వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఆఫీస్‌లో రూ.లక్షలు: 'కేజ్రీ ప్రభుత్వాన్ని కూల్చేకుట్ర'

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యదర్శి రాజేంద్ర కుమార్‌ను అరెస్టు చేయవచ్చుననే వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలోని రాజేంద్ర కుమార్ కార్యాలయంలో సిబిఐ మంగళవారం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ సోదాల్లో సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున నగదు, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సిబిఐ ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలోని 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో సిబిఐ.. రాజేంద్ర కుమార్ నివాసం మూడు దస్తాలు, రూ.2.4 లక్షలను స్వాధీనం చేసుకుందని తెలుస్తోంది.

CBI raids Kejriwal's secretary office, gets 2.4 Lakhs & land documents

ఢిల్లీ సచివాలయంలో మంగళవారం ఉదయం సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో సీబీఐ సోదాలను సీఎం కేజ్రీవాల్‌ చెప్పారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక ప్రధాని మోడీ పిరికి చర్యలకు పాల్పడుతున్నారని కేజ్రీవాల్‌ ఆరోపించారు.

ప్రధాని మోడీది పిరికిపంద చర్య అని మండిపడ్డారు. ఆయన ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారన్నారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ... ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

అయితే, సీఎం ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంలోనే సోదాలు జరిగాయని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. తాము కేజ్రీవాల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించలేదని చెప్పింది. పైగా సీఎంవో అనుమతులతోనే సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

సిబిఐ దాడులపై మమత షాక్

సిబిఐ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో తాను షాకయ్యానని చెప్పారు. దానికి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ... మమతా దీ! ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అని ట్వీట్ చేశారు.

English summary
Arvind Kejriwal's secretary Rajendra Kumar may be arrested as media reports are stating that Huge amount of money recovered from his residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X