వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహా సంక్షోభం: శరద్ పవార్‌కు బెదిరింపులు, శివ సైనికులు వీధుల్లోకి వస్తే..: సంజయ్ రౌత్

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేన ఏమీ చేయలేకపోతోంది. ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను బీజేపీ బెదిరిస్తోందని ఆరోపించారు. ఓ కేంద్రమంత్రి స్వయంగా పవార్‌ను బెదిరింపులకు గురిచేస్తోందని వివరించారు. ఈ కామెంట్లు రాజకీయంగా తీవ్ర కలకలం రేపాయి.

ఇంటికి వెళ్లనీయం..

ఇంటికి వెళ్లనీయం..


రాష్ట్రంలో కూటమిని కాపాడే ప్రయత్నం చేయొద్దని శదర్ పవార్‌ను కోరారట. లేదంటే అతనిని ఇంటికి వెళ్లనీయమని చెబుతున్నారు. అయితే తమ కూటమి బతికి బట్టకట్టినా.. లేకపోయినా సరే కానీ శరద్ పవార్‌‌ను ఇలా బెదిరించడం సరికాదని సంజయ్ రౌత్ అంటున్నారు. శివ సైనికులను రెచ్చొగొట్టొద్దు అని రౌత్ స్పష్టంచేశారు. ఇప్పటివరకు తాము రోడ్ల మీదకి రాలేదని.. గల్లీలకు వచ్చే పరిస్థితి తీసుకురావొద్దని కోరారు.

ఇప్పుడు లీగల్ ఫైట్

ఇప్పుడు లీగల్ ఫైట్


సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు నడుచుకుంటామని పేర్కొన్నారు. ఇప్పుడు లీగల్ ఫైట్ నడుస్తోందని.. వివరించారు. కొందరు 40 మంది ఎమ్మెల్యేలు.. మరికొందరు ఫిగర్ అంటున్నారు. కానీ ఎమ్మెల్యేలు ముంబై వచ్చాక పరిస్థితి తెలుస్తోందని వివరించారు. అంతా సర్దుకుంటుందని చెప్పారు. గొడవ నంబర్, పేపర్స్, స్ట్రీట్స్ అని.. ఆ మూడింటిలో శివసేన విజయం సాధిస్తోందని తెలిపారు.

డిప్యూటీ స్పీకర్ అపాయింట్‌మెంట్ కోరిన షిండే

డిప్యూటీ స్పీకర్ అపాయింట్‌మెంట్ కోరిన షిండే


మరోవైపు నిన్న రాత్రి ఏక్ నాథ్ షిండే డిప్యూటీ స్పీకర్‌కు లేఖ రాశారు. తమకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు. ఇప్పటికీ కాంగ్రెస్, ఎన్సీపీ.. శివసేన వెనకాల ఉన్నాయి. ఇప్పటికీ అసోంలో గల గువహటి రాడిసన్ బ్లూ హోటల్‌లో అసమ్మతి ఎమ్మెల్యేలు ఉన్నారు.

రౌత్ ఫైర్

రౌత్ ఫైర్


అంతకుముందు షిండేపై రౌత్ ఫైరయ్యారు బీజేపీ ఉచ్చులో చిక్కుకున్నారని ఫైరయ్యారు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మీకు అన్నీ ఇచ్చిన వారిపై ఇలా చేయడం ఏంటీ అని ఫైరయ్యారు. అంతేకాదు చాలా మంది ఎమ్మెల్యేలు తిరిగి రావాలని అనుకుంటున్నారని మరో ఎమ్మెల్యే కైలాస్ పాటిల్ అన్నారు. ఈయనను కూడా క్యాంప్‌నకు తీసుకెళ్లగా.. నితిన్‌తో కలిసి తప్పించుకుని ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే.

English summary
Maharashtra Politics cricis:central minister threatening ncp chief Sharad Pawar shiva sena spokesperson Sanjay Raut alleges.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X