వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హేమా ఉపాధ్యాయ్ హత్య: భర్త చింతన్ అరెస్టు

|
Google Oneindia TeluguNews

ముంబై: సంచలనం సృష్టించిన చిత్రకారిణి హేమా ఉపాధ్యాయ్ (43), ఆమె న్యాయవాది హరీష్ భంబానీ (65) హత్య కేసుల్లో హేమా ఉపాధ్యాయ్ తో విడిపోయిన ఆమె భర్త చింతన్ ఉపాధ్యాయ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

విచారణ పేరుతో చింతన్ ఉపాధ్యాయ్ ను సోమవారం పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. సుధీర్ఘంగా విచారించిన తరువాత మంగళవారం వేకువ జామున 3.30 గంటల సమయంలో చింతన్ ఉపాధ్యాయ్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

హేమా ఉపాధ్యాయ్, చింతన్ ఉపాధ్యాయ్ ల కు మనస్పర్థలు రావడంతో గత కొంతకాలంగా చింతన్ ఉపాధ్యాయ్ భార్యకు దూరంగా వేరుగా ఉంటున్నాడు. ఇద్దరూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. వారి విడాకుల వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది.

Chintan Upadhyay arrested in Hema Upadhyay murder case

గత ఆదివారం హేమా ఉపాధ్యాయ్, భంబానీల చేతులు తాడుతో వెనక్కి కట్టేసి హత్య చేసి కార్డు బోర్డు బాక్స్ ల్లో కుక్కి శవాలు విసిరివేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

అయితే ఈ హత్య కేసుల్లో హేమా భర్త చింతన్ ఉపాధ్యాయ్ హస్తం ఉంటుందని ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు చింతన్ ఉపాధ్యాయ్ ను విచారణ చేసి అరెస్టు చేశారు.

దంపతుల మధ్య సత్సంబంధాలు లేకపోవడం వలనే హత్యలు జరిగాయా, ఆర్థిక లావాదేవీల కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే చింతన్ ఉపాధ్యాయ్ అరెస్టు తో కేసు కొత్త మలుపుతిరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
Artist Chintan Upadhyay was on Tuesday arrested in connection with the murder of his wife Hema and her lawyer Harish Bhambhani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X