వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Omicron:బూస్టర్ డోసుతో బూస్టింగే: జినొమ్.. 40, ఆపై వారికి కంపల్సరీ

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ కరోనా వేరియంట్ వైరస్ గురించి ఒక్కో విషయం టెన్షన్ కలిగిస్తోంది. అయితే ఇప్పటివరకు తీసుకున్న వ్యాక్సిన్ పనిచేయదని అంటున్నారు. కేవలం 10 శాతం వరకు మాత్రమే ప్రభావం ఉంటుందని సమాచారం. అయితే దీనికి సంబంధించి సార్స్ కొవిడ్-2 జినొమ్ కన్షార్టియం కొత్త విషయం తెలియజేసింది. ఇప్పటివరకు రెండు డోసులు తీసుకున్న వారు మూడో డోసు (బూస్టర్ డోసు) తీసుకోవాలని సజెస్ట్ చేసింది. అదీ కూడా 40 ఏళ్లు దాటిన వారికి మంచి ఫలితాలు వస్తాయని పేర్కొంది.

Recommended Video

Omicron Variant : Need A Booster Dose ? || Oneindia Telugu
బూస్టర్ డోసు..

బూస్టర్ డోసు..

వ్యాక్సిన్ గురించి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇమ్యునైజేషన్ ధృవీకరిస్తాయి. జొనొమ్ కన్సార్టియం అనేది ల్యాబులతో నెలకొన్న బాడీ.. సలహా సంస్థ కూడా కాదు.. అయితే బూస్టర్ డోసు గురించి మాత్రం ప్రకటన చేసిన తొలి సంస్థ ఇదే.. ఇదీ కాస్త ఊరట కలిగించే అంశంగా మారింది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ నిర్ధారణ కాకముందే అడ్వైజరీ బోర్డు ఈ విషయాన్ని తెలియజేసింది.

వీరు తీసుకోవాల్సిందే..

వీరు తీసుకోవాల్సిందే..

40 ఏళ్లు, ఆపై బడిన వారు తప్పకుండా బూస్టర్ డోసు వేసుకోవాల్సిందేనని స్పష్టంచేసింది. అయితే ఎక్కువ వయసు ఉన్నవారే తొలుత రిస్క్ తప్పదని.. అందుకే వారిని తీసుకోవాలని సూచిస్తున్నామని పేర్కొంది. ప్రస్తుతం తీసుకున్న రెండు డోసులు శరీరంలో యాంటీబాడీలు సరిపోవని.. ఒమిక్రాన్‌ను నిలువరించవని తెలియజేసింది. దేశంలో ఇస్తోన్న కొవిషీల్డ్, కోవాగ్జిన్ రెండు కూడా.. ఒమిక్రాన్ వేరియంట్‌ను నివారించడంలో సఫలం కాలేవని తెలిపింది. కొన్నిసార్లు వైరస్ సోకగా.. మరో సందర్భంలో రీ ఇన్ ఫెక్షన్ వస్తోన్న సంగతి తెలిసిందే.

ఇలా రక్షణ..

ఇలా రక్షణ..


రెండు కోవిషిల్డ్ డోసులు 63 శాతం మాత్రమే రక్షణ ఇస్తోందని ఫరీదాబాద్‌లో గల హెల్త్ సైన్స్ ఇనిస్టిట్యూట్ వివరించింది. సార్స్ కొవిడ్ 2కు మాత్రం 85 శాతం రక్షణ ఇస్తుందని తెలిపింది. అయితే దీనికి సంబంధించి కోవాక్జిన్ సమాచారం మాత్రం అందుబాటులో లేదు. ఒమిక్రాన్‌ వెలుగుచూసిన సౌతాఫ్రికాలో వైరస్ వచ్చిన వారి పరిస్థితిని బట్టి పరిస్థితిని అంచనా వేయొచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా, లండన్‌ బూస్టర్ డోసుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు ఇచ్చారు.

English summary
Omicron variant has recommended that boosters “be considered” in those above 40 age Indian SARS-COV-2 genome consortium suggested
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X