వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ, కాంగ్రెస్ దొందూ, దొందే : ఇగో ఎక్కువన్న అఖిలేశ్

|
Google Oneindia TeluguNews

లక్నో : అధికార బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్. ఆ రెండు పార్టీలకు ఇగో ఎక్కువని విమర్శించారు. ఆయన బుధవారం హర్దోయా, కాన్పూర్ లో ప్రచారం నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం, కానీ వారికి అహం ఎక్కువ అని పేర్కొన్నారు. బీజేపీ లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యర్థులను బెదిరించే గుణం ఉందని ఆరోపించారు.

bjp, congress parties are same : akhilesh

విభజన రాజకీయాలు
బీజేపీ విభజించి పాలించు విధానాన్ని ఉపయోగిస్తోందని అఖిలేశ్ పేర్కొన్నారు. అంతేకాదు కుల, మతాల ప్రాతిపదికన విభజన సృష్టిస్తోందని ఆరోపించారు. స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను బీఎస్పీ-ఎస్పీ కూటమి చరమగీతం పాడుతోందని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశానికి ప్రధాని కావాలి కానీ ప్రచార మంత్రి కాకుడదని సెటైర్లు వేశారు. గత ఎన్నికల ముందు మోదీ చెప్పిందొకటి చేసింది మరోకటి అని విమర్శించారు.

మాదీ ఓకే .. మరి మీదీ ?
ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి మహాకల్తీ కూటమి అని ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా 38 పార్టీలతో పొత్తు పెట్టుకున్న బీజేపీని ఏమనాలి అని ప్రశ్నించారు. సమర్థమంతమైన ప్రధాని ఉన్నందువల్లే సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని బీజేపీ నేతలు చెప్తున్నారు. కానీ సరిహద్దులు జవాన్ల వల్లే సేఫ్ గా ఉన్నాయి కదా అని అఖిలేశ్ స్పష్టంచేశారు.

English summary
SP supreme Akhilesh Yadav was furious at the Congress party along with the ruling BJP. Both parties have criticized Ego. He held a campaign in Harudha, Kanpur on Wednesday. We have tied up with the Congress party in the past, but they say that the ego is greater.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X