినప్పుడు అమలులో ఉన్న విధానాన్ని పరిగణనలోకి తీసుకోరు" అని దిల్లీ హై కోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ ఎన్ ధింగ్రా చెప్పారు.

"ఈ రోజు ఒకరికి క్షమాభిక్ష పెట్టేందుకు 20, 30 సంవత్సరాల క్రితం నాటి విధానాన్ని ఆధారంగా చేయకూడదు. కొత్త విధానాన్నే పరిశీలించాలని నా అభిప్రాయం" అని చెప్పారు.

"కొత్త విధానాలనే పరిగణించాలని" మాజీ అలహాబాద్ హై కోర్ట్ జడ్జి గిరిధర్ మాలవీయ చెప్పారు.

"ఈ కేసులో ప్రస్తుతం అమలులో ఉన్న విధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది. 2014 నాటి విధానం అమలవుతుంది కానీ, 1992 నాటిది కాదు" అని అన్నారు.

ఈ కేసులో 11 మంది దోషుల్లో ఒకరైన రాధేశ్యాం భగవాన్ దాస్ షా క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నారు. రాధేశ్యాం భగవాన్ దాస్ షా న్యాయవాది రిషీ మల్హోత్రాతో బీబీసీ మాట్లాడింది.

"2008లో వీరికి శిక్ష విధించినప్పుడు 2014 నాటి విధానమే రూపొందలేదు. క్షమాభిక్ష పెట్టేటప్పుడు శిక్ష విధించే సమయంలో అమలులో ఉన్న విధానాన్ని పరిగణించాలని సుప్రీం కోర్టు కూడా 2003 నుంచి చాలా కేసుల్లో చెప్పింది. ఈ విషయంలో సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్నే పాటించారు" అని చెప్పారు.

"2014 నాటి విధానాన్ని పరిశీలించాలని చెప్పడం సుప్రీం కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఉంది. హర్యానా వెర్సస్ జగదీశ్ కేసులో త్రిసభ్య బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు అనుసరిస్తూ వస్తోంది. ఇందులో వివాదానికి ఆస్కారమే లేదు" అని అన్నారు.

బిల్కిస్ బానో

"కమిటీ పక్షపాతంతో వ్యవహరించింది అనడంలో అర్థం లేదు"

గుజరాత్ లో ఏర్పాటు చేసిన కమిటీ పక్షపాత ధోరణితో వ్యవహరించిందన్న ఆరోపణల పట్ల స్పందిస్తూ, "అది అర్ధం లేని వాదన. ఈ కమిటీలో జిల్లా మేజిస్ట్రేట్, ఒక సెషన్స్ జడ్జ్, ముగ్గురు సామాజిక కార్యకర్తలు, జైలు సూపరింటెండెంట్, ఇద్దరు శాసన సభ్యులు ఉన్నారు.

కమిటీలో ఉన్న 10 మంది సభ్యులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఇద్దరు బీజేపీ నేతలు మాత్రమే కాకుండా న్యాయమూర్తులు కూడా ఉన్నారు. మనం న్యాయమూర్తులు, జిల్లా మేజిస్ట్రేట్ నిర్ణయాన్ని ప్రశిస్తున్నామా" అని అడిగారు.

"కమిటీ సభ్యులు ఈ నిర్ణయాన్ని 1992లో అమలులో ఉన్న విధానాన్ని పరిశీలించి తీసుకున్నారని రిషీ మల్హోత్రా అన్నారు. "దోషులు ఇప్పటికే 15 ఏళ్ల జైలు శిక్షను అనుభవించారు. ఈ నిర్ణయాన్ని ఎవరో ఇద్దరు సభ్యులు అక్రమంగా నిర్ణయం తీసుకోలేదు. ఇది 10 మంది సభ్యులు కలిసి తీసుకున్న నిర్ణయం" అని అన్నారు.

'దోషులకు మరణశిక్ష విధించనప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు’

ఈ వివాదం అంతా రాజకీయాలతో సంబంధం ఉన్నట్లుగా ఉందని రిషీ మల్హోత్రా అన్నారు.

"ఈ కేసులో దోషుల విడుదల గురించి చాలా వ్యతిరేకత ఎదురయింది. వీరికి జీవిత ఖైదు విధించినప్పుడు వారికి మరణ శిక్ష విధించాలని సీబీఐ హై కోర్టులో అప్పీలు చేసింది. సుప్రీం కోర్టు కూడా జీవిత ఖైదును సమర్ధించింది. అప్పుడు వారికి మరణ శిక్ష విధించమని ఎందుకు అడగలేదు? అప్పుడెందుకు అందరూ మౌనంగా ఉన్నారు? దోషులు 15 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఇప్పుడెందుకు అల్లరి చేస్తున్నారు? హై కోర్టు, సుప్రీం కోర్టు వీరికి మరణ శిక్ష విధించలేనప్పుడే అల్లరి చేసి ఉండాల్సింది" అని అన్నారు.

"ప్రస్తుతం ఈ విషయంలో జరుగుతున్న అల్లరి అంతా న్యాయమూర్తుల పై ఒత్తిడి పెట్టేందుకే చేస్తున్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు చట్టం తెలియలేనట్లు, విధానాలనెప్పుడూ చూడలేనట్లు వారి నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారా?" అని అడిగారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Bilkis Bano: Did she get justice?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X