పెరిగిన వంట గ్యాస్ ధరల వేళ కేంద్రం బిగ్ రిలీఫ్..!?
వంట గ్యాస్ సరఫరా.. ధరలు వినియోగదారుల్లో టెన్షన్ పెంచుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. అదే సమయంలో వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ పరిమితుల పైన ఆంక్షలు విధించారు. అటు కమర్షియల్ గ్యాస్ సరఫరా సమస్యతో హోటళ్లు మూత బడుతున్నాయి. కేంద్రం ఈ పరిస్థితుల పై అధ్యయనం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ రోజు జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో పెరిగిన వంట గ్యాస్ ధరల పైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెరిగిన వంట గ్యాస్ ధరలు.. సరఫరా, బుకింగ్ లో పరిమితులు వినియోగ దారులకు సమస్యగా మారుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఒకే సారి ఏకంగా గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో మాత్రం మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. అటు గృహ వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చేలా.. ఎక్కడా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయిల్ కంపెనీలను కేంద్రం ఆదేశించింది. దీంతో పాటుగా సిలిండర్ బుకింగ్ కోసం పరిమితులు.. గడువు విధించింది. దీంతో.. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత మొదలైంది. కాగా, దేశంలో గ్యాస్ సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర చమురు మంత్రిత్వశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ పెరిగిన ధరల పై పునరాలోచన
ఈ పరిస్థితుల్లో ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పశ్చిమాసియా పరిస్థితులతో పాటుగా వంట గ్యాస్ సరఫరా.. పెరిగిన ధరల పైన సమీక్ష చేయనుంది. ఈ వారంలోనే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అటు ప్రతిపక్షాలు వంట గ్యాస్ ధరల పెంపు పైన రాజకీయం గా టార్గెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పెరిగిన ధరలను ఎంత మేర తగ్గిస్తే.. ప్రభుత్వం పైన ఎంత భారం పడుతుందీ... పశ్చిమాసియాలో ఎప్పటి లోగా పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది అనే అంశాల పైన చర్చించనున్నారు. ఎన్నికల వేళ వంట గ్యాస్ ధరల పైన పునరాలోచన చేయకుంటే నష్టం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో.. ఈ రోజు జరిగే కేంద్ర కేబినెట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారుతోంది. గ్లోబల్ ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా గ్యాస్ వినియోగంపై నియంత్రణ అవసరమైందని ప్రభుత్వం చెబుతోంది. ఈ రోజు కేంద్రం తీసుకునే నిర్ణయం కోసం వినియోగదారులు వేచి చూస్తున్నారు.
-
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
ఎల్‌పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
LPG Refill Booking: గ్యాస్ బుకింగ్స్ పై పుకార్లు నమొద్దు-కేంద్రం క్లారిటీ..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications