వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహా సంక్షోభం: బీజేపీ వెన్నుపోటు పొడిచింది.. కలిసే ప్రసక్తే లేదు: ఉద్దవ్ థాకరే

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో షిండే తిరుగుబాటుతో ఉద్దవ్ అండ్ టీమ్ ఏమీ చేయలేకపోతున్నారు. పైకి మాత్రం.. బానే చూసుకున్నాం అని చెబుతున్నారు. కానీ షిండే తిరుగుబాటు వెనక బీజేపీ ఉందని సీఎం ఉద్దవ్ థాకరే అన్నారు. తమను ఆ పార్టీ వెన్నుపోటు పొడిచిందని కామెంట్ చేశారు. దానిని తాము మరచిపోమని చెప్పారు. అంతేకాదు బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఇదివరకు ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. కానీ గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశాయి. అధికారం కోసం రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

 అస్థిరత్వం లేదే..?

అస్థిరత్వం లేదే..?

అయితే ఇప్పటికీ కూడా అస్థిరత్వం లేదని శివసేన అంటోంది. ఇవాళ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించామని శివసేన నేత సచిన్ అహిర్ అన్నారు. సీఎం ఉద్దవ్ స్పీచ్‌తో నేతల్లో ఉత్సాహం నింపిందని పేర్కొన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు లేకపోవచ్చు.. కానీ పార్టీ అలాగే ఉంటుందని తెలిపారు. తాము పోరాడుతామని అందులో విజయం సాధిస్తామని అంటున్నారు.

విదాన్ భవన్ చేరిన డిప్యూటీ స్పీకర్

విదాన్ భవన్ చేరిన డిప్యూటీ స్పీకర్


విధాన్ భవన్‌కు మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నర్హారీ జిర్వాల్ చేరుకున్నారు. ఆయనతో శివసేన సీనియర్ నేత, మంత్రి సుభాష్ దేశాయ్, ఎంపీలు అర్వింద్ సావంత్, అనిల్ దేశాయ్, ఎన్సీపీ ఎమ్మెల్సీలు హేమంత్ టాక్లే, ఏక్ నాథ్ ఖడ్సే తదితరులు ఉన్నారు.

బాధ లేదు

బాధ లేదు


తాను వర్షను వదిలి వెళుతున్నందుకు బాధపడటం లేదని సీఎం ఉద్దవ్ థాకరే అన్నారు. ఇదీ తనది కాదని తనకు తెలుసు అని చెప్పారు. ఇదివరకు చాలా మంది కూడా అలాగే వెళ్లారని గుర్తుచేశారు. తనకు ఎలాంటి బాధ లేదని చెప్పారు. తనతో శివ సైనికులు ఉన్నారని పేర్కొన్నారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలు కూటమికి మద్దతును ఉపసంహరించుకోలేదని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ తెలిపారు.

షిండే లేఖ

షిండే లేఖ


మరోవైపు నిన్న రాత్రి ఏక్ నాథ్ షిండే డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాశారు. తమకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు. ఇప్పటికీ కాంగ్రెస్, ఎన్సీపీ.. శివసేన వెనకాల ఉన్నాయి. ఇప్పటికీ అసోంలో గల గువహటి రాడిసన్ బ్లూ హోటల్‌లో అసమ్మతి ఎమ్మెల్యేలు ఉన్నారు.

English summary
Maharashtra Politics cricis: BJP backstabbed us, can't ally with them maharashtra cm Uddhav Thackeray said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X