వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌లో వరుసగా ఆరోసారి బిజెపి గెలుపు:బెంగాల్ లెఫ్ట్‌ఫ్రంట్ రికార్డు‌ సమం చేసేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్ రాష్ట్రంలో వరుసగా ఆరోసారి బిజెపి అధికారంలోకి వచ్చింది. మరోసారి బిజెపి గుజరాత్ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొంటే పశ్చిమబెంగాల్ వామపక్ష ప్రభుత్వ రికార్డ్‌ను బిజెపి సమం చేయనుంది.

Recommended Video

మోడీకి షాక్ మీద షాక్, సొంతూరు లో బీజేపీ ఓటమి : సోనియాతో రాహుల్ భేటీ

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 1977లో అధికారంలోకి వచ్చిన సిపిఎం నేతృత్వంలోని వామపక్ష సంఘటన ప్రభుత్వం 2011లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైంది. ఆ తర్వాత 2016లో జరిగిన ఎన్నికల్లో కూడ ఆ పార్టీ రెండో దఫా ఓటమిని మూటగట్టుకొంది.

బిజెపి కూడ గుజరాత్‌ రాష్ట్రంలో వరుసగా ఆరో దఫా విజయం సాధించింది. అయితే బిజెపి మాత్రం బెంగాల్ లెఫ్ట్‌ఫ్రంట్ రికార్డుకు ఒక్క అడుగు దూరంలోనే ఉంది. అయితే వచ్చే ఐదేళ్ళకు జరిగే ఎన్నికల్లో బిజెపి మరోసారి గుజరాత్‌లో విజయం సాధిస్తే ఈ రికార్డు సమం కానుంది.

బెంగాల్‌లో 7 దఫాలు లెప్ట్‌ఫ్రంట్ ప్రభుత్వం

బెంగాల్‌లో 7 దఫాలు లెప్ట్‌ఫ్రంట్ ప్రభుత్వం

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వరుసగా 7 దఫాలు లెఫ్ట్‌ఫ్ట్రంట్ ప్రభుత్వం అధికారాన్ని కైవసం చేసుకొంది.సిపిఎం నేతృత్వంలో ఈ ప్రభుత్వం ఆనాడు ఏర్పాటైంది. 1977 జనవరిలో సీపీఎం, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, రివల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ, మార్క్సిస్ట్‌ ఫార్వర్డ్‌ బ్లాక్‌, రివల్యూషనరీ కమ్యూనిస్ట్‌పార్టీ ఆఫ్‌ ఇండియా తదితర పార్టీలు కలిసి వామపక్ష కూటమిగా ఏర్పడ్డాయి. 1977 జూన్‌లో జరిగిన పశ్చిమ్‌బంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి పోటీ చేసి ఘనవిజయం సాధించింది.వరుసగా ఏడుసార్లు రాష్ట్రంలో అధికారం కొనసాగించింది. జ్యోతిబసు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. జ్యోతిబసు తర్వాత బుద్దదేవ్ భట్టాచార్య రెండు దఫాలు సీఎంగా కొనసాగారు.

 బెంగాల్‌లో లెఫ్ట్‌ఫ్ట్రంట్‌ను నడిపిన జ్యోతిబసు

బెంగాల్‌లో లెఫ్ట్‌ఫ్ట్రంట్‌ను నడిపిన జ్యోతిబసు

బెంగాల్‌‌ రాష్ట్రంలో లెఫ్ట్‌ఫ్రంట్‌‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అప్పటి ముఖ్యమంత్రి జ్యోతిబసు వ్యవహరించారు. లెఫ్ట్‌ప్రంట్ ప్రభుత్వాన్ని ఇతర ప్రభుత్వాల కంటే భిన్నంగా నడపడంలో జ్యోతిబసు కీలక భూమిక పోషించారు.దేశంలో కేరళలో తొలి వామపక్ష ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కేరళలో సుస్థిరంగా సిపిఎం విజయం సాధించలేదు. కానీ, బెంగాల్‌లో లెప్ట్‌ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో తీసుకొన్న భూ పంపిణీ ఆ రాష్ట్రంలో సుదీర్ఘకాలం లెప్ట్‌ఫ్రంట్ అధికారంలో ఉండేలా చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు.

 ఆ రికార్డు జ్యోతిబసుదే

ఆ రికార్డు జ్యోతిబసుదే

పశ్చిమబెంగాల్ రాష్ర్ట సీఎంగా జ్యోతిబసు సుమారు 23 ఏళ్ళకు పైగా పనిచేశారు. ఒక రాష్ట్రానికి సుదీర్ఘ కాలం వరుసగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర జ్యోతిబసుపై ఉంది. జ్యోతిబసు 2000 సంవత్సరంలో సీఎం పదవిని వదిలేశారు. ఆయన స్థానంలో బుద్దదేవ్ భట్టచార్య సీఎం పదవిని చేపట్టారు. ఆ తర్వాత జరిగిన 2002 ఎన్నికల్లో బుద్దదేవ్ భట్టాచార్య నేతృత్వంలో లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వం పనిచేసింది. ఆ సమయంలో తీసుకొన్న పారిశ్రామిక విధానాలు లెప్ట్‌ఫ్రంట్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయేలా చేశాయి.

 వరుసగా ఆరుస్లారు గుజరాత్‌లో బిజెపిదే అధికారం

వరుసగా ఆరుస్లారు గుజరాత్‌లో బిజెపిదే అధికారం

వరుసగా గుజరాత్‌లో ఆరోసారి బిజెపి అధికారాన్ని కైవసం చేసుకొంది.ఇప్పటికే 22ఏళ్ల పాటు అధికార పీఠంలో కొనసాగుతున్న భాజపా.. మరో ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించనుంది. 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తొలిసారిగా విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో బిజెపికి 121 సీట్లు వచ్చాయి. ఇక అప్పటి నుంచి రాష్ట్రంలో బిజెపి జయభేరీ మోగిస్తూనే ఉంది.1998, 2002లో జరిగిన ఎన్నికల్లో కూడ బిజెపి విజయం సాధించింది.2007, 2012, 2017 ఎన్నికల్లో కూడ బిజెపి విజయం సాధించింది.. మరోసారి బిజెపి గుజరాత్‌లో విజయం సాధిస్తే బెంగాల్‌ లెఫ్ట్ ప్రంట్ రికార్డును సమం చేస్తోంది.

English summary
The saffron party looks set to form government for the sixth straight time in Modi’s home state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X